20 ఏప్రి, 2013

పుట్టపర్తి జనప్రియం - శ్రీ గొల్లాపిన్ని శేషాచలం




"రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యుత్సకీ భవతి యత్సుఖొతోపి జంతుః
తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం
భావ స్థిరాణి జననాంతర సౌహృదాని"

( శాకుంతలం.. కాళిదాసు)

రమ్యమైన దృశ్యాన్ని చూచినా 

మధురమైన శబ్దాన్ని విన్నా 
సౌఖ్యాన్ని పొందే మనిషి త్నకు
 తెలియని ఉద్వేగాన్ని చెందుతాడు 

ఎందుకు అంటే 

అతడు బహుశా 
జననాంతర అనుబంధాలను 
స్మరిస్తూ ఉండడం వలన కాబోలు 
అని మహాకవి కాళిదాసు అంటారు

శ్రీమాన్ పుట్టపర్తి జనప్రియ రామాయణం 

చదువుతూ వుంటే 
ఒక ఆనందం ఒక అనుభూతి ఏదో నాకు కలిగేది.
 బహుశా అది పాడుకోవడానికి అనుకూలం కావొచ్చు శ్రీమద్రామయణంపై గల అభిమానం కావొచ్చు 

ఈ జనప్రియపై నాకు కలిగే మనో భావాలను 

పరిశీలనా దృష్టితో ప్రతిబింబించాలనే 
తలంపు కూడా కావచ్చు 
అంటారు పుట్టపర్తి జనప్రియ రామాయణాన్ని 
పి హెచ్ డి లో అద్భుతమైన పరిశోధనా గ్రంధాన్ని  
"పుట్టపర్తి జనప్రియం"
 అన్న  పేరుతో వెలువరించిన 
శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు

గొల్లాపిన్ని పుట్టపర్తిని 

తన పదమూడు పధ్నాలుగు ఏళ్ళ వయసు
నుంచీ చూశాడట. 

పుట్టపర్తి వారు ఆయనకి హయగ్రీవాన్ని కూడా ఉపదేశించారట అప్పట్లో..

ఆ పిల్లవాడు పెరిగి పెద్దై 

గురువుగారి గ్రంధాన్నే పి హెచ్ డి చేసాడు

పుట్టపర్తి తన రామాయణానికి జనప్రియమని యాదృఛ్చికంగా పెరిడలేదు 

అది ముద్రణకు నోచుకోక పూర్వమే
 పలు సభలలో గానం చేయబడింది
 జన సముద్రాలు ఆనందోత్సాహ తరంగాలు 
కద లి ఆడినాయి 
అంటారు 


ఇప్పుడు నేను ఈ గ్రంధంలోని  

శ్రీ శలాక రఘునాధ శర్మ గారి అభినందన లేఖను మీకు పరిచయం చేస్తాను.

ఆయనేమంటారంటే

"ఒక విశ్వనాధనో .. 

ఒక పుట్టపర్తినో ..
అనుశీలించడం ఆషామాషీ వ్యవహారం కాదు.. 
ఒకరు బ్రాహ్మీమయ మూర్తి ..
మరొకరు సరస్వతీ పుత్రుడు.. 
ఈ పదబంధాలు కేవలం 
అలంకారప్రాయమైన బిరుదాలు కావు. 
అక్షర సత్యాలు..."

అని


తులసీదాసుకు అంకిత శిష్యుడు పుట్టపర్తి 

రంగనా ధ రామాయణం కూడా 
ద్విపద లో ఉండటం వల్లనే 
పల్లె పట్టణాలలో ఇప్పటికీ రామాయణాన్ని 
అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు. 
అందుకే షట్పదిగా శివతాండవాన్ని చూపి 
గేయరచనలో తన పట్టును నిరూపించుకున్నవాడుపుట్టపర్తి

"వారిది ఒక విలక్షణమైన ప్రకృతి .. 

ఆయన తత్త్వమిట్టిదని నికరంగా తేల్చి 
నిర్ణయంగా చెప్పడానికి వీల్లేని 
జటిలమైన వ్యక్తిగా పుట్టపర్తి మనకు దర్శనమిస్తాడు. 

హరికథలు పాడుతాడు

పురాణాలు చెప్పుతాడు
కర్మజ్ఞాన భక్తి సిధ్ధాంతాలను విపులంగా ఉపన్యసిస్తాడు
స్వర్గ నరక పూర్వజన్మ లను ప్రతిపాదిస్తాడు
మరాలా వాటినే విమర్శిస్తాడు.
మార్క్స్ సిధ్ధాంతాన్ని అధ్యయనం చేస్తూనే 
పుష్కల భక్తి భావ కుసుమాలను 
గేయాల్లో కీర్తనల్లో రచనల్లో పురాణ ప్రవచనాల్లో వెదజల్లుతాడు..."

అన్నారు డా.హెచ్.ఎస్ బ్రహ్మానంద గారు

త్వరలొ నా బ్లాగులొ చూద్దురుగాని 
ముందిది చదవండి .. 



















కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి