27 మే, 2013

చిలుప చిలుపని మురువు ..


7 కామెంట్‌లు :

  1. ఆహా..తేనెలొలికే తెనుగు. అర్థం తెలిస్తే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. . చిలుప చెమ్మటలు క్రొంజెక్కులమించ." విష్ణు. పూ. ౧, ఆ.
    (ఇది ద్రవవస్తువునకే విశేషణముగాఁ గానబడుచున్నది. అప్పుడు చిలుపని అని రూపము.
    "ఎ, గీ. చిలుపచిలుపని నేతుల జిడ్డుదేఱు." స్వా. ౪, ఆ.)
    అందంగా కురిసే మేఘుని చిరు చిరు జల్లులు సోకి
    భూదేవి మేనిపై అత్తరుల తావులట ..
    యీ 'అత్తరుల తావి' పదము కూడా బాగుంది.
    మొగ్గలను దొడిగి యున్నట్టి కందళి అంటే ఓ పొద

    గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారూ అన్నమాచార్యుల ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నప్పుడు కొన్ని అన్నమయ్య పద ప్రయోగాలపై చర్చించడానికి అదేపనిగా కడపకు వచ్చేవారు.
    అన్నమయ్య కీర్తనలపై ఎన్నో రాగాల నోట్సు వ్రాసుకున్న పుట్టపర్తి వారు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే వారు.. అలా కొన్ని అన్యాక్రాంతమైపోయాయి కొందరికి నీపేరుపై వేసుకో పోప్పా అని ఇచ్చేవారు..
    అలా కొన్ని ఆనాటి కామిసెట్టి శ్రీనివాసులు భద్రపరచారు..
    అలా కామిసెట్టి ఎప్పుడో రికార్డ్ చేసి దాచిందే ఈనాడు శివతాండవం CD గా వచ్చింది..
    అలా వారి స్నేహం దాంపత్యం లానే కలకాలం నిలిచింది..
    నా పెళ్ళిలో
    గౌరిపెద్ది మామ
    చిన్నపని పెద్దపని అన్నీ తనపై వేసుకున్నారు
    నన్ను తన బిడ్డలానే పెళ్ళి చేసి పంపారు
    అప్పటికి అమ్మ లేదు కదా..
    అలా అనుకున్నారో ఏమో మరి..
    కూర్చుని పని పురమాయిస్తున్న పుట్టపర్తి వారిని చూచి
    చెప్పనీవయ్యా ఆయన భర్త నేను భార్య ఆయన ఏమి చెప్పినా నేను చేయవలసిందే
    అన్నారట..
    ఆనాటి బాంధవ్యాలు జన్మాంతర బంధాలుగా వుండేవి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వావ్..ఇలా ఒక్క అన్నమయ్య వ్రాయగలడు, ఆ తర్వాత అయ్యగారేనేమో! బయట వర్షమూ వస్తూ ఉంది! ఇది కదా తెలుగంటే!

      గౌరీపెద్ది వారి గురించి మీరు చెప్పింది హృద్యంగా ఉంది.

      తొలగించండి
  3. మీకు తెలియని అర్థాలా రవీ..
    'పుస్తకం'లోని మీ సాక్షాత్కారము వ్యాసాన్ని నేను సాక్షాత్కారము పుస్తకాన్ని సమర్పించేటప్పుడు ముందు మాటగా వేసుకోవాలనుకుంటున్నాను..
    సరేనా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా వ్యాసమా !! (నా కొక్కిరి రాతలు చూసి నాకే సిగ్గుగా ఉంటుంది. అయితే మన వైతాళికుల గురించి ప్రజలు తెలుసుకుంటారన్న ఒకే కోరికతో ఇట్లాంటివి రాయాలనిపిస్తుంది)

      అయ్య పాండిత్యం ఒక శిఖరమైతే నేనొక చీమ వంటి వాణ్ణి. ఎలా చెప్పాలో తెలీదు, సరే తప్పకుండా వేయండి. మీరు కావాలంటే - గొల్లాపిన్ని శేషాచలం గారు సాక్షాత్కారము పై వ్రాసిన వ్యాసమూ నా దగ్గర ఉంది. (పుట్టపర్తి జనప్రియం పుస్తకం నుండి). అది కూడా స్కాన్ చేసి పంపుతాను.

      తొలగించండి
    2. నా వ్యాసం తీసుకుంటే - ఈ వ్యాసం పుస్తకం.నెట్ లో వచ్చిందని ఒక్క మాట చెప్పమని నా మనవి. ఏమనుకోవద్దు.

      తొలగించండి