10 అక్టో, 2012

నేను చూసిన మహాత్ములు సామవేదం షణ్ముఖశర్మ







మా శ్రీశైలం గారు
మొన్న పది గంటలవేళ ఫోన్ చేసి
అమ్మా ఋషి పీఠంలో అయ్యగారి గురించి 
సామవేదం షణ్ముఖశర్మ గారి వ్యాసం వచ్చింది

చాలా రోజుల తరువాత 
నిన్న అనుకోకుండా లైబ్రరీకి వెళ్ళాను
పుస్తకాలు తిరగేస్తున్న నాకు 
ఆ వ్యాసం అనుకోకుండా కళ్ళబడింది

ఎంతబాగా వ్రాసారమ్మా 
పుట్టపర్తి వారి గురించి
నాకు కనుల నీరు ఆగలేదు 
అంటూ రుధ్ధ కంఠం తో 
అమ్మా అది మీకు ఇప్పుడే మైల్ చేస్తున్నాను
అని పంపారు

చదివిన నాకూ గుండె మూగవోయి
కళ్ళు జలపాతాలై
ఏదో వేదన పట్టి కుదిపేసింది

ఇలాంటి వ్యాసాలు
మా అయ్యగారిపై రావటం కొత్త కాదు 
కానీచదివిన ప్రతిసారీ
అయ్యో 
అంత మహితాత్ముని పోగొట్టుకున్నామే
అన్న పరితాపం

శరీరం శాశ్వతం కాదు
పుట్టిన తరువాత వెళ్ళిపోవలసిందే
కానీ 
మా మధ్యనే వుంటూ
ఆ భగవస్స్వరూపాన్ని కనుగొననీయక 
కప్పేసిన ఆ విష్ణుమాయ
ఏమని చెప్పను

అందుకే 
ప్రతిరోజూ
అష్టాక్షరి కృతులను టైప్ చేస్తూ
మండుతున్న మనసును 
చల్లార్చుకుంటున్నాను

ఆ కృతులు 
పుట్టపర్తి వారు 
స్వయంగా రాగాలను కూర్చినవి
హార్మోనియంపై వివశులై 

ఆలపించి ఆలపించి మైమరచినవి

ఆ గడ్డ మీదే అన్నమయ్య అవతరించాడు
ఆ గడ్డ మీదే మా పుట్టపర్తి పురివిప్పాడు










3 కామెంట్‌లు :


  1. నేను ఎప్పుడో శివతాండవం,పెనుకొండ లక్ష్మి చదివాను.మిగతావేవీ చదవలేదు.నేను కడప జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్నెంటుగా ఉన్నప్పుడు(1977-1982)ఆయన అస్వస్థతతో అడ్మిటయారు .అప్పుడే వారిని చూడటం,మాట్లాడటం జరిగింది.ఆయన గొప్ప కవి, పండితుడు,బహుభాషావేత్త అని తెలుసును.మరొక విషయం; నా భార్య ప్రొద్దుటూరు హైస్కూలు లో చదివింది.చిన్నసారు ( పుట్టపర్తివారు,) పెద్దసారు (గడియారం వారు,) అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది.==Dr.M.V.Ramanarao.

    రిప్లయితొలగించండి
  2. ఋషిపీఠం ఈ సంచిక నేను ఎలా చదవకుండా పోయానో తెలియటం లేదు.

    ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం కొన్ని నెలల క్రితం వెళ్ళి చూశానండి. మీరు ఆ ఫుటోలు చూశారా?

    రిప్లయితొలగించండి
  3. చూశాను..

    ఆ ఋషి పీఠం సంచిక మా శ్రీశైలం గారి పుణ్యమే..

    రిప్లయితొలగించండి