మనం చచ్చిపోయిన వాళ్ళనీ ప్రేమిస్తాం..
బ్రతికున్నవాళ్లనీ ప్రేమిస్తాం..
దేవుళ్ళనీప్రేమిస్తాం..
ఆఖరికి ..
జంతువులని..
పశుపక్ష్యాదులనీ కూడ.. ప్రేమిస్తాం
ఒకసారి..
మేం బస్సెక్కడానికి వచ్చాం..
సన్నగా చీకటి పడుతోంది..
మేతకు వెళ్ళిన ఆవులు ఎద్దులు దూడలూ
ఇళ్ళకి మళ్ళుతున్నాయి..
కమ్మటి పేడవాసన ..
రేగుతున్న ధూళి గమ్మత్తుగావుంది..
ఇంతలో ఒక లేగ దూడ వచ్చి
మా శ్రీకాంతును గుర్తుపట్టి...
ఆప్యాయంగా వాణి చేయినినాకటం మొదలు పెట్టింది..
ఎంగిలి లాంటి జిగట పదార్థం
దాని నోటి వెంట కారుతోంది..
ఆ జిగటను అది నాకటంతో
కాంతు మోచేయి వరకూ పూసింది
కాంతు పట్టించుకోనేలేదు..........
వాడు ఇటుతిరిగి
దాన్ని ప్రేమగా మెడకింద నిమిరాడు కాసేపు..
కావలించుకున్నాడు దాన్ని
ఏంటిరా అది అట్లా నాకుతూంది అంటే
"ఊ ..నాకనీ..
ప్రేమ పిన్నమ్మా.. ప్రేమ..
ఇది పుట్టినప్పటినుంచి నా దగ్గరే కదా వుంది..
అందుకే..
ఇప్పుడు సాకలేక ..చాకిరీ చెయ్యలేక వదిలేశాం
అక్కడా ఇక్కడా దొరికినవి తిని బతుకుతూ వుంది ..
పో ..పో..
బసవా పో .. "అన్నాడు..
అది వదల లేక..
వదల లేక వెళ్ళిపోయింది మిగతా గుంపుతో..
ఇది ప్రేమ కాదా...
కొందరు గొప్పవాళ్ళు ప్రేమనేమన్నారో చూద్దాం
- ప్రేమవల్ల, జ్ఞానం వల్ల జీవితం స్పూర్తి పొందుతుంది--బెర్ట్రాండ్ రస్సెల్స్.
.థామస్ జే ఓర్ద్ అనే మతాచార్యుడు ప్రేమగురించి ఇలా చెప్పాడు. ప్రేమ అనేది
"ఇతరులపై దయ కలిగి ఉండి, అందరి శ్రేయస్సును కోరే ఉద్దేశ్యపూర్వక చర్య".
తత్వవేత్త ఐన గాట్ఫ్రైడ్ లేఇబ్నిజ్ ప్రకారం ప్రేమ అనేది "మరొకరి సంతోషాన్ని చూసి ఆనందించడం".
ప్రేమలు అప్పుడూ ఉన్నాయి
అప్పుడు ప్రేమ త్యాగం కోరుతుందని చెప్పే వాళ్ళు
"నీ సుఖమే నే కోరుతున్నా.."
అని పాడుకోవటానికి ఓ పాటా వుంది..
కానీ ఇప్పుడు.
"నాకు నీవు దక్కక పోతే.. నిన్ను చంపేస్తా.."
అని యువత గంగ వెర్రులెత్తుతోంది ఎందుకో..
ఇంక గతజన్మల ప్రేమలూ
మనకు సినిమాలుగా వచ్చాయి
మూగ మనసులు అందులో ఒకటి
"తగ జన్మ లేదు ..తొక్కా లేదు .."
అని కొట్టి పారేసే వాళ్ళను వదిలేస్తే
ఇలాంటి వృతాంతమే భట్టబాణుడిదీ నని
ఆయన ప్రేమించి ప్రేమించి
విరహంతో కన్నుమూసిన యాభై యేళ్ళ తరువాత
"నేనే భట్టబాణుని గతజన్మ ప్రేయసినని .."
ఒక శ్వేతసుందరి భారతదేశం వచ్చి..
బాణుని గురించి ఎంతో సమాచారాన్ని సేకరించి
హజారీ ప్రసాద్ ద్వివేదికి ఇచ్చి వెళ్ళిపోయిందట..
పుట్టపర్తి వారు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఈ విషయాన్ని పురాణం సుశీల గారు 2007 లో ప్రకటించారు
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి