ఒక గాయకుడు పాడుతున్నాడు
రెండు లైన్లు పాడాడో లేదో కట్..
మళ్ళీ ప్రా క్టీసు మళ్ళీ రికార్డింగ్
మళ్ళీ రెండు లైన్లు
'కట్స్ ఎక్కువైపోతాయేమో '
'పర్లేదండీ ..మనం ఎడిటింగ్ చేసుకుంటాం కదా..
'మీరు కన్వీనియంట్ గా పాడండి'
ఇదీ తంతు
ఒక పాటను వంద ముక్కలు చేసి పాడటం
అన్నీ జోడించి ఒకపెద్ద అతుకు చేయడం
'పాడుతా తీయగా 'లో ఎస్పీ
ఒక్కొక్కరిని ప్రశంసిస్తుంటాడు
యీ పాటను నేను నాలగైదు బిట్స్ గా పాడాను
మీరు ఒకే టేక్ లో పాడారు
అందుకు మిమ్మల్ని అభినందించాలి అని
అదే యుగళగీతమనుకోండి..
మేల్ సింగర్ వచ్చి తన ట్రాక్ పాడేసి వెళ్ళిపోతాడు
ఆనక ఫిమేల్ సింగర్ తన ట్రాక్ పాడి
ఆవిడా ఎల్పోతుంది
మన అతుకుల మాస్టారు తీరిగ్గ అతుకులు పెట్టుకుంటాడన్నమాట..
ఒకసారి మంచి ఎఫెక్ట్ తో పాట బయటికి వచ్చిందా
అది రికార్డ్ గా నిలబడిపోతుంది
అదే గాయకుడు
మళ్ళీ అంత భావస్ఫోరకంగా పాడలేకున్నా
అతన్ని జనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు.
మరి గ్రామఫోన్లు టేప్ రికార్డర్లూ లేని కాలంలో..
గాయకుడు ప్రతి కచ్చేరీలో తన్ను తాను నిరూపించుకోవలసివచ్చేది
గాత్రాన్ని కాపాడుకోవటమూ
నిరంతర సాధన చేసేవారు
పుట్టపర్తి వారు
సంప్రదాయ సంగీతాన్ని
ఆస్వాదించడంలో ఉన్న తృప్తిని
పాశ్చాత్య సంగీతానికీ
మన సంప్రదాయసంగీతానికీ తేడాను
చెబుతున్నారు
సంగీతమునకు రాగము ప్రధానమంటిమి..
పదమేమో చిన్నదే..
దాని పరివారము గంపెడు..
మూర్ఛనలు..
గ్రామములు..
గమకములు మొదలైనవి..
వాది ..వివాది ..స్వరసంచయమును
గమకములు లేని రాగము రోగమే
ప్రపంచమునందే భారతదేశ సంగీతమునకొక వైశిష్ట్యమును తెచ్చిపెట్టినది గమకము
పాశ్చాత్యులు రాగము నెరుగరు
వారి గానమంతయు స్వరములే
ఆ స్వరములును వాగ్గేయకారుడు కూర్చినవే..
గాయకునకు చిన్నమెత్తు స్వాతంత్ర్యము లేదు
వాడు రాసినదానిని వీడు చిలుకవలె నొప్పించును
మన గానమట్లు గాదు
వాగ్గేయకారుడిచ్చిన కృతి రాగ తాళములు అల్పాల్పములైన సాధనములు
ఆచట్టములో గాయకుడు
బ్రహ్మండమైన గంధర్వ నగరమును సృష్టింపవలెను
గంధర్వ నగరమని యేల నంటిననగా వాని సృష్టి యెప్పటికప్పుడు పుట్టిగిట్టునది..
ఇప్పుడైనను గొంతమేలు
టేపురికార్డింగు మొదలైన కొత్త కొత్త సాధనములు కొన్ని యనుకూలములు గల్పించినవి
ఆ యనుకూలములును గొంతవరకే
నాయుడు గారి కల్యాణి రాగమున్నది.
మధురమైన రాగప్రస్థారము.
ఆయన యే సనకసనందనాదుల కోవకో చెందినవాడు.
కాని అదియే వారి సరోత్కృష్ట సృష్టి యని చెప్పలేము..
నేడు నాయుడుగారే బ్రతికియుండి
దానిని వినుట తటస్థించినచో
'నిదేమున్న' దని
అంతకన్నను బాగుగ వాయించి యుండెడివారేమో
'చింతలపల్లి వెంకటరావు'గారుండిరి
'కలియుగదల్లి హరి 'అను
పురందరదాసు దేవర నామము వారంతకుముందొకసారి పాడియుండిరి..
అది మా చెవులలో గింగురుమనుచున్నది..
మరల సంవత్సరము తరువాత
దానినే మరియొక కచ్చేరీలో నెత్తికొన్నారు..
మొదటిపాట దీనిముందు
దీని ముందు దివిటీ ముందు దీపము.
అయిన నిదియే సార్వత్రికముగాదు
నిన్నటిపాటను నేడదే గాయకుడు
చెరచి చెటాకులు చేయవచ్చును
సంగీతము కావ్యరచన వంటిదిగాదు
చాల కష్టమైన పని
శరీరారోగ్యము
శీతోష్ణములచే చెరగని గాత్రమూన్నింటిని మించి శాంతమైన మనో ధర్మమున్నపుడే
సంగీతము సాధ్యము..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి