18 జులై, 2015
వీణపై వేదం
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి చమత్కార విన్యాసం
,
పుట్టపర్తి భావ లహరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
అమ్మా,
రిప్లయితొలగించండివెఱ్ఱి వేయి విధములు. ఇది బాగుగా పాతబడిన సామెత. ప్రస్తుతకాలమున వెఱ్ఱు లనంత విధములుగా నున్నవి.
అన్నమాచార్యులవారు భక్త్యావేశపరవశులై సహస్రానేకములైన సంకీర్తనములను గానము చేసిరి. అవి కాలక్రమమున ప్రచారములోనుండి తొలగినను ఆధునిక కాలమున మిక్కిలి ప్రచారమునకు వచ్చినవి. నేడు వేలమంది ప్రోగుపడి వాటిని గానముచేయుటతో గిన్నీసు రికార్డులు సాధించబడినవి. వాటి ప్రయోజనమేమి? భక్తి ముఖ్యమా, రికార్ఢులు ముఖ్యమా? కాగితములు చేతబట్టి పొలోమని అందరును అడ్డదిడ్డముగా పాడి రికార్డులు సృజించి ప్రయోజనమేమి? భక్తిగా వాటిని పరవశించి పాడుట మోక్షదాయకము కాదా. ఈ మాట పట్టదు. కొన్నాళ్ళకు ఏదో ఒక కీర్తనను 24 గంటలలో కోటిసార్లు పాడిన రికార్డు వచ్చును. ఇదొకరకమైన వెఱ్ఱి.
ఒకడు గుక్కత్రిప్పుకొనకుండ కొన్ని నిముషములపాటి పాడును. అదొక రికార్డు. ఆ పాటలో ఏమున్నదో దానితో పనిలేదు. ఆ పాటను ఎంత విరసముగా పాడినను ఇబ్బందిలేదు. గ్రుక్కతిప్పుకొనలేదు - అది ముఖ్యము. ఇది మరొక వెఱ్ఱి.
నేటి కాలములో అనేక టీవీఛానెళ్ళలో డాన్స్ పోటీలు జరుగుచున్నవి. ఆ డాన్సింగులలో వికృతమైన భంగిమలతో వెకిలిపాటలకు ఎగిరిఎగిరి గెంతుట తప్ప మరేమంత విశేష ముండదు. అదియును పది పాతికమంది అస్తవ్యస్తముగా చేయునట్టి ఆ డాన్సులలో నాకెన్నడును కళాత్మకమైన విలువలు కన్పించలేదు. పసిపిల్లలతో ఆసభ్యగీతములకు గంతులు వేయించి ఆ డాన్సులలో వారి ప్రావీణ్యతకు పెద్దవారు మురిసి ముక్కలగుట వికారమైన సంగతి. కాని అందరికి నేడట్టి డాన్సులే నచ్చును. చిత్రమెమనగా నేడు సభలలో జరుగు సాంస్కృతిక కార్యక్రమములన్నింతిలో కూడ ఈ పాటలే వినబడుట ఈ పాటలకే పిల్లలు పెద్దలు గెంతులు వేయుట కనబడును. ఇదా మన సంస్కృతి? ఇదే మన సంస్కృతి అని నమ్మువారి దొక వెఱ్ఱి కాక! ఈ డాన్సింగులకన్న నా చిన్నప్పటి దొమ్మరివారి ఆటలలో ఒక అర్థమైన కనిపించెడిది కదా!
చదువులు ధనసంపాదన కొఱకే నన్న వెఱ్ఱి యొకటి. దానితో పిల్లలకు పుట్టినదాది నరకప్రాయమైన జీవితము. ఒక ఆట లేదు. ఒక పాట లేదు. ఒక ముద్దు లేదు. ఒక ముచ్చట లేదు. చదువు. చదువు. ఈ పిల్లలకు elephant అనగా ఏనుగు అన్నట్లు చెప్పరాదు. వారికి అర్థము కాదు. ఏనుగు అంటే elephant అని చెప్పవలెను. తెలుగులో మాట్లాడినచో పాఠశాలలో దండనలు కాదు, ఇంటిలో తల్లిదండ్రులే దండించుచున్నారు. ఇంతకన్న హోరమైన వెఱ్ఱి యున్నదా?
ఈ గోదావరి పుష్కరములు మహాపుష్కరములట! 144 సంవత్సరములకు కాని ఇట్టి మహాపుష్కరము రాదట. మొదటి పుష్కర మెప్పుడో, మొదటి మహాపుష్కర మెప్పుడో ఈ మహానుభావులకు తెలియునా? ఇట్టి వెఱ్ఱి వాగుడులకు మితి లేని పరిస్థితి. ఏ యూరి వారికి ఆయూరి గోదావరీ ప్రవాహములో పుష్కరస్నానము సరిపోదా - అందరును కట్టకట్టుకొని రాజమహేంద్రవరములో వాలిపోవలెనా? ఇదేమి వెఱ్ఱి?
ఇట్టి వెఱ్ఱి వ్యవహారములను తడుముకొనుచు కూర్చుండిన మనకు వెఱ్ఱి యెత్తును!
నిజం చెప్పారు..
రిప్లయితొలగించండి