అవి పుట్టపర్తి చివరి రోజులు.. ''శ్రీ శివలీలా స్తవాన్ని'' ఆ రోజుల్లో శిష్యునిగా భక్తునిగా ఇంటికి తరుచూ వచ్చే లక్ష్మీ కాంతం శ్రేష్టి చేతిలో పెట్టారు ప్రచురించమని
పుట్టపర్తి వ్రాత అర్థం కాక తిరిగి అడిగితే ఆగ్రహిస్తారేమో నన్న భయంతో కొన్నాళ్ళు.. సంస్కృత శ్లోకాలను .. అవీ శివ పార్వతుల శృంగార ప్రధానమైన వానిని ప్రజలు యే విధంగా అర్థం చేసుకుంటారో నని కొన్నాళ్ళూ కాలయాపన చేసారు..
ఈలోగా పుట్టపర్తి పరలోక గతులయ్యారు. తరువాత తన గురువు చివరి కోరిక తీర్చలేకపోయానన్న బాధ లక్ష్మికాంతం శ్రేష్టిని ఆవరించింది ఆయన తన ప్రెస్సుకు వచ్చిన బ్రహ్మశ్రీ అయిలావఝ్ఝుల రామకృష్ణ శాస్త్రి గారిని వనిని కాస్త అర్థం అయ్యేలా వ్రాసి ఇమ్మని అర్థించాడు వానిని పరిశీలించిన ఆయన పార్వతీ దేవి అంగాంగ వర్ణన ఒక్క ఆది శంకరులకే చెల్లింది.. మరి పుట్టపర్తి వారి ఈ శ్లోకాలను ఏ విధంగా అర్థం చేసు కోవాలని ఆలోచించి క్షేత్రయ్య అన్నమాచార్యులు జయదేవుడు నారాయణ తీర్థులూ భగవంతునిపై శృంగార కీర్తనలు చేసారు.. అనుకొని.. పుట్టపర్తి ఆధ్యాత్మిక సాధనావిశేషములను పూర్తిగా తెలిసిన వాడవటంచేత.. అట్టి వ్యతిరేక అనుకూల భావాలు వారి వారి ప్రాక్తన జన్మార్జిత సుకృత దుష్కృత పరిణామ ఫలానుసారంగా ఏర్పడతాయని భావించి ఎత్తివ్రాయడమే కాదు శ్లోకాలు చాలా ఇంపుగా వున్నాయి వీనికి తాత్పర్యం కూడా వ్రాస్తాను అని అడిగారు శ్రేష్టి సంతోషంతో ఒప్పుకొని పుస్తకాన్ని ముద్రించారు అదే ఇది.. మా తండ్రి కలను నెరవేర్చడంలో నేనూ పాత్రధారి నైనాను వారి దివ్యాశీస్సులు నాకూ అందుతాయి ఒకసారి లక్ష్మికాంతం శ్రేష్టితో ఫోన్ లో మాట్లాడాను ఎంత సంతోషపడ్డారో చెప్పలేను ఆరోజుల్లో చాలామంది మంత్రోపదేశం చేయమని అయ్య అమ్మలను ప్రాణాచారం పడేవారు కానీ అందరికీ మంత్రం ఇచ్చేవారు కాదు.. కొందరికి ఏవో స్తోత్రాలు..చెప్పి పంపేవారు.. నీకు ఇదే సరిపోతుంది దీనినే త్రికరణ శుధ్ధిగా చేయి అనేవారు కానీ కొందరు విడిచేవారు కాదు పలురకాలుగా ఇబ్బంది పెట్టేవారు అయ్యను నీడలా నుసరించి వారికి సేవలు చేసి పురాణానికి వెళ్ళే టప్పుడు వెనుక భాగవతం పట్టుకుని నడిచీ ఏవేవో చేసే వారు వారి దృష్టిలో పుట్టపర్తి భగవత్స్వరూపుడే.. ఎవ్వరెన్ని చెప్పినా వారే ఎన్ని చూచినా పట్టించుకొనే వారు కాదు. అయ్య తప్పించుకోవటానికి 'మీ అమ్మ దగ్గరికి పో..' అని పంపే వారు.. అమ్మ ఇక తప్పక.. వారికి యేదో చెప్పి పంపేది.. అలా యెన్నో సంవత్సరాలు అనుసరించిన వాడే నా గురుదేవులు వ్యాసం వ్రాసిన రఘూత్తమ రావు.. రఘూత్తమ రావ్ ద్వారా ఏవేవో అనుభవాలను విన్న వారు మాకూ అయ్యను మంత్రోపదేశం చేయమని చెప్పు అని బ్రతిమాలేవారు.. ఒక్కో సారి అయ్య ఒరే .. నా ఆశ్రయం పొందితే ఉన్నవి కూడా పోతాయి సర్వ భ్రష్టుదవవుతావు.. లెక్కలేనన్ని కష్టాలు చుట్టుముడతాయి.. అవి నీవు భరించలేవు.. పరమాత్మ నీ మానసిక శక్తిని పరీక్షించి వదులుతాడు.. ఎందుకీ బాధ.. ''మీ అమ్మ దగ్గరికి పో.. ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతావు..'' అని చెప్పేవారు అన్యాపదేశంగా నేను నారాయణ స్వరూపుడిని మీ అమ్మ లక్ష్మీ స్వరూపం అని చెప్పక చెప్పినట్లే కదా అని ఆనాటి భక్తులూ శిష్యులూ పరవశంతో అనుకొని ఇంకా ఇంకా వెంటపడేవాళ్ళు.. అన్నట్లుగానే.. రఘూత్తమ రావ్ అయ్యను ఆశ్రయించిన కొన్నేళ్ళకే ఆయన భార్య. ఎదిగిన కొడుకూ వయసొచ్చిన కూతురూ.. హటాత్తుగా కన్నుమూసారు.. ఈ విషయాలు చిన్నపిల్లలమైన మాకు బాధపడుతూ కాక అదేదో ఒక తమాషా సంఘటనలాగా చెప్పేవాడు రఘోత్తమరావ్ సారు అమ్మను ఆశ్రయించి అన్ని కష్టసుఖాలలో అమ్మకు చేదోడుగా వున్న మా అన్నయ్య మాలేపాటి సుబ్రమణ్యం చదివింది అయిదో క్లాసు అయినా చిన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరి.. Oriental General Insurance కు Divisional Manager స్థాయికి ఎదిగాడు..
''అయ్యకు చేతబడి విద్య కూడా తెలుసమ్మా..'' అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు లక్ష్మీకాంతం శ్రేష్టి.. ''కానీ అయ్య వానినెప్పుడూ దుర్వినియోగం చేయలేదు..'' అన్నాడు కూడా..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి