9 ఆగ, 2013



ఇది పుట్టపర్తి వారి సరస్వతీ సంహారము 
(కన్నడ రచయిత బీచీ నవలకు పుట్టపర్తి తెలుగు అనువాదం)
 పై 1959  వచ్చిన సమీక్ష 

ఆనాటి స్త్రీ పై రుద్దిన సాంఘీక దురాచారాలకు 
ఒక నమూనా యీ నవల

కన్నడభాషలో ప్రసిధ్ధ రచయిత
"బీచీ "
పేరొందిన రచన ఇది
"పెళ్ళాన్నేం చేస్తావురా బాళప్పా..?"
అంటే 
"గొంతు పిసికి బాయిలో వేస్తాను"
అన్న వాక్యాలతో ప్రారంభమైన కథ
ఆ మాటలతోనే ముగుస్తుంది

ఈనాడు స్త్రీ స్వేఛ్చ కై 
ఎవరూ పోరాడవలసిన అవసరం లేదు
కావలసిన చదువులు చదువుతున్నారు
విదేశాలకు వెళ్ళుతున్నారు
నచ్చిన వాణ్ణిపెళ్ళాడుతున్నారు
వారి పిల్లలనూ వారి అభిరుచులకు అనుగుణంగా పెంచుతున్నారు

ఒకవేళ పెళ్ళి జరిగిన తరువాత 
భర్త ప్రవర్తన ..
ఆ ఇంటి వారి ట్రీట్మెంట్ సరిగ్గ లేకపోతే
ఎంతో ధైర్యంగా 
వివాహ బంధాలను తెంచుకొని 
స్వతంత్రంగా బ్రతకటానికీ 
ఈనాటి స్త్రీ భయపడటంలేదు

"కార్యేషుదాసీ..
కరణేషు మంత్రీ.." 
లాంటి  ధోరణులను తేలిగ్గా 
పాత చింతకాయ పచ్చళ్ళుగా  చేసేస్తూంది..

అందుకు తగ్గట్టు 
తలిదండ్రుల ఆలోచనా ధోరణీ  ఎంత మారిందంటే
భర్త చనిపోయిన తమ కుమార్తెకు 
ఇంకో భర్తను 
ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా వెతుకుతున్నారు

ఆమె మొదటి భర్త సంతానమేమైనా వుంటే 
వారి పెంపకం బాధ్యతను తాము స్వీకరించి 
తమ కూతురి  సుఖ సంతోషాలకు 
తమ వంతు సహాయం చేస్తున్నారు

యువకులు కూడా 
తమ సహృదయ భావనలను ఇనుమడింపజేసుకొని 
ఒకసారి పెళ్ళయిన స్త్రీ నుదుటన 
తిరిగి కుంకుమ దిద్దటానికి వెనక్కు తగ్గటం లేదు

"పవిత్రత" అనేది
 ఆడ మగలిద్దరికీ వర్తిస్తుందనీ
అంగీకరిస్తున్నారు.
ఈనాడు స్త్రీకి ఏవిధమైన ఆటంకాలూ 
ఏరంగంలోనూ లేవు..

కానీ 
ఒకనాడు పరిస్థితి ఇలాలేదు
స్త్రీ ఒక బలిపశువు

తల్లిదండ్రుల అత్తమామల ఒడంబడికకు 
తలవూచి పుట్టింటి చెరసాల నుంచీ 
అత్తింటి చెరసాలకు తరలివెళ్ళే ఒక జీవి
అంతే

ఒకనాడు పందెంలో పెట్టబడింది
మరోనాడు అంగడిలో అమ్మబడింది
ఇంకోనాడు కారడవులకు పంపబడింది
శీలపరీక్షకు అగ్నిలోనూ దూకమన్నారు

ముసలి వరుళ్ళకు 
ముక్కుపచ్చలారని పిల్లను కట్టటం 
మనం విన్నాం

ఆ పిల్లకు 
యవ్వనం రాకముందే ఆ ముసలి చస్తే
కఠినాతి కఠినమైన నిబంధనలకు 
బలియైన కన్నెల జీవితాలను 
మనం చదువుకున్నాం

గుండు గీయించారు
బొట్టూ పూలు రంగుల బట్టలూ నిషేధించారు
తెల్ల చీర చుట్టబెట్టారు
ఉపవాసాలూ ఉప్పూ కారం లేని తిళ్ళూ తినమన్నారు
కదూ..

ఇలాంటివానిని దురాగతాలన్నారు వీరేశలింగం
కన్యాశుల్కంగా కలమెక్కించారు గురజాడ

అలాంటి ఒక కథే ఈ సరస్వతీసంహారము 
ఆ రోజులలో అందరి ఆదరణా పొందిన నవల
అందుకు తగ్గని చిత్రణతో 
మన్నన పొందిన అనువాదం
ఇప్పుడు మీరు చదవబోతున్నది 
ఆ అనువాదానికి జరిగిన సమీక్ష.. 
సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం 



5 ఆగ, 2013

"సరస్వతీ సంహారము" 1959 లో వచ్చిన సమీక్ష

29 జులై, 2013

విఠల్ భాయ్ పటేల్ విందు కి పిలచిన వేళ ..


విఠల్ భాయ్ పటేల్
మన భారతీయ శాఖాహార వంటలలో
ఆంధ్ర,కేరళ,తమిళనాడు,కర్ణాటక
రాష్ట్రాలలోనే భిన్న భిన్న రుచులు

కేరళీయులు కొబ్బెరతోనే వంటలను మొంచెత్తుతారు
కన్నడిగులు తీపిని ప్రతి పదార్థంలో చేరుస్తారు
తమిళులకు సాంబార్ తోటే దినం గడుస్తుంది

ఇక ఉత్తర దేశం మనకు పూర్తి వ్యతిరేకం
పూరీలు రొట్టెలు వాళ్ళకు ప్రధానం
అన్నం అంతగా ఇష్టపడరు

ఇక స్వీట్లు రకరకాలు
పెరుగు పాలు నిత్యజీవితంలో భాగం
పచ్చి కూరగాయల సలాడ్ లేకుండా 
వారి భోజనం ముగియదు..

మనం బియ్యం పప్పులకోసం పెట్టినంత డబ్బు వాళ్ళు
స్వఛ్చమైన నీళ్ళు కలపని పాలకోసం పెడతారు
చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకూ 
రోజూ ఒక పెద్ద గ్లాసెడు పాలు తాగటం వారికిష్టం


ఉక్కు మనిషి 
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సోదరుడు
విఠల్ భాయ్ పటేల్
పుట్టపర్తి నైనిటాల్ సభకు వెళ్ళినప్పుడు 
పుట్టపర్తి తదితరులను తన ఇంటికి విందు కి పిలిచాడట.

పుట్టపర్తి ఏనాడూ రుచులకు ప్రాధాన్య మివ్వలేదు
ఆకలి వేళకు ఏదో ఒకటి
అయితే వైష్ణవులకు పరమ ప్రీతి పాత్రమైన పులిహోరపై కొంత మక్కువ చూపేవారు అదీ వయసైన తరువాత 


యవ్వనంలో అంతా 
ఎన్నో కోట్ల జపం చేసాను 
నాకు ఆధ్యాత్మిక పరమైన అనుభూతులు 
ఎందుకు కలగటం లేదు..?
అని తపించి..

 నిస్సంగులైన సాధువులకు ఆలవాలమైన 
హిమాలయ పర్వత సానువులపై 
తనకు దారి చూపే  వారి కోసం వెదకిన మనిషి 
రుచులకోసం అర్రులు చాస్తాడా..?

అక్కడి సాధువులకు దొరికితే భోజనం 
లేకపోతే గాలే తిండి

చాలామంది దిగంబరులుగానే వుంటారు.. 


ఆనాటి పుట్టపర్తి వ్యక్తిత్వమూ
దృష్టీ
అతను నడచిన దారీ
ఎంతో మంది గొప్పవాళ్ళను ఆకర్షించింది
అందుకే వల్లభ భాయి పటేల్
నెహ్రూ
గాంధీజి
ఇంకా ఎంతో మంది పుట్టపర్తిని హిమాలయ శిఖరం అన్నారు
సరే
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ వారింటికి భోజనానికి పిలిచారు
అక్కడేం జరిగింది
పుట్టపర్తి మాటల్లోనే వినండి.. 
ఈ సంఘటన 
నైనిటాల్ లో మన పుట్టపర్తి శివతాండవ గానం చేయడానికి వెళ్ళినప్పుడు జరిగింది.. 
నెహ్రూ గారు పుట్టపర్తి గురించి ఏమన్నారో 
మరోసారి మాట్లాడుకుందాం.. 

"ఈ పటేల్ అన్న
విఠల్ భాయ్ పటేల్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు 
రాజీనామా చేసినాడు కదా..
ఆయన అసెంబ్లీ నుంచీ..
నైనిటాల్ కు పోయినప్పుడు ఆయనింటికి భోజనానికి పిలిచినాడు
తిన్న పదార్థాలలో ఒక్క పదార్థం అర్థమైవుంటే ఒట్టు
ఇంత పెద్ద ప్లేటు పెట్టినారు
చుట్టూరా గిన్నెలు పెట్టినారు
కొన్ని పుల్లవి,తీపివి,..
ఒక్కటిమాత్రం నాకర్థమైంది
పచ్చి ఎర్రగడ్డలు తరిగి ఉప్పేసి పెట్టినారు
తరువాత ముంత మామిడి పప్పు..
ఆయన మీమాంసా శాస్త్రంలో చాలా గొప్పవాడు

భోజనం ఏమోగానీ ఆయన చదువుకు దండంపెట్టి వచ్చా.. "


27 జులై, 2013

తాన్‌సేన్




మియాఁ తాన్‌సేన్

హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో 

ఘనమైన చరిత గలవాడు. 

ప్రముఖ వాగ్గేయకారుడు. 

మధ్య ఆసియా కు చెందిన 

రబాబ్ 

అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. 

మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. 

బాల్యం పేరు 'రమ్తాను పాండే',

అక్బర్ ఇతన్ని 


మియాఁ (మహా పండితుడు) 


అనే బిరుదునిచ్చి గౌరవించాడు


తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే 


వర్షం పడేదని  చెపుతారు.

 సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. 

ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో 

ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 

ఇండియా లోని గొప్ప సంగీతకారులు


 దీనిలో పాల్గొంటారు.


1955 లో పుట్టపర్తి వ్రాసిన రాయల నీతి కథలలోని 

మరొక వ్యాసమిది


ఇది తాన్ సేన్ సమాధి. 

ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు.