25 మే, 2013

20 మే, 2013

పెద్దన్నవరూధిని - రోషభీషణ






తెలుగు పంచ మహా కావ్యాలలో

 ప్రథమ ప్రబంధం మను చరిత్ర. 

మార్కండ డే య పురాణంలోని ఒక చిన్న కథను 

తీసికొని 


తన అద్భుత కవితా ప్రావీణ్యంతో 


ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు 


వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు 

పెద్దన. 



ఒక వరణా తరంగిణిని, 

ఒక అరుణాస్పద పురాన్ని, 

ఒక ప్రవరుని 

ఒక వరూధినిని, 

ఒక స్వరోచిని, 

ఒక మనోరమను సృష్టించి 

పాఠకుల హృదయాలలో 

ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

అయితే 

అందులోని ''తరుణి ననన్య కాంతను''

 అనే పద్యం గురించిన చరిత్రను చెబుతూ 

ఈ పద్యం పెద్దన్నది కాదని

 ''పద్యం బొక్కటి చెప్పి..'' లో పుట్టపర్తి వారు 

అంటున్నారు ..






''తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్ప శిలెముఖ వ్యధా
భరవివశాంగి నంగభవు బారికి, నగ్గము సేసి, క్రూరుడై
యరిగె, మహీసురాధము దహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె కషాయదీధితిన్..'' 

పెద్దన్న గారు ఏమనుకొని యీ పద్యం వ్రాసినారో
నాటినుంచీ చాలామందిని యీ రచన వేధిస్తూ వుంది.
నా చిన్నతనంలో 
యీ పద్యం పెద్దన్న గారిది ఔననీ-కాదనీ 
యెన్నో వదోపవాదాలు జరిగాయి

ఇంతకూ యిందులో యేమి చెప్పినాడాయన..
ప్రవరుడు వరూధిని మీద బడితే త్రోసివేసినాడు
ఆవిడ .. తరుణి.. 
మంచి వయస్సులో వున్నదన్నమాట..

'అనన్య కాంత..'
అంతకుముందే మగవాని స్నేహమూ లేనిది..
'కన్నెరికపు రతి'యని 
పెద్దన్నగారే..వేరొకచోట సర్టిఫికెట్టు ఇచ్చినారు..

అటువంటి స్త్రీ 
యేకాంతంలో తనకు తానై వలచివస్తే
ఆమెను మన్మధుని బాణాలకు అగ్గము చేసిపోయినాడని 
ప్రవరునిపైన సూర్యునికి విపరీతమైన కోపము వచ్చిందట..

ఆ కోపంతో 
ఆయన ముఖమండలం యెర్రబారింది..
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి  వర్ణిస్తూ వున్నదీ పద్యం
పైగా .. 
ఇందులో ప్రవరునికి వాడిన విశేషణాలు దారుణంగా వున్నాయి

క్రూరుడు.. 
మహీసురాధముడు.. 
అహంకారి..  అని
ఆయనకు యిచ్చిన యోగ్యతా పత్రాలు

యీ పద్యం నిజంగా పెద్దన్న గారిదే అయితే
ఆయనకు వరూధినిపైన విపరీతమైన సానుభూతి యని 
అర్థమవుతూ వుంది.

అంటే 
ప్రవరుడు వరూధినిని పొంది వుండవలసిందన్నమాట..
నా చిన్నతనంలో
కొందరు 'ఆంగ్ల విద్యా వాసనావాసితులు'
 దీనికిట్లే అర్థం చెప్పి నైష్టికులను గేలిచేసేవారు..

నిజంగా 
పెద్దన్న గారి అభిప్రాయం కూడా అదే అయితే
ఆ లాలసతను చెప్పడానికి 
ఇంత పెద్ద కావ్యం వ్రాయవలసిన పనే లేదు..

పైగా .. 
కావ్యం కూడా కొత్త మలుపు తిరిగి వుండేది..
ఆయన అభిప్రాయం కావ్యరచన్లో 
'కర్మ నిష్టనూ.. '
'వైదిక శ్రధ్ధనూ ..'
సమర్థించడమే..

పైగా యీ పద్యంలో
 ''నభోమణీ' శబ్దం యేమీ బాగ లేదు..
యౌగికార్థం సరిపోదు
రూఢ్యార్థాన్ని  తీసికొని సూర్యుడనే అర్థం చెప్పుకోవలె..

పెద్దన్నగారికి
 ఇలా కక్కుర్తిగా శబ్దాన్ని వాడే దారిద్ర్యం లేదు..
ఇంతకూ యీ రచన ఆయన చేసి వుండడనేది నా అభిప్రాయం
మరి దీనికి బదులు వేరే పద్యం వుండేదో 


లేక ఆ వర్ణనే లేకుండా వుండేదో కూడా చెప్పలేము..
అలా వుండడానికిన్నీ వీలు లేదు కదా
కావ్య ధర్మాన్ని బట్టి 
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి యేదో ఒక రీతిగా వర్ణించవలసిందే..

ఇంతకూ 
పెద్దన్న యే ముహూర్తంలో దీనిని వ్రాసారో 
అప్పటినుంచీ యీ రచన చాలా గందరగోళంగానే వుంది.. 


15 మే, 2013

ఖైదీ ..


శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..







శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..

 పుట్టపర్తి వారి జనప్రియ  రామాయణము 
యధార్థానికి అమృత ప్రవాహము లాంటిది..
ఈ ప్రవాహములో దిగి ..
రసమును చవి చూచే శక్తి మనకుండవలెనే గానీ ..
దానివలన ..
మధురాతి మధురమైన అనుభూతి కలుగుతుందనటంలో 
సందేహం లేదు..

ఒకచోట పరతత్త్వ స్వరూపం దర్శనమిస్తే..
మరోచోట లక్ష్మణస్వామి విశేష శేష స్వభావం ప్రకటమవుతుంది..
ఇలా..
అరణ్య కాండలో 
శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు దర్శించిన ఘట్టాన్ని 
వివరిస్తున్నారు కులశేఖరరావు గారు

చివరగా..
శ్రీరామునికి సుగ్రీవుని వంటి మంచి చెలికాడు లభించుట 
పరమార్థమే అయినప్పటికీ
 ఆ భగవత్స్వరూపునికి 
ఉత్తమ భక్తుడు లభించిన విశేషమునే 
కవి ఉదాత్తంగా చెప్పి 
సందర్భానికి రమణీయార్థాన్ని కలిగించారు

ఒక మహాకావ్యానికి 
ఇంతకంటే మంచి ప్రయోజనం కానీ ఔత్కృష్ట్యం  కానీ 
ఉంటుందని నేననుకోను అంటూ ముగించారు..
మరి చదవటం మొదలెడదామా.. 




13 మే, 2013

A.S. రామన్


అవధాని సీతా రామన్ 
A.S. రామన్ పూర్తి నామం


పుట్టపర్తి వారు
 ప్రొద్దుటూరు హైస్కూల్ పండితునిగా ఉన్నప్పుడు 
ఫిప్త్ ఫారం కాబోలు చదువు కున్నాడు A.S. రామన్.. 
ఇంగ్లీషు సాహిత్యం లో 
జర్నలిజం లో బాగా కృషి చేసాడు.
వందసంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కి 
తొలి భారతీయ ఎడిటర్ గా పనిచేసాడు..
సత్య సాయి బాబా గారి గురించి కానీ
దక్షిణాది సంగీత విద్వాంసుల గురించి కానీ
తొలిసారి ఉత్తరాది వారికి పరిచయం చేసిన వ్యక్తి 
ఆయన హయాంలో 

రెండు మూడేళ్ళపాటు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సర్క్యులేషన్ బాగా పెరిగింది.
A.S. రామన్ 

పుట్టపర్తి వారి గురించి యేం చెబుతారో తెలుసుకుందాం..




నేనూ ..
పుట్టపర్తి నారాయణాచార్యులూ 
ముఫ్ఫయ్యవ దశకం మధ్యలో 
మా ఉమ్మడి సాహిత్య కృషిలో 
సన్నిహిత సహచరులమయ్యాము. 

కానీ 
మేమేదీ ఉమ్మడిగా ప్రకటించలేదు. 
మేము సాహిత్య విషయాల మీద గంటల కొద్దీ చర్చించుకొనేవాళ్ళం ఒక్కొక్కప్పుడు 
మేము తీవ్ర వాదోపవాదాల్లో చిక్కుకునే వాళ్ళం కూడా. 
కానె చివరికి ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్ళం లేదా, 
ఎవరి అభిప్రాయం వారిది అన్న అంగీకారానికి వచ్చేవాళ్ళం 

మా అన్యోన్య ప్రతిస్పందన 
ఆత్మీయంగానూ 
పరస్పర ప్రేరకంగానూ ఉండేది. 

మా విడదీయరాని అన్యోన్యత 
నేను 1942 లో ఢిల్లీ వెళ్ళేవరకూ కొనసాగింది.
అప్పటినుంచీ నేను వెనుదిరగలేదు. 
భారతికి మాత్రం రాస్తూ ఉండేవాడిని 

ఇంగ్లీషు సాహిత్యం లోని 
సరికొత్త ధోరణులను ఎరుకపరచడంద్వారా 
నేను పుట్టపర్తి సాహిత్య దృష్టిని మరింత విశాలం చేయగలిగానని 
గర్వంగా చెప్పుకోగలను. 

నా తెలుగు రచనా వ్యాసంగంపై 
ఆయన ప్రభావం కృషి ఏకాంక నాటికలలో ఉండేది. 
నాకన్న పెద్దవాడు కానీ.. 
విజయం సాధించిన వాడు కానీ 
అయిన కవిని అనుసరించి నన్ను నేను తీర్చి దిద్దుకోవటానికి
 నా స్వంత ప్రపత్తి ఆత్మ గౌరవం అడ్డువచ్చేవి.. 

(శ్రీ A.S.రామన్ పుట్టపర్తి వారి వద్ద 
ప్రొద్దుటూరు హైస్కూల్ లో చదువుకున్నారు. 
తరువాత వారిద్దరూ సన్నిహితులైనట్లు 
పై వ్యాసం తెలియజేస్తూ ఉంది..
-ఆంధ్రప్రభ,సచిత్ర వార పత్రిక)