అష్టాక్షరీ కృతుల గ్రంధం ఆవిష్కార సభలో..
లక్ష్మణ మూర్తి గారు చక్క గా మట్లాడారు
వారు విశ్వనాధ అభిమానులు
అంటే పుట్టపర్తి విరోధులనికాదు
పుట్టపర్తికీ అభిమానులే
ఒకరి అభిమానులంటే వేరొకరిని తిట్టాలనుకోవటం దురభిమానం అవుతుంది
వారే పుట్టపర్తి శివకర్ణామృతాన్ని
దాదాపు ముఫై సంవత్సరాలు పదిల పరిచింది
ఇపుడు సహృదయంతో వె తికి ఇచ్చినదీ
దాని అర్థ వివరణ..
ముద్రణ సంపాదకత్వం
వారే చేశారు
మరి విశ్వనాధ పుట్టపర్తి కాలు దువ్వుకొనే వారు
అంటారు కదా..
అని కొందరి సందేహం
అప్పటి కాలంలో ప్రాంతమేదైనా
ఒకరినొకరు గౌరవించుకోవటమూ
మాటా మాటాఅనుకున్నా
తిరిగి అనురాగంతో ఆలింగనం చేసుకోవటం
మనకు తెలియని సంగతులు
ఒకసారి విశ్వనాధ
రాయలసీమ ప్రాంతాలకు వచ్చారు
వారి సభకు అధ్యక్షత యెవరు వహించాలి?
వారు విశ్వనాధకు సమఉ జ్జీ అయివుండాలి కూడా
సరే ..
అధ్యక్షులు పుట్టపర్తి
' నేను విశ్వనాధ సభకు అధ్యక్షత వహించాను అన్న కీర్తి పొందేందుకు ఎవరైనా తయారే కదా '
అన్నారు విశ్వనాధ.
పుట్టపర్తి ఊరుకుంటారా..
'ఇది నా ప్రాంతం..
ఇక్కడ నన్ను తెలియని వారు ఎవరూ లేరు..
నాకు పరిచయం అవసరం లేదు..
కాకపోతే
నేనే తమరిని పరిచయం చేయవలసి వుంటుంది. '
అని చురుగ్గా అన్నారు
తరువాత ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు
ఆలింగనం చేసుకున్నారు
అది వేరే విషయం
ఇలాంటి విషయాలను పెను భూతాలుగా
వర్ణించి పొంగిపోయే
ఇటువంటి '' వైరి వీరుల '' వలన
ఇద్దరికీ వచ్చే నష్టమేమీ లేదు కదా..
సాధ్యమైతే ఇద్దరి గ్రంధాల పై పనికి వచ్చే
విశ్లేషణలు వ్రాయవచ్చు
విశ్వనాధ పై పుట్టపర్తి వ్రాసిన
ఒకే ఒక వ్యాసానికి పొంగిపోయిన విశ్వనాధ
అక్కడినుంచీ పుట్టపర్తిని అభినందించడానికి
స్వయానా కదలి వచ్చారు
అభిమానుల మని చెప్పుకొనే వారు
ఆ పనులు చేయవచ్చు..
ఈ సంఘటనను సాక్షాత్తు విశ్వనాధ అభిమాని
లక్ష్మణ మూర్తి గారే సభలో సెలవిచ్చారు..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి