శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి
జీవన రేఖలు
పుట్టపర్తి అనూరాధ
పుట్టపర్తి అనూరాధ
శ్రీమాన్ పుట్టపర్తి నా రాయణాచార్యులు గారు
సాహితీ మహామేరువు.
అశేష శేముషీ విభవులు
మృదుమనస్వి.
కవితా యశస్వి.
బహుభాష తపస్వి
శతాధిక గ్రంధకర్త
వాగ్గేయకారుడు
కృతికర్త
భావుక చక్రవర్తి.
పండిత మండలీమార్తాండుడు.
శ్రీమాన్ ఆచార్యులవారు
అంతస్సీమల లోని
అనంతానుభవాల అనుభూతులకు
అక్షరాకృతి ప్రసాదించిన ప్రజ్ఞామూర్తి
సమ్మోహ శక్తి యుక్తులు కల వక్త.
తర్క వ్యాకరణాలంకార శాస్త్రాలను మధించి
వానిపై సాధికార ప్రభుతను చేజిక్కించుకున్న
శాస్త్రవేత్త.
వేదోపనిషత్తుల నుండి
నేటి కార్ల్ మార్క్స్ వరకు
జరిగిన సామాజిక సాంస్కృతిక మార్పులను
నిశితంగా విమర్శించి
నిగ్గుతేల్చిన విమర్శక శిరోమణి.
సంగీత సాహిత్యాలలో
సమప్రతిభను ప్రదర్శించిన ప్రతిభాశాలి.
డాక్టర్ పుట్టపర్తి పదునాల్గు భాషలలో
పదునైన ప్రవేశ ప్రావీణ్యాలను
సంతరించుకున్న మనీషామూర్తి
ఎనిమిది భాషలలో ఆశు కవితామృతాన్ని
తెలుగమ్మ గుమ్మంలో నిండుగ దండిగ పారించిన
అపర భగీరధుడు.
శ్రీమాన్ అయ్యగారు
ప్రాచీన నవీన కవితా యుగాల వారధి
శృంగార రచనా సింధువు
భక్తి కవితా బంధువు ;
ప దకవితా పారిజాతము
అనువాద రచనా సేతువు
నిరంతర అధ్యయన అధ్యాపన శీలురు.
ముక్కు సూటిగ నిజం మాట్లాడగల నైజం
వారికి జన్మతః వచ్చింది.
శ్రీ స్వామివారు
జీవితంలో ఎన్నెన్నో కష్టాలను అనుభవించారు
బీదరికాన్ని చవిచూశారు.
కాని ..
తాను నమ్మిన సరస్వతీ సమారాధనను మాత్రం
వీడని అకుంఠిత దీక్షాదక్షుడాయన
స్వయంకృషితో ఆంగ్లభాష నభ్యసించి
అసమాన ప్రజ్ఞా ప్రాభవాలను
ప్రదర్శించిన ప్రజ్ఞా వంతుడు.
ధనికులన్నా
ధనస్వామ్యవాదులన్నా
వారికి కొంత యేవగింపు
దేవుడొక్కడే కాదు
మానవత కల మనిషి కూడ
నాకు కావాలని అభిలషించిన మహా మనీషి.
జన్మ స్థలం : అనంతపురం జిల్లా చియ్యేడుగ్రామం
జననము :
ది. 28.03.1914 ఆనంద వత్సర చైత్ర శు ద విదియ శనివారం రాత్రి 10.30 ని.
తలిదండ్రులు :
సంస్కృతాంధ్ర సాహిత్య విద్వాంసులు
గొప్ప పౌరాణికులు
తెలుగు పండితులు
శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు వీరి తండ్రి .
కొడపి కాశీ పండిత వంశంలో జన్మించిన
మంచి విదుషీమణియైన లక్ష్మమ్మ గారు
ఆచార్యులవారి తల్లిగారు.
విద్యాభ్యాసము :
అలనాటి విజయనగర రాజుల రాజధానిగ పేరొందిన పెనుగొండ లోని
ఉన్నత పాఠశాలలో
ప్రాధమిక మాధ్యమిక విద్యలు
తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల నుండి
సంస్కృత శిరోమణి పొందారు.
వంశము :
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదాంకితులైన శ్రీ కృష్ణదేవరాయల వారి
కుల పురోహితులు
శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రబోధకులునైన శ్రీమత్తాతాచార్యులవారి వంశీకులు వీరు.
అభిరుచులు :
పండ్రెండేళ్ళ ప్రాయము నుండి
డెభ్భై ఆరేండ్ల వరకు
అవిశ్రాంతంగా ..
అవిచ్చిన్నంగా..
సాహిత్య వ్యవసాయం చేసిన
కవితా కృషీవలులు
సంగీత సాహిత్యాలలో సాటిలేని అభిరుచి
అవధానాలు చేయటంలో
అందెవేసిన చేయి
హరికథలు రచించటం
స్వయంగా కథలు చెప్పటం
వారికి అభిమాన పాత్ర విషయం
నాటకాలలో స్త్రీ పాత్రలు వేయటం బహు సరదా నాట్యశాస్త్రంలో వారికి అభినివేశం మెండు
స్వయంగా ఆయన వాగ్గేయకారులు
జ్యోతిశ్శాస్త్రాన్నీ మధించారు.
చిత్రలేఖనంలో కొంత పరిశ్రమ చేసారు
కాని అది అంతా సఫలం కాలేదు.
శ్రీకృష్ణదేవరాయల వారి పైన
విజయనగర సామాజిక చరిత్ర పైన
ఆచార్యుల వారికి యెనలేని
ఆదరాభిమానాలున్నాయి.
వివిధ భాషలు నేర్చుకోవటం
వారి అభిరుచులలో ప్రధానమైనది.
రచనలు :
1. పద్య కావ్యాలు :
పెనుగొండలక్ష్మి.
పాద్యము
షాజీ
గాంధీజీ మహా ప్రస్తానము
సిపాయి పితూరి
సాక్షాత్కారం
శ్రీనివాస ప్రబంధము.
భాష్ప తర్పణం
అస్త సామ్రాజ్జము (అముద్రితము)
సుధాకలశము
ప్రబోధము
తెనుగు తల్లి
వేదనా శతకము
చాటువులు
అస్త సామ్రాజ్జము (అముద్రితము)
సుధాకలశము
ప్రబోధము
తెనుగు తల్లి
వేదనా శతకము
చాటువులు
2. గేయ కావ్యాలు
జనప్రియ రామాయణం
అగ్నివీణ
శివతాండవం
మేఘదూతం
పురోగమనం
3. రచించిన కృతులు
అష్టాక్షరీ కృతులు 700, 250 ప్రచురితములు
3. ద్విపద కావ్యం
పండరీ భాగవతం
4. నవలలు :
ప్రతీకారం
ఉషః కాలము
రఘునాధనాయకుడు
అభయ ప్రదానము
5. వచన కావ్యములు
వ్యాససంపుటి
తెలుగు కన్నడ భారతాల తారతమ్య వ్యాసాలు ప్రాకృతోపన్యాసాలు
భగవద్గీతోపన్యాసాలు
ప్రబంధనాయికలు
రాయలనాటి రసికతా జీవనము
రామకృష్ణుని రచనా వైఖరి
విజయ తోరణము
విజయాంధ్రులు
సమర్థ రామదాసు
ఆంధ్ర మహాకవులు
విప్లవ యోగీశ్వరుడు
తెనుగు తీరులు
శ్రీ సాయి లీలామృతము
సరోజనీదేవి
నవ్యాంధ్ర వైతాళికులు
కర్మ యోగులు
వ్యాస సౌరభము
ఆంధ్రుల చరిత్ర
రాయల నీతి కథలు (అయిదు భాగములు)
అల్లసాని పెద్దన
ముక్కు తిమ్మన
వీర సావర్కర్
రామకథ
వాగ్గేయకారులు - పదకృతి సాహిత్యం
ప్రబంధనాయికలు
రాయలనాటి రసికతా జీవనము
రామకృష్ణుని రచనా వైఖరి
విజయ తోరణము
విజయాంధ్రులు
సమర్థ రామదాసు
ఆంధ్ర మహాకవులు
విప్లవ యోగీశ్వరుడు
తెనుగు తీరులు
శ్రీ సాయి లీలామృతము
సరోజనీదేవి
నవ్యాంధ్ర వైతాళికులు
కర్మ యోగులు
వ్యాస సౌరభము
ఆంధ్రుల చరిత్ర
రాయల నీతి కథలు (అయిదు భాగములు)
అల్లసాని పెద్దన
ముక్కు తిమ్మన
వీర సావర్కర్
రామకథ
వాగ్గేయకారులు - పదకృతి సాహిత్యం
6. వచన రచనలు
అరవిందయోగి
కందుకూరి వీరేశలింగం
బాల గంగా ధర తిలక్
సరోజనీదేవి
విప్లవ యోగీశ్వరుడు
విరహగోపి
ఆంధ్ర మహాకవులు
ఆంధ్ర చరిత్ర విజయ తోరణం
సమర్థ రామదాసు
తెనాలి రామకృష్ణుడు
ముక్కు తిమ్మన
అల్లసాని పెద్దన
7. ప్రాకృత భాసారస్వతం విజ్ఞాన సర్వస్వం ఆరవ సంపుటం
8. తెలుగు వాఙ్మయం పై మహారాష్ట్ర వాఙ్మయ ప్రభావము
9. విమర్శలు
అల్లసాని పెద్దన
7. ప్రాకృత భాసారస్వతం విజ్ఞాన సర్వస్వం ఆరవ సంపుటం
8. తెలుగు వాఙ్మయం పై మహారాష్ట్ర వాఙ్మయ ప్రభావము
9. విమర్శలు
విజయనగర సామాజిక చరిత్ర
మహాభారత విమర్శనము
రాయలనాటి రసికతా జీవనము
ఆంధ్ర వాగ్గేయకారులు
రామకృష్ణుని రచనావైఖరి తెనుగు తీరులు ప్రబంధనాయికలు
వసుచరిత్ర విమర్శ
వాదవిజయము
10. వ్యాఖ్యలు
10. వ్యాఖ్యలు
భాగవత సుధాలహరీ వ్యాఖ్య.
సంస్కృత గ్రంధాలు :
సంస్కృత గ్రంధాలు :
శివకర్ణామృతం
త్యాగరాజ ,అగస్తీశ్వర, మార్కాపుర చెన్నకేశవ,మల్లికార్జున సుప్రభాతాలు.
11. అనువాద సాహిత్యం :
మరాఠీ నుండి తెలుగుకు
బుద్ధ భగవానుడు
ఉషః కాల్ (నవల)
11. అనువాద సాహిత్యం :
మరాఠీ నుండి తెలుగుకు
బుద్ధ భగవానుడు
స్వర్ణ పత్రములు
భక్తాంచే గాధా ఉషః కాల్ (నవల)
సువర్ణ రేఖలు
వీరసావర్కార్ స్యాముని తల్లి మహారాష్ట్ర జీవన ప్రభాతం
మళయాళం నుంచీ తెలుగులోకి
కేరళ సింహ
తీరని బాకీ
కొందియిల్ క్కురు సిలైక్కు
(కేరళ విద్యామంత్రి నవల జోసెఫ్ ముండస్సెరి)
మిలట్రీ వాడా లోని జీవిత చక్రం
దక్షిణ కథా గుచ్చం
తీరని బాకీ నాటికలు
సెట్రక్కాడు కధలు
స్మశాన దీపం
హిందీ నుంచీ తెలుగులోకి
కబీరు వచనావళి
గాడీ వాలా (కథలు )
విరహ సుఖము
సంస్కృతం నుంచి తెలుగులోనికి :
చారుదత్తం (నాటకం )
కన్నడం నుంచి తెలుగు లోకి
కన్నడం నుంచి తెలుగు లోకి
సరస్వతీ సంహారం సంఘర్షణ
ఆంగ్లం నుంచీ తెలుగు లోకి
తలపులు మేరు పులు
అరవిందులు
తెలుగు నుంచీ మళయాళం లోకి
విశ్వనాధ ఏకవీర
తెలుగు నుండి ఆంగ్లం లోకి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ గేయం
భగవాన్ బుధ్ధ
కబీరు వచనావళి
గ్రంధాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.
12. ఆంగ్ల రచనలు
Leaves in the wind
Vain Glorious (Poems - 1966 Rotary Club Magazine)
The Hero
Bhagavatam (English Saptagiri)
13. పరిశోధనలు
విజయనగర సామాజిక చరిత్ర
జైనము
బౌధ్ధము
భాషాశాస్త్రములు
ప్రాకృత వ్యాసములు
మళయాళ భాషా వ్యాసములు
వసుచరిత్ర సాహితీ సౌరభము
మహా భాగవతోపన్యాసములు
మహా భారత విమర్శనము.
14.వ్యాసములు
గిరిక
సత్యాదేవి
సూరన్న ప్రభావతి
వరూధిని
సేతుబంధము
గౌడవహము
కుమార వ్యాసుడు-తిక్కన్న
రవీం ద్రుడు
గురజాడ
కన్నడుల ప్రాచీనత
నాదమయుడు త్యాగరాజు
యుగకర్త పెద్దన్న
మహాకవి విశ్వనాధ
రాళ్ళపల్లి
వజ్జలగ్గ
జసహర చరివు
కొన్ని సప్త శతులు
వసుచరిత్రలో వైచిత్రి
రాయలనాటి కవితా జీవనం
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
వర్నన విధానంలో పెద్దన సమ్యమనం
పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు
రామభద్రుని శయ్యలో ఒయ్య్యారం
స్వాతి తిరుణాళ్ సంస్కృత కృతులు
వేటూరి వారికి అంజలి
సంస్కృత నాటకాలలోని ప్రాకృతం
చంద్రోత్సవం
కథకళి సాహిత్యం
నన్నయ-పంపడు పోలిక
శ్రీనాధుడు మనస్తత్వము
గద్యపద్యములు - భిన్నత
అపభ్రంశము
ప్రాకృత భాష
శ్రీనాధుడు
శ్రీ కృష్ణ దేవరాయలు
అన్నమయ్య
15.స్వామివారు కైసేసిన పీఠికలు
ఋతుఘోష - గుంటూరు శేషేంద్ర శర్మ రచన
వేసవి వెన్నెల - ఆరుద్ర రచన
మెరుపులు మరకలు - గొల్లపూడి మారుతీ రావు రచన
కురుక్షేత్రం -గేయాలు - రామచంద్రరావు
రామచరిత మానస్ - వచనం ముంగర శంకర రాజురామ చరిత మానసామృతము - తులసీ దాస దాసి
రంభ ,తొలకరి చినుకులు - YCV రెడ్డి
త్యాగ రాజకీయము
గీతాశయము - వచనం - బాలయ్య శెట్టి
బళ్ళారి రాఘవ - వచనం - జానుమద్ది హనుమచ్చాస్త్రి
రాజశేఖర చరితము
మహా భారతము
కృష్ణ కథ విపంచి - కావ్యం - బాడాల రాయయ్య
ఇంకను ప్రసిధ్ధాంధ్ర కవుల గ్రంధాల కెన్నింటికో పీఠికలు వ్రాసారు.
16.పద్యాలూ గేయాలు
తార లక్ష్మణునితో
శ్రీ శివస్తుతి
వేడికోలు
ఆనతి
భిక్షు
ఆంధ్రావతరణము
హుంకారము
తొలితలపులు
నీరాజనం
పాద్యము
శ్రీ అరవింద దర్శనము
దశరధుని దేవేరులు
జలదమార్గము
చైనా పద్యాలు
ఆశ
ఓ భ్రమరీ..
17.సంపాదకీయాలు
తెలుగు సాహిత్య అకాడమీ ప్రచురించిన
వరాహ పురాణం
భామినీ విలాసం
శ్రీమదాంధ్ర మహా భారతము
(అశ్వమేధ స్వర్గారోహణ పర్వం వరకు )
18.ధారావాహికలు
1. "అనుభవాలూ- జ్ఞాపకాలూ" "లత" మాసపత్రిక (గుంటూరు నుంది 1964-65) జీవిత చరిత్ర
2. "పద్యంబొక్కటి చెప్పి.."
ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికం
3. "రాయలసీమ రత్నాలు"
ఆంధ్రప్రభలో ధరావాహికం
4. సాహితీ సమరాంగణ సార్వ భౌముడు శ్రీకృష్ణదేవరాయలు చైతన్య మూర్తులు
యువభారతి ప్రచురణలు
5. తెనాలి రామకృష్ణుడు
వ్యాస సంకలనం యువభారతి
6. "జసహర చరివు ..గవుడవహో"
తదితర ప్రాకృత కావ్యాల మీద అనేక వ్యాసాలు
"పరిశోధన" పత్రిక
19.నిర్వహించిన పదవులు
1. జ్ఞానపీఠ్ బహుమతి నిర్ణాయక సంఘ సలహాదారు
2. కేంద్ర రాష్త్ర సాహిత్య అకాడమీల విశిష్ట సభ్యత్వం
3. కేంద్ర విద్యాశాఖ సాంస్కృతిక శాఖల సలహా సంఘ సభ్యులు
4. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ పాలన మండలి గౌరవ సభ్యులు
5. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిశోధన కేంద్ర ప్రధాన పర్యవేక్షకాధికారి.
20.ఉద్యోగాలు
19.నిర్వహించిన పదవులు
1. జ్ఞానపీఠ్ బహుమతి నిర్ణాయక సంఘ సలహాదారు
2. కేంద్ర రాష్త్ర సాహిత్య అకాడమీల విశిష్ట సభ్యత్వం
3. కేంద్ర విద్యాశాఖ సాంస్కృతిక శాఖల సలహా సంఘ సభ్యులు
4. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ పాలన మండలి గౌరవ సభ్యులు
5. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిశోధన కేంద్ర ప్రధాన పర్యవేక్షకాధికారి.
20.ఉద్యోగాలు
శ్రీ కన్యకాపరమేశ్వరి సంస్కృత పాఠశాల ప్రొద్దుటూరు
ప్రభుత్వ కళాశాల అనంతపురం
శ్రీ రామకృష్ణ జూనియర్ కళాశాల కడప
దక్షిణ డేశ శాఖలలో రీడర్ తిరువా న్ కూరు విశ్వవిద్యాలయం
కేంద్ర సాహిత్య అకాడమీ గ్రంధాలయాధికారి
ఆకాశవాణి కడప కేంద్రంలో గౌరవ ప్రొడ్యూసర్
21. ఆచార్యులవారు అందుకున్న బి రుదులలో
కొన్ని ఇవి.
సంవత్సరం బిరుదు ప్రాంతం బిరుదమిచ్చిన సంస్థలు
1948 సరస్వతీపుత్ర హృషీకేశ్ స్వామి శివానంద సరస్వతి
1948 అభినవ పోతన గద్వాల గద్వాల మహాసభ
1951 వాగ్గేయకార రత్న జనగామ జనగామ సభ
1952 ప్రాకృత కవితా
సరస్వతి అనంతపురం అనంతపురం పుర ప్రబుఖుల సభ
1953 మహాకవి గద్వాల గద్వాల సాహితీ సమితి
1962 అభినవ నాచన
సోమన రాజంపేట రాజంపేట పుర ప్రముఖులు
1963 వ్రజభాషా భూషణ పొన్నూరు పొన్నూరు సభ
1964 సరస్వతీ తిలక పూనా పూనా మహాసభ
1968 అభినవ రామరాజ
భూషణ పెనుగొండ పెనుగొండ పుర ప్రముఖులు
1969 అత్యుత్తమోపాధ్యాయ ఢిల్లీ భారత ప్రభుత్వం నాటి సుప్రీం కోర్ట్
ప్రధాన న్యాయాధికారి శ్రీ కోకా సుబ్బారావ్
1972 సర్వతంత్ర స్వతంత్ర బెంగుళూరు బెంగుళూరు మహాసభ
1974 పద్మశ్రీ ఢిల్లీ భారత ప్రభుత్వం రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి గారు
1974 కవిసార్వభౌమ బాపట్ల బాపట్ల సాహితీ సంఘం
1975 డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.LiT) తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం
1976 అభినవ కాళిదాస కలకత్తా కాళీ చరణ్ బెనర్జీ
1985 డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.Lit) అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
1987 ఆంధ్ర రత్న హైదరాబాద్ మదర్ థెరెస్సా సన్మానితులు
1974 పద్మశ్రీ ఢిల్లీ భారత ప్రభుత్వం రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి గారు
1974 కవిసార్వభౌమ బాపట్ల బాపట్ల సాహితీ సంఘం
1975 డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.LiT) తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం
1976 అభినవ కాళిదాస కలకత్తా కాళీ చరణ్ బెనర్జీ
1985 డాక్టర్ ఆఫ్ లెటర్స్ (D.Lit) అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
1987 ఆంధ్ర రత్న హైదరాబాద్ మదర్ థెరెస్సా సన్మానితులు
22. స్వామివారు పొందిన సన్మాన సత్కారాలలో కొన్ని ఇవి
సంవత్సరం సన్మానించిన సంస్థలు
సంవత్సరం సన్మానించిన సంస్థలు
1933 శ్రీ శివ లింగ స్వామి అధ్యక్షతన పెనుగొండ సభ
1945 ఆంధ్ర విశ్వ విద్యాలయం విశాఖపట్నం
1950 తిరువనంతపురం విశ్వ విద్యాలయం
1953 ఆలంపూర్ లో తెలుగు కన్నడములు అంశం సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు
1956 కడప పుర ప్రముఖులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి అధ్యక్షతన
1960 ఢిల్లీ విశ్వ విద్యాలయం శ్రీ మోచర్ల రామకృష్ణయ్య గారి అధ్యక్షతన
1961 ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రధమ వారిషికోత్సవ సభ
1964 ఢిల్లీ ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవి సమ్మేళన సభ
1964 కలకత్తా ఆంధ్ర సంఘం
1964 ఢిల్లీ రష్యన్ కార్యాలయం
1967 ప్రొద్దుటూరు శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామివారు కంచి కామకోటి పీఠం
1976 నాగపూర్ శివాజీ వర్ధంతి సభ
1976-79 హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
5.3.1977 కడప షష్ట్యబ్ధి పూర్తి ఉత్సవం కడప ప్రముఖులు
1981 హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ
1987 కలకత్తా భారతీయ సాహిత్య పరిషత్
1989 గుప్త ఫౌండేషన్ సంస్థ
1945 ఆంధ్ర విశ్వ విద్యాలయం విశాఖపట్నం
1950 తిరువనంతపురం విశ్వ విద్యాలయం
1953 ఆలంపూర్ లో తెలుగు కన్నడములు అంశం సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులు
1956 కడప పుర ప్రముఖులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి అధ్యక్షతన
1960 ఢిల్లీ విశ్వ విద్యాలయం శ్రీ మోచర్ల రామకృష్ణయ్య గారి అధ్యక్షతన
1961 ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రధమ వారిషికోత్సవ సభ
1964 ఢిల్లీ ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవి సమ్మేళన సభ
1964 కలకత్తా ఆంధ్ర సంఘం
1964 ఢిల్లీ రష్యన్ కార్యాలయం
1967 ప్రొద్దుటూరు శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామివారు కంచి కామకోటి పీఠం
1976 నాగపూర్ శివాజీ వర్ధంతి సభ
1976-79 హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
5.3.1977 కడప షష్ట్యబ్ధి పూర్తి ఉత్సవం కడప ప్రముఖులు
1981 హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ
1987 కలకత్తా భారతీయ సాహిత్య పరిషత్
1989 గుప్త ఫౌండేషన్ సంస్థ
23. వారి రచనలు పొందిన పురస్కారాలు
జనప్రియ రామాయణం బాలకాండ
జనప్రియ రామాయణం బాలకాండ
కేంద్ర సాహిత్య అకాడమీ పురాస్కారం ఢిల్లీ
శ్రీనివాస ప్రబంధం 1988 ఖిల్వారా పురస్కారం
కలకత్తా భారతీయ భాషా పరిషత్తు
19. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద
19. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద
ఏర్పాటు చేసిన తెలుగు వైతాళికులు
శిలాప్రతిమల ఆవిష్కరణోత్సవంలో
తిక్కన ప్రతిమను పుట్టపర్తి వారిచే ఆవిష్కరింపజేసింది.
