పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
5 ఆగ, 2013
"సరస్వతీ సంహారము" 1959 లో వచ్చిన సమీక్ష
Show Details
ఇది పుట్టపర్తి వారి సరస్వతీ సంహారము
(
కన్నడ రచయిత బీచీ నవలకు పుట్టపర్తి తెలుగు అనువాదం)
పై
1959
వచ్చిన సమీక్ష
ఆనాటి స్త్రీ పై రుద్దిన సాంఘీక దురాచారాలకు
ఒక నమూనా యీ నవల
కన్నడభాషలో ప్రసిధ్ధ రచయిత
"బీచీ "
పేరొందిన రచన ఇది
"
పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..
?"
అంటే
"
గొంతు పిసికి బాయిలో వేస్తాను"
అన్న వాక్యాలతో ప్రారంభమైన కథ
ఆ మాటలతోనే ముగుస్తుంది
ఈనాడు స్త్రీ స్వేఛ్చ కై
ఎవరూ పోరాడవలసిన అవసరం లేదు
కావలసిన చదువులు చదువుతున్నారు
విదేశాలకు వెళ్ళుతున్నారు
నచ్చిన వాణ్ణిపెళ్ళాడుతున్నారు
వారి పిల్లలనూ వారి అభిరుచులకు అనుగుణంగా పెంచుతున్నారు
ఒకవేళ పెళ్ళి జరిగిన తరువాత
భర్త ప్రవర్తన ..
ఆ ఇంటి వారి ట్రీట్మెంట్ సరిగ్గ లేకపోతే
ఎంతో ధైర్యంగా
వివాహ బంధాలను తెంచుకొని
స్వతంత్రంగా బ్రతకటానికీ
ఈనాటి స్త్రీ భయపడటంలేదు
"
కార్యేషుదాసీ..
కరణేషు మంత్రీ.."
లాంటి ధోరణులను తేలిగ్గా పాత చింతకాయ
పచ్చళ్ళుగా చేసేస్తూంది..
అందుకు తగ్గట్టు
తలిదండ్రుల ఆలోచనా ధోరణీ ఎంత మారిందంటే
భర్త చనిపోయిన తమ కుమార్తెకు
ఇంకో భర్తను ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా వెతుకుతున్నారు
ఆమె మొదటి భర్త సంతానమేమైనా వుంటే
వారి పెంపకం బాధ్యతను తాము స్వీకరించి
తమ కూతురి
సుఖ సంతోషాలకు
తమ వంతు సహాయం చేస్తున్నారు
యువకులు కూడా
తమ సహృదయ భావనలను
ఇనుమడింపజేసుకొని
ఒకసారి పెళ్ళయిన స్త్రీ నుదుటన
తిరిగి కుంకుమ దిద్దటానికి వెనక్కు తగ్గటం లేదు
"
పవిత్రత" అనేది
ఆడ మగలిద్దరికీ వర్తిస్తుందనీ
అంగీకరిస్తున్నారు.
ఈనాడు స్త్రీకి ఏవిధమైన ఆటంకాలూ
ఏరంగంలోనూ లేవు..
కానీ
ఒకనాడు పరిస్థితి ఇలాలేదు
స్త్రీ ఒక బలిపశువు
తల్లిదండ్రుల అత్తమామల ఒడంబడికకు
తలవూచి పుట్టింటి చెరసాల నుంచీ
అత్తింటి చెరసాలకు తరలివెళ్ళే ఒక జీవి
అంతే
ఒకనాడు పందెంలో పెట్టబడింది
మరోనాడు అంగడిలో అమ్మబడింది
ఇంకోనాడు కారడవులకు పంపబడింది
శీలపరీక్షకు అగ్నిలోనూ దూకమన్నారు
ముసలి వరుళ్ళకు
ముక్కుపచ్చలారని పిల్లను కట్టటం మనం విన్నాం
ఆ పిల్లకు
యవ్వనం రాకముందే ఆ ముసలి చస్తే
కఠినాతి కఠినమైన నిబంధనలకు
బలియైన కన్నెల జీవితాలను
మనం చదువుకున్నాం
గుండు గీయించారు
బొట్టూ పూలు రంగుల బట్టలూ నిషేధించారు
తెల్ల చీర చుట్టబెట్టారు
ఉపవాసాలూ ఉప్పూ కారం లేని తిళ్ళూ తినమన్నారు
కదూ..
ఇలాంటివానిని దురాగతాలన్నారు వీరేశలింగం
కన్యాశుల్కంగా కలమెక్కించారు గురజాడ
అలాంటి ఒక కథే ఈ సరస్వతీసంహారము
ఆ రోజులలో అందరి ఆదరణా పొందిన నవల
అందుకు తగ్గని చిత్రణతో
మన్నన పొందిన అనువాదం
ఇప్పుడు మీరు చదవబోతున్నది
ఆ అనువాదానికి జరిగిన సమీక్ష..
సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం
కామెంట్లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి ( Atom )
కామెంట్లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి