7 జులై, 2013

బాపురెడ్డి



J.బాపురెడ్డి
వీరి పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి
రచయితలు కవులు 
తమ పుస్తకం వెలువడిన తరువాత 
ప్రముఖులకు కాపీలు  పంపుతుంటారు కదా 
అలా 
మా ఇంటికి చాలా  పుస్తకాలు వచ్చేవి
















5 జులై, 2013

పుట్టపర్తి స్నేహితుడీయన









అది 1941 వ సంవత్సరము
ధర్మవరంలో సరస్వతీ నిలయము 
అనే గ్రంధాలయ మూడురోజుల వార్షికోత్సవాలు

చివరిదినమది..
గుఱ్రం జాషువా కవి ఉపన్యసిస్తున్నారు..
పుట్టపర్తి "షాజీ" కావ్య ప్రసక్తి వచ్చింది
షాజీ కావ్య రచన అంతా 
నా రచనా విధానానికీ 
భావావేశానికీ ప్రతిబింబమే కానీ
దానిలో కవి ఉపజ్ఞ తక్కువ 
అన్నారు జాషువా..

సభ నేర్పాటు చేసిన వాడు
స్వయానా పుట్టపర్తి స్నేహితుడు ఆప్తుడు
తన  ఆప్తుని పైనా
అందునా 
స్వయం ప్రజ్ఞా ధురీణునిపైనా 
చేసిన నిందారోపణలను సహించలేకపోయినాడు..

జాషువా గారి ఆరోపణలకు ఆధారాలేవో 
సభాముఖంగా వివరించమని కోరినాడు
ఆయన కొంత కోపంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసే సరికి 
సభ గగ్గోలయ్యే పరిస్థితి వచ్చింది
అందరూ సర్దుబాటు చేసినారు

ఇది ఎవరి అనుభవమనుకొంటున్నారా
పుట్టపర్తి స్నేహితుడు సహపాఠీ
 కలచవీడు శ్రీనివాసాచార్యులు గారివి

ఒక పదహారేండ్ల యువకుడు
తిరుపతి వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో 
ప్రవేశాన్నర్థించేందుకై వచ్చినాడు
ప్రవేశం నిరాకరింపబడింది
ఎర్రబడిన ముఖంతో 
భావి కర్తవ్యాలోచనతో 
ఆఫీసు గడప దాకా వస్తూ వస్తూ ఏవో కొన్ని పద్యాలు చెప్పటం
ప్రిన్సిపాలు గారు వినటం తటస్థించించింది 
వారూ సామాన్యులు కాదు 
సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో దిట్టమైన పండితుడు


అవి వేడుకోలు పద్యాలు కావు
హృదయావర్థకమైన భావపుష్టితో 
ఆత్మాభిమానాన్ని వెల్లడించేవి

మనస్సునందే వెలుగు వెలిగిందో 
వెంటనే
ప్రిన్సిపాలు గారు పిలిచారు మళ్ళీ వెనుకకా బాలుణ్ణి
మళ్ళీ ఆపద్యాలు చెప్పించుకున్నారు
ప్రిన్సిపాలు గారి ముఖంపై 
చిరునవ్వు..
ఆశ్చర్యం ..
వాత్సల్యం.. తొణికిసలాడాయి
వెంటనే నీ ఇష్టం వచ్చిన క్లాసులో చేరవచ్చునని సెలవిచ్చారు

ఈ అనుభవాన్నీ ప్రత్యక్షంగా పంచుకున్నారు 
కలచవీడు శ్రీనివాసాచార్యులు గారు

ఏకసంథాగ్రాహిత్వమూ
తీక్ష్ణమైన బుధ్ధీ గల పుట్టపర్తికి
నత్త నడక నడిచే ఆ విద్యా విధానం బొత్తిగా నచ్చలేదు

అందుకే
క్లాసులో పాఠం చెప్పే అయ్య వారికే అర్థం గాని
 ప్రశ్నలను సందేహాలనూ వదిలి
వారు తికమక పడితే పగలబడి నవ్వుకునే వారట

ప్రతిక్లాసునూ సాగనివ్వక ఇబ్బంది పెట్టే విద్యార్థిగా 
'get out from the class'
అనిపించుకొని దినమంతా లైబ్రరీలో గడిపేవారు
వున్న పుస్తకాలన్నిటినీ చదువుతూ

ఇంకా
జాషువా ఖండ రచనలూ.. 
రాయప్రోలు తృణకంకణమూ .. 
విశ్వనాధ వారి దీర్ఘ సమాసోపేత రచనలనూ ..
చదివి తోటి విద్యార్థులకు వినిపించేవారు

మా అంతట మేము చదువుకుంటే
అంత రమ్యంగా వుండేవి కావు
ఆయన చదివితే అదేదో మైమరచి వినేవాళ్ళం
ఆ హృదయానికీ ఆ కంఠానికీ
అంత పొత్తున్నది
అంటారు శ్రీనివాసాచార్యులు గారు

ఈ విషయాలన్నీ మా అయ్య మాటల్లో 
మేము వినే వాళ్ళం
నవ్వి నవ్వి ఎర్రబడిన ఆ ముఖం
ఇంకా గుర్తే..
























28 జూన్, 2013

వారాల అబ్బాయిలు

                        
వట్టి చేతులతో వచ్చిన లక్ష్మీదేవికి ఎవరు ఆతిధ్యమివ్వగలరు..?


ధనం ఉన్నప్పుడే దానం చేయగలడనీ..
ఉపాధి ఉన్నవాడే ఊరికి ఉపకారం చేస్తాడనీ..
అనుకోవడం వెర్రి తనం ..

గుండె పండినవాడే పదిమందికి సాయం చేస్తాడు..
చెప్పులు కుట్టే చంద్రయ్య కైనా 
రోజుకి అర్ధరూపాయ్ వస్తుందేమో
 కానీ
అచ్యుతరామయ్యకి ఖచ్చితంగా ఇంత వస్తుందని  ఉండేది కాదు..
పొద్దుటే ముష్టి చెంబు పట్టుకుని
సీతారామాభ్యాన్నమః
అంటూ నాలుగు వీధులూ తిరిగితే అర్ధశేరు బియ్యం
జంధ్యాలు వడికితే అర్ధరూపాయి దక్కేవి
వీటితో సంసారం గడవడం కష్టమే

అయినా అతనెప్పుడూ దీనంగా దిగులుగా ఉండేవాడు కాదు..
పదిమందికీ తల్లో నాలుకలా నవ్వుతూ నవ్విస్తూ 
పదిమందికీ సాయం చేస్తూ కాలక్షేపం చేసేవాడు

ఊరంతా ఉప్పునీళ్ళే
కూలిపోతున్న పాకా 
ఓ మందార చెట్టు 
పక్కనే ఓ మంచినీళ్ళ బావీ..

ఊరందరూ అతని బావిలో నీరు తోడుకు వెళ్ళవలసిందే..
అతను కాదంటే వారికి మరో మార్గం లేదు..
అతని దారిద్ర్యం ఆసరా చేసుకుని 
అందరి దగ్గరా తలా అర్ధరూపాయ్ వసూలు చేసినా 
అతని బీదరికం మటుమాయమయ్యేది..

కానీ 
అతనికి అలాంటి నీచమైన ఆలోచన యెప్పుడూ రాలేదు..
ఊరంతా తన బావిలో నీళ్ళు తోడుకుని వెడుతుంటే 
ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉండేవాడు..
ముసలి వాళ్ళూ 
పిల్లలూ చేద లాగలేక ఇబ్బంది పడితే
తాను వెళ్ళి సాయం చేసి వారు కృతజ్ఞతలు చెప్పబోతే.. 
చాల్లెండి ఏమాత్రానికేనా 
అని సిగ్గు పడిపోయేవాడు..

అవతలి వాడు అవసరం లో ఉన్నాడు కదా
 వీలైనంత దండుకుందాం 
అనే తత్త్వం ఆ రోజుల్లో నూటికి తొంభై మందికి ఉండేది కాదు 

ఇలా 
''ఆరోజుల్లో..'' పుస్తకంలో 
పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు 
పరిచయం చేసిన నాటి మనుష్యుల మనస్తత్వాలు ఎన్నో
చెయ్యి తిరిగిన రచయిత ఏది చెప్పినా అద్భుతమే..

నిజమే ఆ రోజుల్లో దాతృత్వం పాలు ఎక్కువే..
మా ఇంట్లో 
వారాల అబ్బాయిలు ఎప్పుడూ ఉండేవారట..
ముగ్గురు నలుగురు..

వంటవగానే మా అమ్మ 
అప్పటికి పదేండ్ల దయిన మా నాగక్కయ్యతో 

"ఏయ్ నాగా..
 వెళ్ళి వాళ్ళని అన్నానికి రమ్మను పో .."అనేదట
మా అక్కయ్య రివ్వున వెళ్ళి
"అన్నా..
 అన్నానికి రావాలంట
వంటయింది..
మా అమ్మ రమ్మంటూంది.."
అని చెప్పేది..

ఆ హైస్కూల్ పండితుని 
రెండువందల జీతంలో 
అద్దె ఇంట్లోనితమ అయిదుగురు పిల్లలతో  పాటూ
 వారాల అబ్బాయిలూ బరువనిపించలేదు..

ఒకసారి
మా పిన్ని కూతురు అల్లుడూ వచ్చారు చూడటానికి
''ఉండండి..
సాపాటు చేద్దురు ..''అంది అమ్మ

కానీ
ఇంట్లో బియ్యం లేవు
పక్క ఇంట్లో అరువుకు బియ్యం కావలసిన సామగ్రి తెచ్చి 
వారికి అతిఢి సత్కారం చేసింది మా అమ్మ

మా పిన్ని అల్లుడు పుట్టపర్తికి అమిత భక్తుడు
ఉపాసనాపరంగా సాహిత్య పరంగానూ
ఆయన ఇంటి పరిస్తితి చూసి 
అంతటి పండితునికీ పరిస్తితి యేమిటో కదా
అని చాలా బాధ పడ్డాడట.. 


23 జూన్, 2013

readers mail english paper cutting



పుట్టపర్తి స్వంత దస్తూరి తో శ్రీశైలం గారికి వ్రాసిన లేఖ 

ఒకప్పుడు కడప ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో
సాహిత్య దుమారం చెలరేగింది
అప్పుడప్పుడే పైకి వస్తున్న పుట్టపర్తిని చూచి ఓర్వలేని
ప్రాంతీయ కవులు కొందరు
పుట్టపర్తికి సంస్కృతం రాదనీ
మేఘదూతంలోని కొన్ని అంశాలపై
వరుస కధనాలను దినపత్రికలలో ప్రచురించారు
కానీ 
అవేవీ పుట్టపర్తి కీర్తిని తగ్గించలేకపోయాయి
కానీ 
ఎంతో మనస్తాపాన్ని కలిగించాయి
లౌక్యం  లేని వాణిగా పరిగణింపబడే పుట్టపర్తి
సూటిదనమే తనకు సరైన మార్గంగా ఎంచుకున్నారు





నిత్య పాండిత్య పరిశోధకుడు పుట్టపర్తి


సేకరణ : రామవఝుల శ్రీశైలం 



నిత్య పాండిత్య పరిశోధకుడు పుట్టపర్తి