24. స్వామివారి పైన వారి రచనల పైన వెలువడిన గ్రంధాలు మరిన్ని విశేషాలు
ఇప్పటికి 11 ముద్రణలు పొందిన శివతాండవం
విడేశీ భాషయైన జర్మన్ లోకి
దే శీ భాషయైన దేశీ భాషయైన హిందీ లోకి అనువదింపబడింది.
విఖ్యాత కళా విమర్శకుడు
ఆనందకుమారస్వామిగారు
1914 లోనే శివతాండవం మీద ఆంగ్లంలో
ఒక వ్యాస సంపుటి ప్రచురించారు.
1977 లో
షష్టి పూర్తి సంచిక సాహితీ విస్మేరం
ప్రకటింపబడింది.
శ్రీ నృసింహ ప్రియ పత్రిక 1991 లో
శ్రీ నృసింహ ప్రియ పత్రిక 1991 లో
డా.పుట్టపర్తి స్మారక సంచిక ప్రచురించింది.
ఢిల్లీ దూరదర్శన్ కేంద్రం వారు
పుట్టపర్తి జీవితంపైన
ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని నిర్మించి
రెండు మార్లు ప్రసారం చేసారు.
హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు
వారి శివతాండవ కావ్యాన్ని
ప్రఖ్యాత మృదంగ విద్వాన్
శ్రీ ఎల్లా వేంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో
సంగీత రూపకంగా ధారావాహికంగా
సెప్టెంబరు నుండి పదహారు భాగాలు ప్రసారం చేసారు.
25.విశ్వవిద్యాలయాలలో వారి రచనలపై వచ్చిన పరిశోధన వ్యాసాలు
1. పుట్టపర్తి వారి సాహితీ మూర్తిత్వం
డాక్టర్ సోమలింగారెడ్డి ,నాగార్జున విశ్వవిద్యాలయం.
2. పుట్టపర్తి వారి ఖండ కావ్యములు.. శివతాండవము పరిశీలన ..ముద్రితం ..కాకతీయ విశ్వవిద్యాలయము.
2. పుట్టపర్తి వారి ఖండ కావ్యములు.. శివతాండవము పరిశీలన ..ముద్రితం ..కాకతీయ విశ్వవిద్యాలయము.
డాఅక్టర్ వఝ్ఝల రంగాచార్యులు కాకతీయ విశ్వవిద్యాలయము
26. పరిశోధన సాగుతున్న అంశాలు
1. పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధం కె.ఎల్లయ్య హైదరాబాద్
2. పుట్టపర్తి వారి జనప్రియ రామాయణం ఎన్ . లక్ష్మీకాంతరెడ్డి హైదరాబాద్
3. పుట్టపర్తి వారి గేయకృతులు గొల్లాపిన్ని శేషాచలం తాడిపత్రి
4. పుట్టపర్తి వారి సాక్షాత్కారం కె.మురళీకృష్ణ మద్రాసు
ప్రొద్దుటూరు పుర ప్రముఖులు
26. పరిశోధన సాగుతున్న అంశాలు
1. పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధం కె.ఎల్లయ్య హైదరాబాద్
2. పుట్టపర్తి వారి జనప్రియ రామాయణం ఎన్ . లక్ష్మీకాంతరెడ్డి హైదరాబాద్
3. పుట్టపర్తి వారి గేయకృతులు గొల్లాపిన్ని శేషాచలం తాడిపత్రి
4. పుట్టపర్తి వారి సాక్షాత్కారం కె.మురళీకృష్ణ మద్రాసు
ప్రొద్దుటూరు పుర ప్రముఖులు
పుట్టపర్తి వారి గౌరవ సూచకంగా
ది. 2.9.1991 న
శ్రీమాన్ నారాయణాచార్యుల వారి శిలావిగ్రహాన్ని ప్రొద్దుటూరులోని నాలుగురోడ్ల కూడలిలో
ప్రముఖ శ్రీ పెండేకంటి వేంకట సుబ్బయ్యగారి ద్వారా ఆవిష్కరింపజేసారు.
ఆ కూడలి కి "పుట్టపర్తి సెంటర్"
అని నామకరణం చేసారు.
27.పరమపదం 01.9.1990
25. శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి
25. శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి
రచనల కాపీలు
చాలావరకు నేడు మనకు దొరకవు
బ్రతకలేక బడి పంతులు
అన్న సామెతలో నిజమెంత వుందో తెలియదుగాని ఆయన తన స్వతంత్ర వ్యక్తిత్వానికి శిక్షగా
హైస్కూలు ఉపాధ్యాయులుగానే
జీవితం వెళ్ళబుచ్చుకున్నారు
తన రచనలను తానే ముద్రించుకుని
సొమ్ము చేసుకొనే గడుసుతనం
వారికి యే కోశానా లేనే లేదు.
సరికదా అబ్బలేదు ..
వారి అభిమానో శిష్యపరమాణువులో
ముద్రించిన పుస్తకాలు మాత్రమే
నేడు మనకు లభిస్తున్నాయి.
వారి కవితా కీర్తి కాంతకు
వారి అర్ధాంగి శ్రీమతి కనకమ్మ గారు మాత్రం
ఒక వజ్రాభరణం
శ్రీమాన్ ఆచార్యుల వారు అధ్యాపక వృత్తిని
సంతృప్తిగ నిర్వహించారు.
ఎన్నెన్ని నగరాలు గిరిగినా
ఎన్నెన్ని వైవిధ్యమైన ఉద్యోగాలు నిర్వహించినా
చివరికి
కడప గడప కే వారు పరిమితమైనారు .
శ్రీ స్వామివారిని అహమహమికగా
ఎనెన్నో కవితా బిరుదులు వరించినా
వారు చివరకు
సవస్వతీ పుత్రులుగానే స్థిరపడ్డారు.
సవస్వతీ పుత్రులుగానే స్థిరపడ్డారు.
దేశం నలుమూలలలోని సంస్థలు
వారిని సన్మానించినా
హితులు సన్నిహితులు మాత్రం
వారిని స్వామి యని
ఆత్మీయులు అయ్యగారూ
అని నోరారా పిలిచేవారు.
అదే వారికి మిక్కిలి ఆనందాన్ని కల్గించిన
అధ్భుత సన్మానం
అట్టి మహనీయుని సాహితీ పీఠ స్థాపన ద్వారా
సాహితీ విరాణ్మూర్తి భావాలను
సాహితీ సుమ సౌరభాలను
పదిమందికి పంచాలనే తపనతోనే
ఈ సంచికను సంతరించాం
ఇక రసాస్వాదన మీ వంతు.
జయంతితే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః
(స్వామివారి జీవిత విశేషాలను అందించిన
శ్రీశైలం గారికి, శ్రీమతి నాగపద్మిని గారికి మా సహృదయకృతజ్ఞతాంజలులు)
శ్రీశైలం గారికి, శ్రీమతి నాగపద్మిని గారికి మా సహృదయకృతజ్ఞతాంజలులు)
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి