రావణుణ్ణి రాక్షసునిగా చూడటమే
మనం ఇంతవరకూ చూసాం..
కానీ అదే రావణుణ్ణి దేవునిగా..
తమ పూర్వీకునిగా చూసే ఆదీవాసీలున్నారు..
రావణునికి ఆలయాలూ వున్నాయి....]
అంతే కాదు రావణునికి రాక్షస ముద్ర వేసి..
చరిత్ర వక్రీకరిచి..
సాంస్కృతిక దాడి చేసారన్నది ఆదివాసీల వాదన..
ఇప్పటికీ చాలాచోట్ల రావణుని ఆలయాలున్నాయంటే
రావణుని వారెన ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు..
మధ్యప్రదేశ్ లోని విదేశ జిల్లా..
రావణ్ గ్రామంలోలేని ఆలయం.. రాజస్థాన్ లో జోధాపూర్ సమీపంలోని
స్థానికులు రామ రావణ యుద్ద్ధం తర్వాత..
శ్రీలంకనుంచి జోధాపూర్ వఛ్చి స్థిరపడినట్లు చెబుతారు ..
వీరితో పాటూ మరికొన్ని తె గల వారు కుడా
రావణుని వీరునిగా గౌరవిస్తారు ..
కాన్పూర్ లోనూ రావణుని ఆలయం వుంది..
ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి
పూజలు నిర్వహిస్తారు ..
ఇంకా చాల ప్రాంతాలలో రావణుడే ఆరాధ్య దైవం..
వీరు ప్రపంచంలోనే
అతి పెద్ద ఆదివాసీ తెగవారు..
వీరి భాషకు లిపి లేదు..
ఇలా చరిత్రలోఈ హీరోలనుకున్న వాళ్ళు
కాలక్రమంలో విలన్ లుగా మారిపోతే ఆశ్చర్య పడక్కర్లేదు..
తొడకొట్టడాలు ..
మీసం తిప్పడాలు ..
కట్టి దూయతలు వంటి
భీకర దృశ్యాలతో ప్రేక్షకులను వెర్రెత్తి పోయేలా చేసిన
గౌతమీపుత్ర శాతకర్ణి లో
సత్యమెంత.. ??
చరిత్ర ఎంత .. ??
కల్పనా ఎంత .. ??
అని తరచి చూస్తే ..
గందరగోళమే తప్ప మరేం కాదని
సినీ పండితుల ఉవాచ..
ఇలాంటివే చాణక్యునిపైనా కల్పించారట..
ప్రసిధ్ధ వ్యక్తులపై అభూత కల్పనలు
బయలుదేరడం సహజమే కదా..
చంద్రగుప్తుని కండగా నిలచిన చాణక్యునిపై..
కథలు .. నాటకాలు.. కావ్యాలు .. రాయడానికి..
ఆకాలంలో చాలామంది ప్రయత్నించి ఉండవచ్చు ..
ఎందుకంటే ..
అర్థశాస్త్రవేత్తగా .. రాజనీతిజ్ఞునిగా నందులనంతం చేసి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న పౌరుషవంతునిగా
ఏంతో మందికి సుపూర్తి ప్రదాత కదా..
కొంత మంది వీరత్వాన్ని ఎంచుకుంటే..
కొందరు శారీరకంగా ఆయనపై దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు..
ఒక నాటకకర్త..
చాణక్యుని కురూపిగా..
వికృత వానిగా మలచి ..
ఆనంద పడినాడట ..
ఈ విషయాలు ..
మన పుట్టపర్తి తెనిగించిన మరాఠీ గ్రంధం..
'' భారతీయ ఇతిహాశాంతిల్ సాహసోనేరి సావే''
"స్వర్ణ పత్రములు '' లో మనకు కనిపిస్తాయి..
శక హూణాది విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టి
జాతిని రక్షించిన చంద్రగుప్త విక్రమాదిత్య యశోధర్మాది భారత వీరుల విజయ గాధలను అభివర్ణించే స్పూర్తిప్రదమగు చారిత్రక పరిశోధక గ్రంధం వీర సావర్కరు మరాఠీ భాషలో రచించిన '' భారతీయ ఇతిహాసాంతిల్ సహసోనేరి పానే ''
ప్రసిధ్ధపురుషులను గురించి గాధలల్లుట సాధారణముగ వాడుక..
ఆ స్థితి యాతనికి దప్పలేదు.
చంద్రగుప్త చాణక్యులు మరణించిన పిదప
ననేక సంవత్సరములకు వ్రాసిన గ్రంధములలో గట్టుకథలకు లెక్కలేదు..
జైన , బౌధ్ధ, వైదిక గ్రంధములలో నీ గాధలు
భిన భిన్నములుగ గల్పింపబడెను..
సంస్కృత నాటక మొకటి గలదు..
ఆ నాటక కర్త కళాదృష్టితో గొన్ని గాధలల్లినాడు..
చాణక్యుడు కురూపియట..
అతని వికృత దంతములను గురించి
నాటకకారులు విపులముగ వర్ణించిరి..
చంద్రగుప్తునాతడొకనాడు ద్రోవలో గలసెను..
నాటికి జంద్రగుప్తుడొకనాడొక గ్రామీణ తరుణుడు మాత్రమే.
వాని సాముద్రిక లక్షణములను చాణక్యుడు గమనించి యాతనిని సామ్రాజ్యాధిపతిగ నొనర్ప దలచెనట..
ఇట్టి వెన్నియో గల్పనలు..
ఈ కల్పనలలో గొన్ని యైతిహాసింక
సత్య కణికలేమైనను గంపించునాయని జూతముగాక..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి