29 ఏప్రి, 2015

సాహిత్యంలో అహంకారం

ఒకసారి 
పుట్టపర్తి  అనంతపురంలో జరిగిన 
సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు 
కడపలో 
'ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్' జరిగింది. 
గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. 

ఆ సభలో పుట్టపర్తి గురించి 
"ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. 
పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." 
అని విమర్శలు చేశారు. 
పుట్టపర్తి శిష్యులు ఉడికి పోయారు .. 


ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయనకీ వార్తను చెప్పారు.. 
మరునాడు సభకు వెళ్ళిన పుట్టపర్తి 

"14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా 
ఏ ప్రశ్నైనా వేయవచ్చు.
మీరు అడగండి. 
ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని

'సాహిత్యంలో అహంకారం '
అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి
 "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

24 ఏప్రి, 2015

పుట్టపర్తి మేఘదుతం పై గిరిజామనోహర్ గారి అభిప్రాయం..

పుట్టపర్తి మేఘదుతం పై గిరిజామనోహర్ గారి అభిప్రాయం..
అక్కయ్య ఇచ్చిన నంబర్లతో గిరిజామనోహర్ గారిని ఫోన్ లో సంభాషించినప్పుడు..
నేనెవరో తెలియకపోయినా.. 

నాగపద్మిని గారి చెల్లెల్ని .. 
పుట్టపర్తి వారి అమ్మాయిని అనగానే..
కేవలం ఫోన్ లోనే నాతో ఆప్యాయంగా సంభాషించి..
చిన్న ఇంటర్వ్యూ వంటిది ఇచ్చారు
ఆ సందర్భంలో తాను మేఘదూతంపై
వరుసగా వ్యాసాలు అప్పట్లో వ్రాసినట్లు కూడా చెప్పారు..
మీరు ఆ వ్యాసాలు నాకిస్తే ధన్యురాలిని అవుతానని చెప్పినప్పుడు సరే నన్నారు
ఇంతలో అక్కయ్య శత వత్సర సభ పెట్టటం 

అందు లో భాగంగా
గిరిజా మనోహర్ గారి ప్రసంగభాగం పెట్టటం జరిగింది..
అది ఇదే..
వీరు విశ్వనాధ అభిమాని..
పుట్టపర్తి అభిమాని కూడా
తెలంగాణా వాసి..
చూశారా..
సాహిత్యానికి ప్రాంతీయ భేదాలు లేవు
మనుషుల మనసులకు కూడా లేవు
ఇది కేవలం రాజకీయ కీటకాలకు మాత్రమే..
 

23 ఏప్రి, 2015

పరోపకారాయ ఫలంతి వృక్షాః

ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చేవాడు..
మౌనంగా కూచునే వాడు..
పిలిస్తే పలికే వాడు
అయ్య ఎక్కడికి వెళ్ళినా తోడు
పట్టుకుని తీసుకు వెళ్ళటం 

వెంటే వుండటం 
తీసుకు రావటం.
అతనికి పుట్టపర్తి గురించి ఎంత తెలుసో తెలియదు
కాలేజీకి వెళ్ళి వచ్చేవరకూ మాత్రమే 

కనబడేవాడు కాదు
అంతే..
అలా రోజులు గడిచాయి
క్రమక్రమంగా అయ్యకు అతను కుడిభుజమైపోయాడు..
అతని డిగ్రీ.. అయిపోయింది..
వెంటనే APPSC పరీక్షలు రాసాడు..
పరీక్ష పాసయ్యాడు..
ఇంటర్వ్యూ కడపలోనే..
ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకున్నాడు
నన్ను రెకమెండ్ చేయమని ప్రాధేయపడ్డాడు..
సరే అన్నారు అయ్య..
రిక్షా ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు..
ఒరే వీడు నా వాడు వీణికి ఉద్యోగం ఇవ్వరా.. అని
అక్కడి సంబంధిత అధికారికి చెప్పారు పుట్టపర్తి..
సరే నన్నారు 

ఆ సంబంధిత అధికారి అయ్యపై గౌరవంతో..
కొద్దిరోజులు గడిచాయి..
అతనికి కడప కలెక్టరాఫీసులో ఉద్యోగం వచ్చింది.. క్లర్క్ గా..
అతనికీ ఆనందం.
అయ్యకూ అనందం..
కొద్దిరోజులకు అక్కడే ఉద్యోగం చేసే పిల్లను 

పెళ్ళి చేసుకున్నాడు..
అతని జీవితం కుదుటపడింది..
తర్వాత అతనికి అయ్య దగ్గరికి రావటానికి టైం లేదు..
అయ్య కనీసం బాధైనా పడలేదు..

16 ఏప్రి, 2015

2 ఏప్రి, 2015

హరియను రెండక్షరములు



నిజానికి నన్ను సత్యాగ్నిని చేసి౦ది 
మా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. 
 ” అరే తిక్క నాయలా షేక్ హుస్సేన్ పేరుతో ప౦పినావ౦టే ఎడిటర్ చూస్తాడో చూడడో రా. 
సత్యాగ్ని అని ప౦పూ ..
హి౦దూ అనుకొని చూడనన్నా చూస్తాడు. 
ఒగటి గాకు౦టే వొకటన్నా వేస్తాడు”
  అని నాకు సత్యాగ్ని తగిలి౦చాడు. 

కొ౦చె౦ పేరొచ్చిన తర్వాత 
మా గురువు గారు కూడా వు౦డిన సభలో 
ఒక వక్త నన్ను పొగుడుతూ
 సత్యమైన అగ్నిని కథలుగా రాస్తున్న షేక్ హుస్సేన్ అని అ౦టు౦టే , 
మా గురువుగారు అడ్డు తగిలి

 ‘వీని మొగ౦ వీన్లో సత్యమూ లేదూ, అగ్ని లేదూ,
 వీడు రాజకీయనాయకుడైనాడు, 
నేను పెట్టి౦ది సత్యాన్ని అగ్నిగా చెప్పేవాడని కాదు. సత్యాగ్ని అ౦టె 
జఠరాగ్ని, 
జ్ఞానాగ్ని…
అగస్తుడు చెరువుడు నీళ్లనైనా హరి౦చుకున్నట్టు 
వీడు జ్ఞానాన్ని ఎప్పుడూ ఎ౦తైనా హరి౦చుకోవల్లని యీ పేరు పెట్నా’ 
అన్నాడు. 
అ౦దుకే ఆ తత్వాన్ని నేనేప్పుడూ గుర్తు పెట్టుకు౦టా.


 ఇదీ పుట్టపర్తి శిష్యుల వరస..
ఈనెవరో తెలుసా 
షేక్ హుస్సైన్
ముస్లిం
MLCగా చేసిన వాడు.. 

చక్కటి కంఠం .. శివతాండవం శ్రావ్యంగా పాడతాడు 

ఎటువంటి భేషజం లేకుండా తన గురువును 

ఎలా పొగడుతున్నాడో చూడండి..
 

ఈనతో చెప్పి అయ్య ఎందరికో  ఉద్యోగం ఇప్పించారు..
అదేమి విచిత్రమో అయ్య తిట్టినా 

అందరూ అదో ఆశీర్వచనంలాగా తీసుకుంటారు
ప్రేమగా నవ్వుతారు .. 

అపురూపమైన వ్యక్తి లా అయ్యను గౌరవిస్తారు..
 

ఎవ్వరైనా సరే .. 
ఒరే.. ఇక్కడ్రారా..
అని పిలిచి...
ముండా కొడకా ఎక్కడ చచ్చినావురా..
నిన్న పాఠానికెందుకు రాలేదు..
అప్పుడే అంతా వచ్చేసిందనుకున్నావా..

నీకేమొచ్చిందిరా నీ పిండం..
ఇట్లయితే నీవు యేమి నేర్చుకోని చ స్తావురా
అని తిడుతూంటే
 

ముసిముసిగా నవూతూ..
ఒద్దికగా సర్ది  చెబుతూ..
వినయంగా సమాధానాలిస్తూ..
యేం చెప్పను ఎలా చెప్పను..

ప్రొద్దుటూరులో పనిచేసే రోజులలో..
అంటే
పుట్టపర్తి ముఫ్ఫై వయసులో కావచ్చు
యే స్కూలులో పనిచేస్తే ఆ స్కూలు పిల్లలందరూ ఇంట్లోనే.
వాళ్ళలో ఒకడికి వివేకానందుడి పాఠం
ఇంకోడికి ఠాగూర్ పాఠం
ఒకడికోసం తానే పూజలూ జపాలు
మా అమ్మతో కూడా పారా యణలు
అదీ మాఇల్లు..
 

ఆ ఇంట్లో పుట్టినందుకు దేవునికి నేనెంత ఋణపడివున్నానో
కాదు కాదు ఇది నాకు ఎంతో ఉన్నతమైన జన్మ..
అసలు సత్పురుషుల సాంగత్యం కలుగనే కలుగదు..

ఎంతో పుణ్యం ఉంటే తప్ప..
అదీ కూతురుగా పుట్టటం
ముద్దుల కూతురుగా..
 

ఇంకో సౌభాగ్యం చెప్పనా 
ఈ జన్మ విలువ
 గురువు విలువా పూర్తిగా ఎరగటం