తెనాలి రామలింగని కథలు మనకు తెలుసు తెలివి తేటలూ ..
హాస్యచతురత ..
సమయస్పూర్తి ఉట్టిపడే
తెనాలి రామలింగని వైఖరిని
అందరూ ఇష్టపడతారు. రామలింగడు తనను అందరూ ఇష్టపడటమారంభించేసరికి అందరి పైనా
సేవకులు మొదలుకొని రాయల వరకూ
తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు ఒకసారి ఒక వర్తకుడొచ్చాడు
'తనవద్ద మంచి జాతి గుర్రాలున్నాయని తనవద్ద కంటే రాయలవద్ద
అవి బాగా శోభిస్తాయనీ' కొనమన్నాడు
రాయలు అప్పటికప్పుడు
అతనికి బంగారు వరహాలను ముట్టజెప్పారు
రేపు గుర్రాలతో వస్తానని అతడెళ్ళిపోయాడు
రామలింగనికి రాయలవారి ధోరణి నచ్చలేదు ఇద్దరూ తోటలోనుండగా..
ఒక మూల నిలబడి ఏమో రాస్తున్న
రామలింగని చూసి
'ఏమి రాస్తున్నా వని 'రాయలడిగారు
అందుకు ..
నేను 'మూర్ఖుల జాబితా'
తయారు చేస్తున్నానని బదులిచ్చాడు రామలింగయ్య
ఆమూర్ఖుల జాబితాలో
మొదట రాయలవారి పేరే వుంది
మొదట తెల్లబోయి తరువాత ఆగ్రహించారు రాయలు
'ప్రభూ ..
ఎవడో వచ్చి తన వద్ద మంచి గుర్రాలున్నాయనగానే ..తమరు ధనమతనికి ముట్టజెప్పారు.. రేపు అతను రాకపోతే..?
అందుకే ..
మూర్ఖుల జాబితాలో మొదట మీ పే రుంచాను అని జవాబు ..
రాజు కొంచం ఆలోచించి .. "రామలింగా ..
రేపు అతను తిరిగి వస్తేనో ..?"అన్నాడు ఏమి బదులిస్తాడో చూస్తామని కొంచం తడబడిన రామలింగడు "మీ పేరు స్తానంలో అతని పేరుంచుతానని"
చమత్కరించి
అప్పటికాగండం నుంచీ బయటపడ్డాడు రాయలవారు నవ్వేసారు. అతని వైఖరికి కించిత్తు కోపగించినా
అయినా
అన్ని రసాలనూ అస్వాదించినట్టే
హాస్య రసాన్నీ రాయలవారు
ఆస్వాదించడం మొదలుపెట్టారు.
ఏ సంకట పరిస్తితి వచ్చినా ..
రామలింగని సమయస్పూర్తికి
అది దూది పింజలా ఎగిరిపోయేది.
అలాంటిదే ఇక్కడ ఒక పరిస్తితి తలెత్తింది. ఒక పండితుడు సభకు వచ్చాడు ..
'వాదింతాము రమ్మ'న్నాడు.. మన తెన్నాలి వాడూరకుంటాడా..? అసలే కృష్ణదేవరాయల అండతో పేట్రేగిపోతున్నవాడు అతని ముందు ఒక పద్యం వదిలాడు.. అది వినిన ఆ పండితుడు దిక్కుతోచక పలాయనం చిత్తగించాడు అది ఎలాగంటారా..? ఇదిగో.. ఇలాగే..
ఇది పుట్టపర్తి వారి 'పద్యం బొక్కటి చెప్పి..' లోనిది
తేజము సాధువృత్తమును తేకువ గల్గిన మర్త్యుడెప్పుడున్
ఆజికి నిట్లనున్ పరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్
తేజము సాధువృత్తమును తేకువలేని నరుండు నెప్పుడున్
ఆజికినిట్లనున్,పరుని యాలికి నిట్లను,నర్థికిట్లనున్"
ఇది కూడా కొంటెవాడైన రామకృష్ణుని చాటువే.
ఎవడో పండితుడు వానితో వాదించడానికి వచ్చినాడు.
'వాదము మరలా కానిస్తాములే
ముందీ పద్యానికర్థం చెప్పు' మన్నాడు.
తడుముకోకుండా గబగబాపద్యం చెప్పివేసినాడు.
ఆ వచ్చిన పండితుడు హటాత్తుగా వినపడ్డ
'అట్లనున్.. ఇట్లనున్ ..'
అనే మూగ పదాలతో గూడిన ఆ పద్యం విని బెంబేలెత్తినాడట.
వాడింక వాదించేదేముంది
మరల ఇలాంటి పద్యమే ఇంకోటి కూడా చెప్పుతాడేమో నని
పరారి చిత్తగించాడు.
రాయలవారి దగ్గర ఈ పద్యం ప్రస్తావన వచ్చింది.
'రామకృష్ణా భలే ఉపాయం చేసావయ్యా.
ఈ పద్యానికి నేవే అర్థం చెప్పు'మన్నాడు రాయలు
వెంటనే రామకృష్ణుడు కూచిపూడి భాగవతుల్లాగ లేచి నిలబడ్డాడు.
'తేజము గల్గిన వాడు ఆజికి ఇట్లనున్ '
అని పరాక్రమ ప్రదర్శనము అభినయించినాడు
'వస్తాను పదమంటా'డన్నమాట.
'పరుని ఆలు పిల్చినప్పుడు '
'ఇది ధర్మం కాదని '
నిరాకరణను అభినయించినాడు.
'అర్థికిట్లనున్ '
యాచకుని సాదరంగా బిలిచి దాన పధ్ధతిని అభినయించినాడు.
తేజము లేనివాడేం చేస్తాడు
ఆజికి బిలిస్తే 'నేను రాను ..రాను ..'
అని దండం పెడతాడు.
పరుని ఆలు పిలిస్తే
'రాను ..రాను'
అని సైగ చేస్తాడు ..
యాచకుడెవడైనా తటస్థపడితే
'దానమెక్కడుందని..?'
ఈసడించుకుంటాడు.
ఈ భావాలన్నీ మాటలతో చెప్పకుండా
'ఇట్లనున్ ..ఇట్లనున్'
అని మరుగులో మూసిపెట్టినాడు
కొంచమాలోచిస్తే అంత కష్టమేమీ కాదు
రామకృష్ణుడు తార్కికుడు.
ఈ వాసన వాని గ్రంధాలలో ప్రతిచోటా కనపడుతుంది. |
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి