దానిని పవిత్రమైన యజ్ఞంగా భావించి పాలించిన రాజులు
మనకు ఎందరో కనబడతారు
వారి చరిత్రలు
మనకు రాజ్జ్య పాలన యెలా చేయాలో చెబుతాయి
యువరాజుగా పట్టాభిషిక్తుడవబోయేముందు శ్రేయోభిలాషులు ప్రజారంజకుడిగా రాజ్జం చేయమని
ప్రజల మాటనే శిరోధార్యంగా భావించాలని
వ్యక్తిగత ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజాసేవలో తరించాలని హితోపదేశం చేస్తారు..
ఉన్నతమైన విలువలతో జీవించి తాను అందరితో శభాషనిపించుకోవాలని
ఆనాటి రాజులూ తహ తహ లాడారు
అందుకు ఉదాహరణలుగా
చాకలివాని మాటకు ఒగ్గి
సీతను అడవులపాలు చేసిన రాముడు
సత్యసంధతనే నియమంగా పెట్టుకున్న హరిశ్చంద్రుడు
సహనం శాంతి మూర్తీభవించిన
స్థితప్రజ్ఞు డు .. అజాత శత్రువైన ధర్మ రాజు
స్నేహధర్మానికి ప్రాణం ఇస్తానన్న
దానగుణ సంపన్నుడైన కర్ణుడు..
కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారీ..
ఇలా ఎందరో మనకు దర్శనమిస్తారు..
కానీ అటువంటి సత్యకాలంలోనూ
పంటికింద రాళ్ళలా..
దుర్మార్గులైన ప్రభువులు తారసపడతారు
వారు అధికార గర్వితులు
వారు చేసిందే పాలన
వారు చెప్పిందే చట్టం
వారు ఎవ్వరి సలహాను తీసుకోరు జోక్యాన్ని సహించరు..
అటువంటివాడే ఈ వేనుడు
మహా దుర్మార్గుడు..
బలవంతుడు..
వాడికి ఎవ్వరిని పూజించాలో తెలియదు..
ఎవ్వరిని గౌరవించాలో తెలియదు..
ఎవ్వరిని రక్షించాలో తెలియదు..
అటువంటి వాడి పాలనలో రాజ్జ్య వ్యవస్థ పాడైపోయింది..
విద్రోహశక్తులకు ధైర్యమొచ్చింది
అమాయకులు వేధింపబడ్డారు..
ప్రజలు తపోనిష్టులైన మునులనాశ్రయించి కాపాడమన్నారు..
వారు మరికొంతకాలం ఓపిక పట్టారు..
ఎందుకు..
వాడు మాట వినాలి..
లేకపోతే వాని పాపం పండాలి..
కాని రెండవదే నిజమైంది
రాచరికమునకు ధర్మము ప్రధానమైన చక్రము..
ధర్మ శక్తి లేనిది రాజయంత్రము నడువనే నడువదు..
కాబట్టి ధర్మ బధ్ధుడవై నడువుమన్నారు..
ప్రభువు విష్ణ్వంశ..
ప్రభువేదిచేస్తే అదే ధర్మం..
ప్రశ్నించడానికెవ్వరికీ అధికారం లేదు..
పొండన్నాడు వాడు..
అప్పుడేమయింది..
వారి తపోనిష్టత కళ్ళు తెరిచింది..
వారి మాట
వహ్ని పర్వతములనుండి దుమికిన లావా అయ్యింది..
వాడు ఆ అగ్నిలో శలభ మయ్యాడు
విచిత్రమేమంటే ప్రతి దుర్మార్గుని గూటిలోనూ
వేదాలు వల్లించే చిలుక ఒకటి వుంటుంది
వీడు చేసే దుర్మార్గాలకా ప్రాణినుంచీ
రక్షణ లభిస్తూ వుంటుంది..
వేనుని తల్లి సునీథా దేవి
ఆమె కొడుకును మంచి మార్గంలో పెట్టటానికెప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది
కానీ వాడు వినడు..
తనకొడుకును శపించిన మునులపై
ఆమె క్రోధం పెట్టుకోలేదు..
మునుల ఆగ్రహానికి మాడి మసైపోయిన వేనుని శరీరాన్నామె కాపాడింది
ఎన్నోరోజులు పుత్రప్రేమతో..
రాజులేని రాజ్జ్యం ఎలా కొనసాగుతుంది..
మళ్ళీ రాజు అవసరమయ్యాడు
అప్పుడు కుమారుని శరీరాన్ని కాపాడుకుంటూ
తమ దయ కోసం మౌనంగా నిరీక్షిస్తున్న
సునీథా దేవి సౌశీల్యం వారిని మెప్పించింది..
వారు తిరిగి వచ్చారు
వేనుని తొడపై మథించారు..
అందులోంచీ ఒక ఆజానుబాహుడుద్భవించాడు
ఆయనే ప్రజల కోసం తపించిన పృథు చక్రవర్తి.
అయ్యయో .. మొత్తం చెప్పేశాను..
మీకిప్పుడు
నేను క్రింద జత చేసిన రాయల నీతి కథలలోని
వేనుడు 'సస్పెన్స్ లేని స్టోరీలా' వుంటుందేమో..
కానీ .. పుట్టపర్తి కథనానికీ నా రాతకూ పోలికెక్కడ..
ఈ వేనుని కథను విశ్వనాధవారు
'వేనరాజు '
అనే నాటకం గా వాశారట..
అది గొప్ప సంచలనాలకు.. వివాదానికీ కేంద్రబిందువైందట..
అంతే మరి గొప్పవారు యేంచేసినా అలానే వుంటుంది..
విశ్వనాధవారు
వేనరాజు పాత్రను కౄరుడైన పాలకునిగా,
వేదధర్మంపై అక్కసుతో
దారుణ కృత్యాలు చేసే వ్యక్తిగా చిత్రీకరించారు.
గౌతమ మహర్షితో వేనుడికి వైరం ప్రబలి
తుదకు వేనుణ్ణి గౌతముడు తపశ్శక్తితో సంహరించడం ప్రధాన ఇతివృత్తంగా పేర్కొనవచ్చు
మరి పుట్టపర్తివారి వేనుణ్ణి చూద్దామా..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి