14 ఫిబ్ర, 2012


పెనుగొండలో ..
పక్కా హనుమంతా చర్యులు అని ..
ఒకాయన గొప్ప సంగీత విద్యాంసుడు. 

పాపం..
సంగీత పాఠాలు చెప్పుకొనేవాడు. 
పేరు మీకు తెలిసే వుంటుంది.. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్ అని ..
వాడూ.. నేనూ ..
ఈ పక్కా హనుమంతాచార్యుల వద్ద..
సంగీతం ఆరంభించిన వాళ్ళం..

తరువాత..
ఆయనకు జీవనం జరుగక ..
కొక్కొండ సుబ్రమణ్యం
అనంతపురం పాయ..
అందువల్ల..
ఆయన వద్ద ..
సరళీ వరుసలూ ..
జంట వరుసలూ ..
అలంకారాలూ ..
యభై అరవై వర్ణాల వరకూ నాకు పాఠం చెప్పినారు.. 

వర్ణ సాధన ఎంత బాగా చేస్తే ..
స్వర విన్యాసం అంత బాగా వుంటుందని..
వారి ఊహ ..
 
అరియక్కుడి రామనుజయ్యంగార్
మా అమ్మ ఫిడేలు ఎక్కువగా వాయిస్తూ వుండేది. దానివల్ల ..
ఆయన వెళ్ళి పోయిన తరువాత..
ఆమె దగ్గర సంగీత సాధన మొదలు పెట్టినాను. 
ఆమె సుమారు ..
యాభై ..అరవై కృతులదాకా..
నాకు పాఠం చెప్పింది.

ప్రొద్దుటూరుకు వచ్చిన తరువాత..
పెద్ద జమాలు..
గొప్ప విద్వాంసుడు.. 
గొప్పగా ఫిడేలు వాయించేటటువంటి వాడు.. 

ఈ విద్యా విషయంలో ..
నా ఆశకు అంతు లేదని ..
ఇంతకు ముందే మీకు మనవి చేసి నాను. 
అందువల్ల ..
ప్రొద్దుటూరికి వచ్చిన తరువాత..
ఆయన దగ్గర సంగీత సాధన చేస్తూ..
సుమారు నూరు ..నూట యాభై కృతులు..
పాఠం చేసుకున్నాను. 


ఈ రేడియో వాళ్ళు వచ్చిన తరువాత ..
కొక్కొండ సుబ్రమణ్యం అని ..
రేడియోలో పని చేస్తూ వుండినాడు
మంచి విద్వాంసుడు.
అరియక్కుడి రామనుజయ్యంగార్

అతని దగ్గర కొన్ని కృతులు పాఠం చేసి నాను. 

ఈ రీతిగా ..
సుమారు అయిదు నూర్లు ..
ఆరు నూర్లు కృతులు ..
సంగీతంలో చక్కగా పాఠం చేసుకున్నాను. 

యాభై అరవై వర్ణాల వరకూ పాఠం చేసుకున్నాను
ఇంతకు మించి ..
అనేక మంది గొప్ప గొప్ప గాయకులను..
వినేటటువంటి అదృష్టం నాకు జీవితంలో పట్టింది. 

అరియక్కుడి రామానుజయ్యంగారేమి..
శెమ్మంగూడి శ్రీనివాసయ్యంగారేమి..
బాలమురళీ కృష్ణ ..
ఇప్పుడందరూ వింటున్నారు ..
నేనూ వింటున్నాను.

చాలా గొప్ప గొప్ప ..
విద్వాంసుల యొక్క కచేరీలువిన్నాను. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్
సంగీతానికెప్పుడూ శ్రవణం ప్రధానం..

బాగా పాడ్తావు పోప్పా..
అని ఏదో అంటాను కానీ ..
మనస్ఫూర్తిగా అనేటటువంటి మాటకాదది. 
పైగా ..
అనంత కృష్ణ శర్మ గారి దగ్గర ..
సంధ్యావందనం శ్రీనివాసరావ్
అనేకములైన సంగీత విద్యా రహస్యములను నేర్చుకునేటటువంటి
అవకాశం నాకు ఏర్పడింది.  

ఆయన సంగీతంలో చాలా గొప్ప విద్వాంసుడు.
 సంగీత శాస్త్రంలో గొప్ప లాక్షణికుడాయన..
 ఈ రాగం యొక్క స్వరూపం ఇట్లే వుండవలె..
 ఇంతకంటే భిన్నంగా ..
ఈ రాగం యొక్క స్వరూపం వుండేదానికి వీలు లేదు
 అని అనంత కృష్ణ శర్మ చెబితే ..
గొప్ప గొప్ప విద్వాంసులంతా కూడా..
 ఆయన మాటకు గౌరవమిచ్చి ..
అట్లనే పాడేటటువంటి వాళ్ళు ..
చాలా గొప్ప విద్వాంసులు ..

నాకు చాలా సార్లు తోస్తుంది..
 సంగీతాన్న్ని నమ్మి ..
సాహిత్యంలో ఎక్కువగా కృషి చేయనివాడు..
 అనంత కృష్ణ శర్మ అయితే ..
సాహిత్యాన్ని నమ్మి ..
సంగీత ..నాట్యాలను ..
రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేసిన వాణ్ణి నేనేమో అని.

పుట్టపర్తి నారాయణాచార్యులవారి వ్యవహార జ్ఞానం


అసలు అయ్యకు..
ఈ లౌకిక వ్యవహారాల పట్ల..
అస్సలు అవగాహన లేదు.
 
ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏలెటరో ..
వ్రాయవలసి వస్తే..
ఏ శ్యామసుందర్ సారునో అడిగే వారు ..
ఒరే ఈ లెటర్ కొంచం రాసి పెట్టరా ..
అని..
..
షేక్స్పియర్ ..మిల్టన్.. షెల్లీ ..ఠాగూర్ ..
లను చీల్చి చెండాడిన అయ్యకు ..
ఒక్క లీవ్ లెటర్ రాయటం రాక పోవటమేమిటి..?
 
వారు ఆశ్చర్యంగా చూసేవారు..
నవ్వుకునే వారు ..
అయినా అర్థం చేసుకొనే వారు
అన్నట్లు ..
శ్యామ సుందర్ సారు..
రామకృష్ణా హై స్కూల్ లో టీచరు..
 
అయ్య ఏ సన్మానాలకు వెళ్ళాలన్నా ..
వాళ్ళను తనతో పిలుచుకు పోయేవారు..
ఒరే ..గుంటూరులో సన్మానముంది 
రారా.. పోయొస్తాం అనేవారు..
వాళ్ళు లీవో ..గీవో ..పెట్టుకుని ..
ఆ రోజుకు సిధ్ధంగా వచ్చే వారు..
 
అయ్య ముందుగానే..
నాతో పాటూ ఒకనికి టికెట్లు మీరే భరించాలి..
అని సన్మాన సంఘం  వాళ్ళకు చెప్పేవారు
అలా మంచి మంచి సభలను 
వారు సైతం ఆస్వాదించారు..

9 ఫిబ్ర, 2012


కేరళలో ఉన్నప్పుడు ..
శ్రీ బూర్గుల రామకృష్ణరావ్ గారి కోరికపై..
ఏకవీరను మళయాళం లోనికి అనువదించగా..
దానిని అక్కడి ఇంటర్మీడియట్ కోర్సులో పాఠ్యాంశం గా పెట్టారట..
తిరువాంకూర్ లోమళయాళ నిఘంటు నిర్మాణం..
1954-56 లలో ..
మళయాళ భాషా సౌందర్యానికి ఆకర్షింపబడి..
అలానే మళయాళ నాటకాలనూ తెనిగించారు.

స్వతంత్ర ప్రతిపత్తి ..
ఇతరులకు అణిగి వుండే నైజం కాకపోవటం వలన ..
సూరనాధ్ కుంజన్ పిళ్ళై
 అక్కడి రాజకీయాలు ..
అధికారుల వైఖరి నచ్చక ..
వెళ్ళి పోదామని అనుకుంటున్నవేళ..

యూనివర్సిటీ అధికారి సూరనాధ్ కుంజన్ పిళ్ళై ..
కేంద్ర సాహిత్య అకాడమీకి ..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా పంపారు.
1958 లో ఈ సంఘటన జరిగింది..
అక్కడ K P కృపలానీ..

మదన మోహన్ మాలవ్యా..
దినకర్..                                                  
మదన మోహన్ మాలవ్యా
పంత్..
మహాదేవీ వర్మ..
వంటి దిగ్గజాలతో పరిచయం..
వ్రజ అవధీ భాషలకు దగ్గర చేసింది..

ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా..        
"ఆంధ్ర ప్రజ మిమ్మల్ని గుర్తించలేదు..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా ..
మేము మిమ్మల్ని ..
కేంద్ర సాహిత్య అకాడమీ కి పంపుతున్నాము" అన్నారు.
పుట్టపర్తి వారి శివ తాండవాన్నీ..
దానిలోని శబ్ద సౌందర్యాన్ని ..
పదే పదే పొగడుతూ ..
అందులోని సంస్కృత శ్లోకాలను అడిగి మరీ వినేవారంతా..
ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా ..
కబీరు వచనావళిని తెనుగించారు.
అక్కడే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో సాన్ని హిత్యం పెరిగింది..
మరింత కృషి సాగేదే..
కానీ విధి విలాసం..
పచ్చ కామెర్ల వ్యాధిసోకింది..
నిరంతర అధ్యయనం ..
అన్న పానాలను పట్టించుకోకపోవటం వలన..
అది మరింతగా విజృంభించింది.

తిరిగి కడప పయనం ..
 అయ్య ఏమంటారూ..
ఏం చేయాలయ్యా..
దేవుడు ఈ ఊరిలో..
నాకు పడక ..భోజనం ..
ఏర్పాటు చేసినాడు అని చమత్కారంగా..


నన్ను జీవితంలో ఎక్కువగా ఆకర్షించినవారు..
ఇద్దరు ..
ఒకరు రాధా కృష్ణ పండితుడు..
రెండవ వ్యక్తి అరవిందఘోష్..
ఆయన రాష్ట్ర పతిగా ఉన్నప్పుడు తరచూ వెళ్ళే వాణ్ణి..
వెళ్ళినప్పుడంతా ..
ఒక గంటసేపైనా మాట్లాడే వాణ్ణి..
ఆయనలో ఒక గొప్ప సుగుణం ఉంది.
మన ప్రాంతాల్లోనే ఎక్కువ పని చేసిన వాడు కదా..
తాను చూసిన..
ప్రతి చిన్న వాని క్షేమమూ అడిగేవాడు..

భారత దేశానికి అధ్యక్షుడైనా..
ఆయనది అధ్యాపక మనస్తత్వమే..
నేనాయన దర్శనానినికి పోక పోయినప్పుడు..
కోపపడిన రోజులు కూడా ఉన్నాయి..
ఒకసారి ప్రపంచ శాంతి మహా సభలకు ఢిల్లీ వెళ్ళాను.  

అప్పుడాయన వైస్ ప్రెసిడెంట్ ..
కారులో ఆఫీసుకు పోతూ..
అదాటుగా చూచాడు.
పిలిపించి కోప పడినాడు..
క్షమాపణలు చెప్పుకున్నాను.
ఆయన పాండిత్యం పై నాకెంతో మోజు..

6 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు ..గత జన్మ .. పునర్జన్మ. (పుట్టపర్తి అనూరాధ)


గత జన్మ ..
పునర్జన్మ..
మనిషికి ఎప్పుడూ వీడని మిష్టరీలు..
మరణం తరువాత మనిషేమౌతాడు..
మరో జన్మ వుంటుందా..
ఈ సమస్య సామాన్యులనే కాదు..
మేధావులనూ వేధిస్తుంది.
మరణమనేది ఒక తెర ..
ఆ తెర వెనక్కి పోయిన వారు తిరిగి రాలేరు..
అక్కడ యేముందో తెలియదు..
అనేవారు అయ్య..
ఈ జగన్నాటకం నుంచీ నిష్క్రమించిన అయ్య..
ఆ తెర వెనుక సత్యాలను తెలుసుకునే వుంటారు..
తిరిగి వచ్చి చెప్పటానికి ఆయన పిచ్చివాడా..
తన ఆత్మ పురో గతి చూసుకోక..
తన చుట్టూ వారిని ప్రభావితం చేయాలని జీవిత కాలం ప్రయత్నించారు మరి..             

 








పూర్వ జన్మ ..
   పునర్జన్మ ..                                             
అనే కీలకమైన ప్రశ్నే..
నన్ను చంపుతూ ఉంది...

లేకపోతే ..
నేను అట్లా కంప్లీట్ గా..
మార్క్సిష్టు గా మారిపోలేక పోవడానికీ..

లేకపోతే ..
ఇట్లా ..కంప్లేట్ గా ..
అరవింద్ ఫాలోయర్ ..
కాకపోవటానికీ ..

ఆ ప్రశ్ననే ..
నన్ను అటూ ..ఇటూ ..
త్రాసులో తక్కెడలాగా..
ఊగే టట్టుగా చేస్తున్నది..

కార్ల్ మార్క్స్ ను చదువు కున్నప్పుడు..
బ్రహ్మాండమైన సానుభూతీ ..
తరువాత ..
అరవింద ఘోష్ ను చదువుకున్నప్పుడు.. 

అయ్యో ..
కేవలం భౌతిక దృష్టి తో..
తరువాత వాటినంతా ..
మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడేమో ..
అనేటటువంటి దృష్టీ ..

పృధివీ .. ప్రతిష్టా..
అంటాడు ..అరవింద ఘోష్..
భూమి లేనిది పరలోకమే లేదు పోరా ..
అంటాడు..
అందుకే ..
అతనంటే నాకు చాలా ఇష్టం..
బుధ్ధిజాన్నీ ..
సన్యాసి తత్వాన్నీ ..
అరవింద ఘోష్ అంగీకరించడు. 
సన్యాసి తత్వమంటే మహా కోపము ఆయనకు..

అట్లానే..
లైఫ్ పట్ల ఇంట్రస్ట్ లేకుండా చేసే టటువంటి..
బుధ్ధిజం అన్నా ..ఆయనకు చాలా కోపం ..
కనుకనే..
వీరిద్దరినీ..
ఎవరైనా  దగ్గరికి తెస్తే బాగుంటుందా ..
అనేటటు వంటి చాపల్యం..
చాలా తీవ్రంగా ఏడిపిస్తూ వుంది నన్ను ..

 పూర్వ జన్మ అనేటటువంటి దాని పైనా..
దైవ తత్వం పైనా..
నాకు నమ్మకం ఉన్నది..
అదే నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నది..

2 ఫిబ్ర, 2012




కేతు విశ్వనాధ రెడ్డి..
రాచమల్లు రామచంద్రా రెడ్డి ..
వై సి వి రెడ్డి ..
బండి గోపాలరెడ్డి..బంగోరే 
అందరూ మా ఇంటికి వచ్చే వారు..
వీరందరినీ తరచూ ..
మా ఇంట్లో సందర్శించే భాగ్యం ..
వారి చర్చలు వినే అదృష్టం కలిగింది.
వారందరూ అయ్యను ఎంతో గౌరవించే వారు..
అంతే కాకుండా ..
ఒక తండ్రిలా అభిమానించే వారు..
అయ్య కూడా..
తన కంటే చిన్నవారైనా ..
వారిలో ఒక్కనిగా కలిసి ..
కేతు విశ్వనాధ రెడ్డి.
వారి భావాలను పంచుకొనే వారు.
మార్క్సిజాన్ని క్షుణ్ణంగా చదివిన రా రా గారికి..
మార్క్సిజాన్ని అమూలాగ్రమూ ..
ఆకళింపు చేసుకున్న..
మహా కవి పుట్టపర్తి నారాయణా చార్యులకూ..
ఇంక దూరమేముంది..
వై సి వి రెడ్డి
చలం..
శ్రీ శ్రీ ..
కొడవగంటి కుటుంబరావ్ ..
మహీధర రామ మోహన రావు ల గురించి..
రా రా చేసిన మూల్యాంకనం చాలా లోతైనది..
వాదోపవాదాల్లో దిట్ట ..
శ్రీ శ్రీ ఆయనను..
క్రూరుడైన విమర్శకుడు..
అని అన్నారట..
రాసినవి ఎక్కువ సమీక్షలే అయినా ..
గొప్ప విమర్శకుణిగా చరిత్రలో నిలచిపోయాడు..
అయ్యతో వీరికి చిక్కని సాన్నిహిత్యం ఉండేది..
 వీణి గదాఘాతం నుంచీ తప్పించుకున్న వాణ్ణి ..
బహుశా నేనొక్కణ్ణే నేమో..
అనేవారుఅయ్య నవ్వుతూ..


రాచమల్లు రామచంద్రుణ్ణి గూర్చి..
వాడంటే నాకు ..
గొప్ప ప్రేమ ..
అభిమానమూ..
గౌరవమూ ఉన్నాయి..
చాలా నిశితమైన విమర్శకుడు.
క్షుణ్ణంగా చదువుకున్నవాడు.. 

చాలా మంది కమ్యూనిష్టులున్నారే..
వీళ్ళంతా ఫీల్డ్ వర్కర్స్ ..
మార్క్సిజాన్ని గురించి..
లాక్షణికంగా ..
వీళ్ళకు తెలిసింది చాలా తక్కువ ..
వాడు అటువంటి వాడు కాదు. 

శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసిన వాడు..
ఎక్కడా రాజీ పడకుండా ..
మహా కఠినమైన విమర్శకుడు. 

ఒక రకంగా వాడి గదా ఘాతం నించీ..
తప్పించుకున్నవాణ్ణి ..
నేనొక్కణ్ణే ..అని అనుకుంటున్నాను..?
 
నన్ను చూస్తే మాత్రం ..
నా కవిత్వాన్ని గురించి ..
వాడికే అభిప్రాయం ఉన్నా కూడా..
స్వామి బాగా చదువుకున్న వాడు..
చదువులో ఆయన్ని మించిన వాడెవడూ లేడు. 
అనేంత వరకూ ..
గొప్ప అభిమానం నాపై ఉండేది. 

మొన్న గూడా ..
ఇంకో రెండు మూడు రోజుల్లో పోతాడనంగా ..
హైదరాబాద్ పోయినాడంట. 

ఏదో ఇట్లే మాట్లాడుతా వుంటే..
స్వామి చాలా గొప్ప వాడు.. 
కానీ ఏం చేస్తాం..
ఆయనకు రావాల్సినంత 
పేరు ..ప్రఖ్యాతులు ..రాలేదు..
అని అన్నాడంట 

రష్యానించీ వచ్చినప్పుడు..
చెక్కపై వేసిన రెండు పైంటింగ్స్ తెచ్చినాడు.. 
ఇంతకూ ఎవ్వరి తోనూ రాజీ పడని..
కర్కశమైన అభిప్రాయాలు ఉండేవాడు వాడు.. 

కార్ల్ మార్క్స్ తత్వమును ..
బాగా అర్థం చేసుకున్న వాడు..  
ఇంకా కొంత కాలం బతక వలసిన వాడు ..
పాపం ఏం చేస్తాం..

1 ఫిబ్ర, 2012






 నా వయస్సెక్కువై పోయింది ..
నా చేత కాదు..
ఆ మాట..
అయ్య నోటి వెంట వింటే..
నాకు మనస్సంతా పిండినట్లవుతుంది.
 
ఎవరైనా సహాయం చేయగలిగితే..
నా ఆయుష్షును ..
అయ్యకు ఇచ్చి వేయాలని..
నా మనసు తహ తహ లాడేది..
అమ్మ ఉన్నంత వరకూ..
అయ్యలో ఈ బేల తనం ఉండేది కాడు.
 
అయ్యా నేనూ ఉన్నప్పుడు..
అయ్య కొంతలో కొంత ..
నన్ను చూసి జీవించాలనే ఇచ్ఛ ఉండేది..
అదీ నా కోసం..
అమ్మ తోనే అయ్య లోని సర్వ శక్తులూ పోయాయనిపించేది..
 
కేవలం అంతర్ముఖులై..
చివరి బాధ్యతైన నన్ను ఓ దారికి చేర్చి
జీవన్ముక్తిని పొందాలని అయ్య అనుకున్నారు..

నా పెళ్ళి కుదిరి నప్పుడు ..
నాతో పరోక్షంగా ..
మానవ సంబంధాలన్నీ ..
ఆర్థిక సంబంధాలే అన్నారు..
ఆ మాటే ..
నాకు ఇప్పుడూ..  కుచ్చు కుంటూ  వుంది..
 
అయ్యకు నా పెళ్ళి కుదరాలని వుంది..
ఇప్పుడే ఎందుకు అనీ వుంది..
ఇద్దరం తోడుగా ..

అమ్మ లేమిని తీర్చుకుంటున్నాం..
స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని..
అయోమయ స్థితిలో ..
పెళ్ళి అనే ..
ఒక తాడుకు బందీ కావలసి వచ్చింది.
 
అదే పెళ్ళిని త్రోసిపుచ్చి ..
అయ్యకు తోడుగా నిలిచే..
ఒక నిర్ణయం తీసుకొని వుంటే..
 ఎంత బాగుండేది..
అని నా ఆత్మ నన్ను చంపుతూంది..
అయ్యను ..
ఆ వదినకు ఆహారంగా వేసి..
నిస్సహాయంగా వదిలి..
వచ్చినానని వేదన తినేస్తూంది.

అలా చేసి వుంటే..
అయ్య ఇంకో పది సంవత్సరాలు ..
సంతోషంగా జీవించేవారు..
తాను అనుకున్నవన్నీ పూర్తి చేసే వారు..


అయ్యకు పెన్షను అయిదువందలే..
జగమంత పేరు సంపాదించిన..

ఆ విజ్ఞాని..
కనీసం తన భద్రత కోసమైనా ..
కాసంత డబ్బును..
సంపాదించుకోలేక పోయాడు..
ఆ వదిన ధన పిశాచి..

అన్నయ్య ఆమె విధేయుడు..
 

ఇంక ఆ ముసలి వాడిని ..
ఆ వైకుంఠ నాధుడే కాపాడాలి..
కోట్లకు కోట్లు జపం మింగిన ఆ కృష్ణుడేడీ..?

కనపడడేం..? 
నా మనసును..
ఈ రోజు చెప్పకుంటే..
ఇంక ఏ రోజూ చెప్పలేను..
అనిపించింది..
 

ఠాగూర్ అంటే నాకు ప్రాణం..
ఇందులో ఏ సందేహమూ లేదు..
 
నా దృష్టిలో ..
శాపవశాత్తూ ..
ఇలకు దిగిన గంధర్వుడాయన..
నఖశిఖ పర్యంతమూ..
కవిత్వ స్వరూపమే అయిన మహావ్యక్తి ..



కానీ..
ఆయన గడ్డకు రావటానికి..
జీవితంలో కీర్తి ప్రతిష్టలు అందుకోవడానికీ..
ఆయన పడిన కష్టాలు వర్ణనాతీతాలు..
ఇటు చాదస్తులతోనూ..
అటు అసూయాపరులతోనూ..
విపరీతమైన
బాధలూ ..
కష్టాలూ.. 
అనుభవించినాడు. 

 
ఎంతగా అతన్ని హేళన చేసే వారంటే..
యూనివర్సిటీ వాళ్ళు..
ఆయన పాసేజ్ కో చేసి..
దీన్ని వ్యాకరణ శుధ్ధమైన భాషలో వ్రాయుడు..
అని క్వశ్చన్ ఇచ్చే వారు

పాపం..
అంటే ..
ఆయన దంతా తప్పుడు భాష అని లెక్క ..
ఇట్లా..
విపరీతమైన శ్రమలు పదినాడు..
కానీ ..


ఆయనలో కవిత్వం కానటువంటి పదార్థం..
ఒక్కటి కూడా లేదు..
ఎందుకూ ..
కొంత కొంత మంది ..
భారత దేశంలో ఎందుకు పుట్టినారా అనిపిస్తుంది..?

అట్లనే ..
అరవింద ఘోష్ ఠాగూర్ ..
నఖశిఖ పర్యంతమూ సౌందర్యమైతే..
అరవింద ఘోష్ ..
తత్వ స్వరూపుడు...
నాకు చాలాసార్లు..
ఈ చాపల్యం ఇప్పటికీ పట్టి పీడిస్తుంది..
ఈ కార్ల్ మార్క్స్ నూ..
ఈ అరవింద ఘోష్ నూ..
వీళ్ళిద్దరి సిధ్ధంతాలనూ
సమన్వయం చెసి ..
ప్రపంచానికి అందించగలిగి ఉండేటటువంటి ..
ఒక మహా వ్యక్తి ఉండినట్లయితే..
ప్రపంచం బాగుపడుతుందేమో ననే పిచ్చి..

ఈనాటికీ.. నాకు ఉన్నది...
నాకు వయస్సెక్కువై పోయింది..
నా చేత కాదు.

29 జన, 2012



నాకు స్ఫూర్తి నిచ్చిన సంఘటనలు..
మా ఇంట్లోనే వుండేవి...
నన్ను కన్నతల్లి..
లక్ష్మీ దేవి ఆమె పేరు. 
నేను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే.. 
చియ్యేడు..
అనే ఊర్లో పుట్టినాను. 
మా మాతా మహులంతా కూడా కాశీ పండితులు. 

మా పెద్ద తాత గారు కొండమాచార్యులవారు. 
వివాహానికి ముందే ..
మా తల్లి ఆయన కాశీ పండితులైనందువల్ల..
ఆయన దగ్గర సంస్కృతం చక్కగ నేర్చుకుంది. 
మంచి పాండిత్యం కూడా ఉండేదామెకు. 
కానీ నాకు ఐదవ సంవత్సరంలోనే ..
మా తల్లి చనిపోయింది. 

మా నాన్న గారు మైసూరులో..
కృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామి దగ్గర..
సంస్కృతం చదువుకున్నారు. 

అప్పట్లో వారితో పాటు చదువుకున్న వారు..
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ..
రాళ్ళపల్లి గోపాల కృష్ణ శర్మ గారు..
మరికొందరు.. ఉండే వారు.
మా అమ్మ మరణించిన సుమారు పదునాలుగేండ్లకు..
మా తండ్రిగారు రెండవ వివాహం చేసుకున్నారు. 
ఆమెది మైసూరు..
సంగీతంలో చక్కటి సాధన చేసిన మనిషామె.

మా నాయన పరమ సాహిత్యప్రియులు. 
ఆయనది చాలా రసికమైన జీవితం 
మా ఇంట్లో ..
నిరంతరమూ సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి. 
వాటినన్నిటినీ కూడా చాలా శ్రధ్ధగా గమనిస్తూ ఉండేవాడిని. 

పైగా చిన్నప్పుడు నాకు ..
సంస్కృతమూ ..
తెలుగూ ..
తెలుగు ప్రబంధాలూ..
మా నాన్నగారే చెప్పారు..

ఈ రీతిగా ..
ఆయన సాహితీ జీవితం..
మా ఇంట్లో నిరంతరమూ జరుగుతూ ఉండేటటువంటి సాహిత్య సంగీత గోష్టులూ..
ఇవన్నీ నాకు బ్రహ్మండంగా స్ఫోరకాలైనాయి ..
చిన్నప్పుడు..
అప్పుడు నేను థర్డ్ ఫారం చదువుతూ ఉండేవాడిని.

నాకు ఒక చెక్క పెట్టె ఉండేది. ..
ఆ పెట్టెకు పక్కలో కూచొని ..
అల కవితా లోకమునకు ..
అనే కంద పద్యం మొదలు పెట్టినాను. 
మా నాయనగారు కాఫీ తాగి.. గడ్డకొచ్చి ..
నేను ఏదో మూడీగా..
ఆ లోచిస్తూ ఉండడం ..
గమనించారు. 
దూరం నుంచీ దగ్గరకొచ్చి..
ఏం రాస్తున్నావు ..?
అని ఆ పేపరు తీసుకున్నారు. 
అల కవితాలోకమునకు..
అని ఫస్ట్ లైన్ రాసినాను..
చాతకాని వాడివి..
పద్యం ఎందుకు ఆరంబించావురా ..
అని ..
కలిమికి వైరంబదేమి కలిగెను చెపుడా ..
కలికాల మహిమ ..
సద్గుణ కవికుల నృప సింహములకు  కనకుండుటయే రాసుకో  ..
అన్నారు..

ఇట్లా.. 
ఆయన ఆసువు మహా సులభంగా చెప్పేవాడు. 

కాఫీ తాగేవాడు. ..
సురలోకంబున కమృతము..
నరలోకమ్మునకు కాఫి..
..........
ఎరుగక కాఫీని తిట్టుటే ..మది నేర్పో ..
ఇట్లా.. 
(నవ్వు..)
మాట్లాడితే పద్యం చెప్పేటటువంటి ధోరణి ..
ఆయనకు ఉండేది. 

ఇది ఆయనపై తిక్కన కవితా ప్రభావమని..
నేను అనుకుంటాను. 
వీళ్ళంతా తిక్కన భక్తులు...
కట్టమంచి రామలింగా రెడ్డి ..
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ..
మా నాయనా ..

ఇలా..
మా నాయన గారికి ..
దాదాపు..
పదహైదు పర్వాలు నోటికి వచ్చు ..
అందువల్ల ..
ఆ ఆశు కవితా ధోరణి ..

తిక్కన ప్రభావం వల్ల ..
ఆ ఆశుకవితా ధోరణి అలవాటు పడిందేమో నని..
నా ఊహ ..
ఇట్లా ప్రతిదినమూ ..అడుగడుగునా..
మా ఇంట్లో ..                                  
ఈ సాహిత్య గోష్టులు ..
సంగీత గోష్టులూ..
జరుగుతూనే ఉండేవి ..
స్కూలుకు పోవడానికి పదిగంటల వరకూ..
రోజూ ఇదే చర్చ ..
ఇదంతా చాలా నిశితంగా గమనించేవాణ్ణి నేను. 

సాయంకాలం స్కూల్ నుంచీ వస్తూనే..
మళ్ళీ పదిమందీ చేరడమూ..
మళ్ళీ ఇదే చర్చ. 
నేను రాసే ప్రతి పద్యమూ కూడా ..
ఆయన నాకు తెలీకుండా చూస్తూ ఉండేవాడు.
అయినా..
ఆయన నా గూర్చి ఒక గొప్ప మాట చెప్పలేదు. 

నేను పెద్ద వాణ్ణయిన తరువాత గూడా..
నేనెక్కడైనా ఉపన్యాసాలిస్తూ ఉంటే..
ఆయన నాకు కనబడకుండా..
నలుగురిలో..
ఎక్కడో ..
అప్రత్యక్ష్యంగా ..
వినిపోతూ ఉండేవాడు. 


ఎవరైనా ఏం స్వామీ..
మీ కొడుకును గురించి ..ఒక్క మాట చెప్పరే?
అంటే ..
తండ్రి కొడుకు గురించి గొప్ప మాట చెప్పటం..
వాడికి ఆయుష్కరం కాదప్పా..!
అని చెప్పేటటువంటి వాడాయన..
అందువల్ల ..
నాకు సాహిత్యంలో ప్రవేశించడానికి..
ప్రబోధకమైన శక్తి మా నాయన. 
వాతావరణం మా ఇంట్లోనే ఏర్పడింది.
పైగా ..
నన్ను కన్నతల్లి ..
మా నాయన..
ఇద్దరూ కవిత్వంలోనే మాట్లాడుకోవడమూ ..
పద్యాలూ..                                      
శ్లోకాలలో ..
జాబులు రాసుకోవడమూ ..
కూడా చేసే వారు. 
నన్ను గురించి ..
మా అమ్మ ఒక పద్యం జాబులో రాసింది.

నీలాల కనులలో..
నిల్వ నుత్సాహంబు..
బుడి..బుడి..నడల..
నల్లెడల బాకు..
పట్టుకొమ్మని..
వెంటబడి పట్టబోవంగ..
యెత్తుకొమ్మని ..
చేతులెత్తు పైకి..
కురులు ఫాలస్థలంబున గునిసియాడ..
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగ..
తాను నర్తించు..
ధయి..ధయ్యి..ధయ్యి..మనుచు..
చిన్న పాపడు సుఖముగనున్నవాడు..