4 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు "వసుచరిత్ర వైచిత్రి"

  
రామ రాజ భూషణుని అసలు పేరు..
 భట్టుమూర్తి..
ఈయన ..
పదహారవ శతాబ్దమునకు చెందిన కవి 
సంగీత విద్వాంసుడు.

శ్రీకృష్ణదేవరాయల అల్లుడు ..
అళియ రామరాయలు..
గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, 
చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో 
ప్రముఖ పాత్ర పోషించినాడు. 
విజయనగర రాజ వంశములలో 
నాలుగవది, చివరిదీ ఐన 
అరవీటి వంశమునకు ఆద్యుడు.
 శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున 
ఈయనను అళియ రామరాయలు 
(కన్నడములో అళియ అంటే అల్లుడు) 
అని కూడా వ్యవహరిస్తారు..
ఈతని ఆస్థానమునకు ..
ఆభరణము వలె ఉండటము వలన..
రామ రాజ భూషణుడని పేరు వచ్చింది..
 
అష్టదిగ్గజాలు 
ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు అని అర్థం .
హిందూ పురాణాలలో 
ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ
ఎనిమిది ఏనుగులు  ఉంటాయని ప్రతీతి..

అష్ట దిగ్గజముల పేర్లివీ.. ..
ఐరావతం.. పుండరీకం ..వామనం ..
కుముదం ..అంజనం పుష్పదంతం ..
సార్వభౌమం ..సుప్రతీకం..




అలాగే 
కృష్ణదేవరాయల ఆస్థానంలోని 
ఎనిమిది మంది కవులనూ 
అష్టదిగ్గజములు అని అంటారు. 


అష్టదిగ్గజములు


1. అల్లసాని పెద్దన,
2. నంది తిమ్మన,
3. ధూర్జటి,
4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
5. అయ్యలరాజు రామభద్రుడు,
6. పింగళి సూరన,
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
8. తెనాలి రామకృష్ణుడు


పింగళి లక్ష్మీకాంతం గారు భట్టుమూర్తి ని గురించి ..
"ఈ కవి గాయకుడు. 
సంగీత కళానిధి. 
సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును
 ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. 
ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. 
కీర్తనలవలె పాడదగినవి. 
అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. 
నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. 
పద్య రామణీయకత, 
ప్రౌఢ సాహిత్యము, 
 విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. ....
ఇతనికే శ్లేష సహజము. 
రామరాజభూషణునివలె 
పద్యము వ్రాయగలవారు లేరు. 
కవులలోనింతటి లాక్షణికుడు లేడు."అన్నారు..

వసు చరిత్ర పంచకావ్యాలలో ఒకటి..
అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా..
కథ మార్కాండేయ పురాణం నుంచీ తీసుకుని వ్రాయబడ్డది..
 
కేవలం ..
నాలుగైదు పద్యాలుగా ఉన్న కథని తీసుకుని 
887 పద్యాలుగా, 
6 అధ్యాయాలుగా
వ్రాయుట జరిగింది. 
అటువంటి వసుచరిత్రని మెచ్చుకొని, 
తరువాత తిరిగి సంస్కృతంలో కి అనువదించారు. 



ఇందులో కథేమిటంటే..
వసుదేవుడు గొప్పరాజు దేవేంద్రుడంతటి వాడు..
శుక్తి మతి అనే నదిని కోలాహలుడనే పర్వతుడు 
కామించి అడ్డుపడ్డాడు. 
ఆమె వసుదేవుడిని శరణని 
కోలాహలుడి బారి నుంచీ కాపాడమని 
వేడుకొంటుంది..
వసురాజు కోలాహలుణ్ణి ఒక్క కాలి తన్నుతో 
విసరి వేస్తాడు..
కానీ 
కోలాహలుడితో సమాగమం వలన..
ఆమెకు గిరిక.. వసుపధుడు ..
అనే ఇద్దరు పిల్లలు కలుగుతారు..
 
ఇద్దరినీ ఆమె రాజుకు సమర్పిస్తుంది..
రాజు వసుపధుడిని సేనాపతి గానూ ..
గిరికను పత్నిగానూ స్వీకరిస్తాడు..

స్వతహాగా సంగీత విద్వాంసుడైనందున ..
సంగీత విశేషాలతో ..అధ్భుతమైన శ్లేషలతో ..
ఈ కావ్యం 
రామ రాజ భూషణుని చేతిలో 
అందాలను దిద్దుకొంది..
ఇందులో అందరికీ నచ్చే పద్యం..
 బాగా ప్రసిధ్ధి చెందిన పద్యం ఇది.

నానాసూనవితానవాసనలనానందించుసారంగ మే
లానన్నొల్లదటంచుగంధఫలిబల్కాఁకందపంబంది యోషానాకృతిఁబూనిసర్వసుమనస్సౌరభ్యసంవాసమై
పూనెంబ్రేక్షణమాలికామధుకరీపుంజంబునిర్వంకలన్!2.47

అన్ని పూల పరిమళాలూ ఆఘ్రాణించే తుమ్మెదలు సంపెంగ జోలికి పోవట.. 
అందుకని అది తపస్సు చేసి..
 అన్ని పూల సుగంధాలనూ పీల్చే ముక్కై ..
మగ తుమ్మెదలమీది కోపంతో ..
ఆడ తుమ్మెదలను ..
అటూ ఇటూ కనుబొమ్మలుగా కట్టేసుకుందట..

చాలా బావుంది కదూ..
ఇక..
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన 
సారస్వత వ్యాసాలలో 
"వసుచరిత్ర వైచిత్రి" అయ్య వ్యాసం దొరికింది..
ఆనందంగా తీసుకున్నాను..
ఇదిగో చూడండి..








2 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’



అనువాదం ఎప్పుడూ కత్తిమీద సాములాంటిదే.
అందుకనే అనువాదం అందంగా ఉంటే ..
మూలానికి భిన్నంగా సాగి ఉండవచ్చు. 
మూలాన్ని అనుసరించి సాగితే..
అది అంత అందంగా లేకపోవచ్చు - అంటారు. 
దీన్నే ఆంగ్లంలో ''ట్రాన్స్లేషన్ ఇఫ్ బ్యూటిఫుల్ ...
అనువాదమొక కళ..
మరొక భాష లోని ఒక ప్రసిధ్ధ పుస్తకాన్ని.. అనువదించాలంటే ..
అనువాదకుడు..
రెండు భాషలలోనూ నిష్ణాతుడై వుండాలి.
ఆ పుస్తకాన్ని..
ఆమూలాగ్రంగా జీర్ణించుకునిఉండాలి
అంతేకాదు ఎవరి కవిత్వాన్ని మనం అనువదించదలచుకున్నామో..
 దాని పట్ల మనకు ప్రేమ ఉండాలి ..
ఎందువలన ఆ కావ్య సౌందర్యం భాసిల్లిందన్న
 ఆ ఆత్మను అర్థం చేసుకోవాలి.
భర్తృహరికి చాలా అనువాదాలొచ్చినా ..
ఏనుగు లక్ష్మణ కవి ..
ఎందుకు అందరినీ మించాడంటే ఛందస్సు ఎంపికలో సజీవభాషను అనుసరించటం వల్లే
"ఒక రహస్య కళ అనువాదం" వ్యాసం వ్రాసిన ..

శ్రీ సౌభాగ్య గారు..
అనువాదం ఒక ప్రేమ వ్యవహారం..
అంటున్నారు..


తమ భాగవత ఉపన్యాసాల్లో
ఈ పద్యం గురించి చెబుతూ
మూలంలో ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’ అన్న మాటలు లేవని
అవి పోతనగారు చెప్పినవని చూపించారు.
మూల భావానికి మరింత అందగించే పోతనగారు
ఆ మాటల్ని అదనంగా చేర్చారు.

అవి వ్యాసుడివి కావు,
పోతనగారి ‘లక్షణాలు’ అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులవారు.


సౌభాగ్య వీరి కలం పేరు..
మీ వ్యాసాన్ని నా బ్లాగులో వేసుకుంటానండీ ..

అని వారిని అడిగితే ..
తప్పకుండానమ్మా అని అంటూ..
 పుట్టపర్తి వారు ..
విశ్వనాధ వారిపై వ్రాసిన వ్యాసం చదివి..
 చాలా కదిలి పోయానమ్మా 
తరువాత ..
అయ్యగారిమీద విస్తృత పరిశోధన చేయాలనుకున్నాను అన్నారు.
వీరు ఆంధ్ర భూమి డెయిలీ లో శీర్షికలు నిర్వహిస్తున్నారు..
 





               ఒక రహస్య కళ కవిత్వ అనువాదం





కవిత్వాన్ని అనువదించడం కష్టం.
 కవిత్వాన్ని అనువదించడం సులభం.
ఎవరి కవిత్వాన్ని ..
మనం అనువదించదలుచుకున్నామో
దానిపట్ల మనకు ప్రేమ లేకుంటే
 దాన్ని అనువదించడం కష్టం.


మనకు ఇష్టమైన కవిత్వాన్ని 
అనువదించడం సులభం.
దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం దాకా
పాశ్చాత్య ప్రపంచానికి గ్రీకు, లాటిన్,
మన దేశానికి సంస్కృతం 
తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన భాషలుండేవి.


 సాహిత్య,వైజ్ఞానిక విషయాలు..
 వాటిల్లోనే ఉండేవి.
 ఆ క్రమంలో
వాటిలోని గొప్ప సాహిత్యాన్ని స్థానిక భాషల్లోకి అనువదించడం ప్రారంభమైంది.


ప్రపంచ సాహిత్య పరస్పర వినిమయం ప్రారంభమైంది.
సంస్కృత భాషలో మనకు సుసంపన్నమైన సాహిత్యముంది.
దాన్ని వెయ్యేళ్ల క్రితమే మన స్థానిక భాషల్లోకి అనువదించడం ఆరంభమైంది.
మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులో అనువదించారు.
అనువాదాల గురించి 
పండితులు రకరకాలుగా చెప్పారు.
మాతృకని అనుసరించి చేసింది, 
మక్కికి మక్కీగా చేసేది, స్వతంత్రంగా చేసేది.
ఇట్లా విభిన్న రీతుల్లో అనువాదాలు సాగాయి.


మన కవిత్రయ అనువాదాలు స్వతంత్రమైనదే.
అంతస్సారాన్ని దృష్టిలో పెట్టుకుకుని స్వేచ్ఛగా చేసిన అనువాదాలే.
అందుకనే వాళ్లని మహాకవులన్నామే కానీ అనువాదకులు అనలేదు.


రాజరాజ నరేంద్రుడు నన్నయని పిలిచి
‘జననుత’ కృష్ణ ద్వైపాయనముని వృషాభాహిత మహాభారత బద్ధ నిరూరితార్ధ మేర్పడ తెనుగున రచింపుమధిక ధీయుక్తి మెయిన్’
-అన్నాడట.


వ్యాసమహర్షి దేన్ని ఉద్దేశించాడో
దాన్ని అందరికీ తెలిసేలా
 మీ మేధస్సును ఉపయోగించి
భారతాన్ని తెలుగు చేయమన్నాడు.


ఆదిలోనే మన ఆదికవి 
ఆ స్వాతంత్య్రాన్ని తీసుకున్నాడు.
 అనువాదంలో ఏది స్వీకరించాలో 
ఏది వదిలిపెట్టాలో 
తనకు నచ్చిన రీతిలో చేశాడు.


 తిక్కన, ఎర్రనలు కూడా
 అదే మార్గాన్ని అనుసరించారు
 అందుకనే భారతం 
మనకు ప్రామాణిక గ్రంథమైంది.
అదే రామాయణం 
ఎంతోమంది అనువదించినా
అవేవీ భారతమంత బలీయంగా 
సాహిత్య జీవితాన్ని, సామాజిక జీవితాన్ని 
ప్రభావితం చేయలేదు.


అంటే 
అనువాదంలో కూడా 
వ్యక్తిగతమైన ప్రతిభ అన్నది 
ఒక బలీయమైన అంశమని తెలుస్తుంది.


పోతన భాగవతం 
తెలుగు ప్రజల్ని ఈనాటికీ ఆకట్టుకుంటోంది.
ఆయనది కూడా స్వేచ్ఛానువాదమే.
ఎంతగా అంటే 
భాగవమతమన్నది తెలుగు వాళ్లదే 
అన్నంత భాషా మాధుర్యాన్ని
ఆయన మనమీద వర్షించాడు.


చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు
-ఇది సుప్రసిద్ధమైన పోతనగారి పద్యం.


పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
తమ భాగవత ఉపన్యాసాల్లో
 ఈ పద్యం గురించి చెబుతూ
 మూలంలో ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’ అన్న మాటలు లేవని
 అవి పోతనగారు చెప్పినవని చూపించారు.
మూల భావానికి మరింత అందగించే పోతనగారు
 ఆ మాటల్ని అదనంగా చేర్చారు.

అవి వ్యాసుడివి కావు,
పోతనగారి ‘లక్షణాలు’ అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులవారు.


                               * * *


అనువాదంలో స్వీయ ముద్ర ఉన్నప్పడే 
అది రాణిస్తుంది.
అనువాదం చేసేటప్పుడు
మూల భాషలోని సౌందర్యాన్ని 
కోల్పోవడం జరుగుతుంది.
అంటే ఆ భాషను వదిలి 
ఇంకో భాషలోకి ఆ భావాన్ని తీసుకొస్తున్నాం.
 అప్పుడు ఆ భాషకు అనుగుణంగా 
ఆ భాషలోకి భావాన్ని ఒదిగించాలి.


అక్కడే 
అనువదించే వ్యక్తి నైపుణ్యం ఉంటుంది.
కవిత్వాన్ని అనువదించడం 
అంత సులభం కాదు.
తన ఇష్టంతో ట్యూన్ చేయగలిగనిపుడే అది సాధ్యం.
కవిత్వం ఎప్పుడూ..
 అనుభూతి ప్రధానంగా ఉంటుంది.
అభిప్రాయాల్ని అనువదించడం సులభం.
అనుభూతిని అనువదించడం కష్టం.


ఎదుటి కవి భావాల్ని మనం సొంతం చేసుకోవాలి.
అంటే వాటికి మనం లొంగిపోవాలి.
అప్పుడే అవి మన సొంతమవుతాయి.
ఇదొక రసాయనం,
అవ్యక్త ప్రక్రియ.
ఆ కారణంగానే స్వంత రచనల లాంటివే.


అటువంటి స్వతంత్రానువాదాలు 
ఏ భాషలోనైనా కొన్ని మాత్రమే ఉంటాయి.


ప్రతి భాషకు ఒక నిర్మాణముంటుంది.
ఒక సంగీత ముంటుంది.
అనువాదంలో ఆ లక్షణం పోతుంది.


ఉర్ద్దూ భాష సున్నితత్వం,
పర్షియన్ భాష సౌకుమార్యం 
అనువాదంలో ఒదిగించలేం.
ఆ భావాలకు కొన్ని అలంకారాల్ని అద్దితే తప్ప 
అవి రాణించవు.


                                 * * *


భారతానువాదంలాగే
 భర్తృహరి సుభాషితానువాదం కూడా 
తెలుగులో సుప్రసిద్ధమైంది.
భారతాన్ని ఎందరో అనువదించినా
 కవిత్రయానువాదం అద్వితీయమైంది.
రామాయణాన్ని ఎందరో అనువదించినా,
అనుసృజించినా అద్వితీయమని చెప్పుకోదగిన రామాయణం తెలుగులో రాలేదు.


కానీ..
భర్తృహరి సుభాషితాల్ని
ఏనుగు లక్ష్మణకవి అనువదించారు.
మూల విధేయంతోపాటు ..
కవి వౌలిక ప్రతిభ కూడా ..
మనల్ని దిగ్భ్రమకు లోనుచేస్తుంది.


అవి ఇతర కవులు చేసిన అనువాదాల్లో 
పోల్చినపుడే మనకు తెలిసి వస్తాయి.


మొదట ఒక భర్తృహరి శ్లోకం తీసుకుందాం.
కేయూరాణి నభూషయన్తి పురుషం హారాన చన్ద్రోజ్వలా
నస్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేక నమలం కరోతి పురుషం యు సంస్కృతా ధార్యతే
క్షీయనే్త ఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణమ్


భావం: పురుషునకు భుజకీర్తులు, సూర్యహారాలు మొదలగు సొమ్ములుకానీ, స్నానము, చందనపు పూసుకొనుట, పూలు ముడుచుకునుట, కురుల ను దువ్వుకొనుట మొదలగువాటిలో నేదియు కాని అలంకారము నియ్యజాలదు. 
సంస్కారము గల వాక్కు ఒకటియే అలంకారము కలగచేయును. 
సువర్ణ మయాది భూషణములన్నియు నశించును. వాగ్భూషణ మొక్కటే నశించని భూషణము.


ఈ భర్తృహరి శ్లోకాన్ని అనువదించి
ముగ్గురు కవులు వారి వారి పద్ధతుల్లో అనువదించారు.


కమనీయంబగు విద్యాభంగి తామ శృంగరంబు కల్పింప లే
వమలేందుద్యుతలైన హారముల కేశాలంక్రియల్మజ్జనం
బు మనోజ్ఞాంగద చందనాదు లఖిలంబున్బోవు, పోదెందు, వా
క్య మయం బౌతొడ వేరికిన్ సురభిమలాన్నీతి వాచస్పతీ!
-ఎలకూచిబాల సరస్వతి, మల్లభూపాలీయం


జలకము గంధమున్ కుసుమ చారు శిరోజములున్ భజంగదం
బులు శశి గౌర హార ముఖ భూషలు మర్త్యునలంకరింప లే
వర నలంకరించు విమలాంచిత సంస్కృత వాణి యొక్కటే
బొలుపరు సొమ్ములెల్ల చెడిపోవదు వాక్కను భూషణం బిలన్
-పుష్పగిరి తిమ్మన


భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదుపుష్ప సుగంధీ జలాభిషేకముల్
భూషలు గావు పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి వా
గ్భూషణమే సుభాషణము భూషణముల్ నశియించు నన్నియున్
-ఏనుగు లక్ష్మణ కవి


పై ముగ్గురు కవులు మూల విధేయంగానే భర్తృహరిని ఆంధ్రీకరించారు.
ముగ్గురూ ప్రతిభావంతులే.
 కానీ ఏనుగు లక్ష్మణకవి అనువాదమే ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైంది.
 ఎప్పటినుంచో ఏనుగులక్ష్మణ కవి పద్యాలే పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
లక్ష్మణకవి పద్యాలు నోటికి రాని తెలుగు అధ్యాపకులు ఉండరు.
ఏమిటి దానికి కారణం?
ఆయన ప్రతిభ ఇతరుల కన్నా ఎట్లా వేరయింది?
ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి ఏమిటి?
భావుకత్వంతో, ఉద్వేగ స్థాయిలో భాషా బలంలో ఆయన భర్తృహరితో సమానమైన వాడు.
 తక్కిన ఇద్దరు కవుల్లో సౌమ్యత, నమ్రత కనిపిస్తాయి.
 లక్ష్మణకవిలో అవి లేవని కాదు.
భర్తృహరిలో పరకాయ ప్రవేశం చేసినట్టు పరవశంగా అనుసృజించాడు లక్ష్మణ కవి.
తక్కిన ఇద్దరు జాగ్రత్తగా నెమ్మదిగా యథా మాతృక రీతిలో అనువదించారు.
తెలుగు భాషను చక్కగా మలిచారు.
 ఉత్సాహ భరితమైన శైలి తక్కువ ఇతర కవుల్లో కనిపించదు.
భర్తృహరి భావాలతో.., 
భాషతో అవిభాజ్య సంబంధం వున్నంతగా..
లక్ష్మణకవి అనువాదం ఉంటుంది.
భావం, భాష, ఆత్మతత్వం వీటన్నిటి సమ్మేళనం కలిగి నపుడు అనువాదం ఆత్మీయంగా ఉంటుంది.
అపూర్వంగా ఉంటుంది. అద్వితీయంగా ఉంటుంది.




                                                                    * * *


అనువాదం ఒక గంభీరమైన విషయం.
అనువాదం ఒక ప్రేమ వ్యవహారం.
ఒక నిజాయితీతో కూడుకున్న ఒప్పందం.
వైరుధ్యాల్ని అధిగమించి చేసుకున్న అంగీకారం
ప్రతి అనువాదకుడు ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక వినిమయంలో
 సంధాయకుడిగా పరిగణింప దగినవాడు.
అనువాదాలలో లోపాల గురించి ..
ఎవ్వరేం చెప్పినా..
అది ప్రపంచ సామరస్య సాధకమైన వృత్తి.


తెలుగు భాషలో ప్రాచీనకవుల్ని మినహాయిస్తే
ప్రతిభావంతులైన అనువాదకులు
మనకు కనిపించరు.
 సంస్కృత పంచ కావ్యాలు, 
సుప్రసిద్ధ సంస్కృత నాటకాలు 
వచనంలో అనువదించిన వాళ్లున్నారు.
ఆ కవిత్వ బలాన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్లు కనిపించరు.
పాశ్చాత్య కవుల గురించి మనకు తెలుసు.
కీట్సు, షెల్లి, బైరన్, షేక్‌స్పియర్ వగైరాలు ఇంగ్లీషు కవులు.
రింబో, బోదలేర్, వర్లేన్ వంటి ఫ్రెంచి కవులు.
అందరూ వాళ్లని గొప్ప కవులు అంటున్నారని 
మనమూ వాళ్లని గొప్ప కవులంటాం.
వాళ్ల కవిత్వాన్ని కొద్ది కొద్దిగా..
అనువదించినవాళ్లున్నారు.


ప్రామాణికంగా దాచుకోదగినంతగా..
వాళ్ల కవిత్వాన్ని ఎవరూ అనువదించలేదు.


వాళ్లదాకా ఎందుకు..?
మన విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని..
లెక్క లేనంతమంది అనువదించారు.
కానీ ..
దాని అంతరాత్మని మనకు అందించిన అనువాదం ఇప్పటిదాకా లేదు.
 పాశ్చాత్య కవిత్వాన్ని మనం ఆంగ్ల భాష ద్వారానే అనువదించుకుంటాం.
యూరోపియన్ భాషల్లోని కవిత్వం మొదట ఆంగ్లంలోకి వస్తుంది.
దాన్ని మనం తెలుగు చేస్తాం.


ఇంగ్లీషులోకి అనువదించిన వ్యక్తి ప్రతిభను బట్టి కవిత గొప్పదనం తెలియాలి.
దానిపట్ల ప్రేమవున్న తెలుగు కవి, ప్రతిభను బట్టి అది మనకు అందుతుంది.
ఇంగ్లీషులో రాసిన కవుల కవిత్వమే సాధికారికంగా మనకు అందలేదు
ఇక ఇంగ్లీషు అనువాదాలనుంచీ ..
తెలుగులోకి వచ్చినవి తెలిపోవడమే కనిపిస్తుంది.

28 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల ఆధ్యాత్మికానుభవం







జుఱ్ఱెద మీ కథామృతము జుఱ్ఱెద మీ పదకంజ తోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుదారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱు
జుఱ్ఱుగ రుచుల్ గనువారి పదంబుఁగూర్పవేతుఱ్ఱులతోడి పొత్తిడక.. దాశరథీ కరుణాపయోనిధీ... 






రామా!
దయాసముద్రా!
నేను మీ కథలనెడి అమృతమును జుఱ్ఱెదను.
మీ పాదపద్మములను గడిగిన 
నీటిని జుఱ్ఱెదను.
రామ యను పదమునుండి జాలువాఱు
 సుదారసమును జుఱ్ఱెదరు.
స్వామీ!
నాకు నీచులైన మనుజుల తోడి పొందును
 లభింపఁజేయక 
జుఱ్ఱూ జుఱ్ఱునను 
రుచులఁబొందువారి పాదములను
గూర్పవా?జుఱ్ఱెదను. 

చూశారా కథామృతాన్ని జుర్రుతాడట..
పాద పద్మాలను కడిగిన నీటిని జుర్రుతాడట..
రామ నామమనే పదమునుండీ జాలువారే సుధారసమును జుర్రుతాడట..
పైగా..
నీచుల పొందును ఇయ్యవద్దయ్యా..
జుర్రూ జుర్రు మని రుచులను పొందేవారి పాదములను లభించేటట్లు చేయి తండ్రీ..
అవి కూడా జుర్రుతాను..
అంటాడు.
అంటే భగవద్భక్తుల పాదపద్మాలు లభించేటట్లు చేయి..వారినీ సేవిస్తాను అని కదా అర్థం..
భగవద్భక్తులను సేవిస్తే భగవంతుని సేవించినట్లు కదా..
 






ఎవరు ఎంతెంత..
జ్ఞానం వేపు నడుస్తుంటే..
వాళ్ళతో ఆడుకోవటం పరమాత్మకు..
అంత సరదాగా ఉంటుంది....

పరతత్వ దర్శనం చేసిన వాడితో..
భగవంతుడు కూడా ..
పరాచికమాడతాడు..!!

మరీ బిర్ర బిగుసుకుపోయి..
అజ్ఞానంలో ఉన్నవాడిని చూసి..
వీడితో  నాకేంటి ఫో అంటాడు ..
ఆయన కూడా ..!!

లీలా శుకునికి ..
పరమాత్ముడు శ్రీరాముని రూపంలో కనిపించి..
తమాషా చేసాడు..





ఆయన మీరు భగవంతుడే ..
నేను మీకు నమస్కరించాలి..
లేకపోతే నా యందు దోషం ఉండి పోతుంది..
దోషం రాకుండా ..
మీరొక సర్దుబాటు చెయ్యండీ..
నేను నమస్కారం చేస్తానన్నాడు..

మీరు శ్రీ కృష్ణుడై..
నెమలి ఈక పెట్టుకుని..
వేణువు పట్టుకుని..
కనిపిస్తే నమస్కరిస్తానన్నాడు..
సాక్షాత్తూ..భగవంతుడే ..
అతని కృష్ణ భక్తిని చూసి ఆశ్చర్య పోయాడు..

ఆయనెలా ఆడాడో..
ఈయన అలానే ఆడాడు..

విహాయ కోదండ శరౌ ముహూర్తం ..
గృహాణ పాణౌ మణి చారు వేణుం..
మయూర వర్ధంచ నిజోత్తమాంగే ..
సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్..
అలా రండి ..
మీకు నమస్కారం చేస్తానని దానర్థం..

రామ కృష్ణులు ..
వీరిదొక అనుభవం..
 
అమ్మా ..
ఎంతకాలం ఇలా జపిస్తూ కూచోవటం..??
నా జప తపాలు శూన్యమేనా ..??
నేను నిన్నెందుకు దర్శించలేక పోతున్నాను..??

ఇక ఈ జన్మకు..
నీవు నాకు కనిపించవా అమ్మా..??
అని ఆవేదన చెంది..

అమ్మ చేతనమా..??
అచేతనమా..??

చేతనమైతే ..
నా బాధ ఆమెకు తెలియదా.. ??
నా ఏడుపు ఆమెకు వినిపించదా..??
అనుకుని దగ్గరికి వెళ్ళి ..
అమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూసాడు.

ఆ మహాను భావునికి..
 కాళికా మాత ..
ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు గోచరించాయి..
ఉలిక్కి పడ్డాడు..

అంతే..

అమ్మా..
నన్ను క్షమించు ..
తల్లీ ..
నేను ఎంత పొరపాటు చేసానో చూడు..!!
నీవే లేనిచో నేనుండగలనా అమ్మా..??

ఏనాటికైనా ..
నీవు నాకు దర్శన మిస్తావు..
అని మురిసి పోయాడు..


ఇలాంటి సంఘటనలు ..
అయ్య అమ్మల జీవితంలో..
అడుగడుగునా వున్నాయి..


ఎందుకంటే ..
అయ్య పరుగెప్పుడూ..
పరతత్వం వేపే కాబట్టీ..


రామనవమికి 
భద్రాచలం వెళుతున్నారు..
అయ్యా ..
రఘూత్తమ రావ్..


భద్రాచలం ఇప్పట్లా డెవలప్ కాలేదు..
ఇసుకలో గుడారాలు..
కిలో మీటరు నడిస్తేనే మంచి నీళ్ళు..
అంత దూరమూ నడిచి ..
ఒక చిన్న కూజాతో నీళ్ళు పట్టుకొచ్చాడు..
మన రఘూత్తముడు.
 
ఒక గుడారంలో ..
అయ్య ..రఘూత్తముడు.
లోపల ..అయ్య ..
రామ చరిత మానస్.. పారాయణం
బయట స్టూలుపై ..
రఘూత్తముని కాపలా..
 
ఇంతలో ..
ఒక కాషాయాంబర ధారి..
ఒక పొడవు గడ్డము వాడు..
కడపనుంచీ వచ్చిన ..
పుట్టపర్తి నారాయణాచార్యులెక్కడా..?
అని అందరినీ విచారిస్తూ..
విచారిస్తూ..

వస్తున్నాడట..
 
ఇది సత్యం..
కల్పితం ఎంత మాత్రమూ కాదు..
 
వచ్చి.. వచ్చి ..
రఘూత్తముణ్ణి అడిగాడు..
అవును సరి అయిన ప్రదేశానికే వచ్చావు..
ఏమిటి పని..?
స్వామి వారు ..

లోపల పారాయణలో ఉన్నారు..
 

అవునా ..
చూద్దామని వచ్చానే..
కాసిని నీళ్ళియ్యవా..
ఎండనపడి వచ్చాను..
దాహంగా వుంది..
అడిగాడు అతను..
 
ఏమిటీ నీళ్ళే..?
కిలో మీటరు దూరం  ..
ఎండలో ఇసుకన నడిచి చూడు ..
రాముడు కనిపిస్తాడు..
కూజాడు నీళ్ళున్నాయ్ ..


ఆ నీళ్ళు నీకిస్తే ..
మేమేం తాగాలట..
స్వామికి డిస్టర్బ్ అవుతుంది.. 
వెళ్ళు..
అన్నాడట ..

ఇక్కడ రఘూత్తముని 
గురు భక్తి చూడండి..
 

మనకు ఓ శ్లోకం ఉంది.                             
నాస్తి గంగా సమం స్నానం ..
నాస్తి రూపం గురోః సమం..
నాస్తి గాయత్ర్యాః మంత్రం..
న మాతుః పర దైవతం..
 
ఈ లోకంలో గంగ కంటే పవిత్ర స్నానం ..
ఈ నదికీ వర్తించదు..
గందా నదిలో స్నానం చేస్తే..
ఇంక ఏ నదిలో ..
స్నానం చేయక పోయినా పరవాలేదు..


గురువు కంటే ..
ఈ లోకంలో ఎవరు గొప్ప వ్యక్తి కాదు...
గాయత్రి కంటే..
 గొప మంత్రం యేదీ లేదు..
తల్లికి మించిన దైవం లేదు..
అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
పేగు బంధం ..

ఎప్పుడు బాధ కలిగినా ..
"అమ్మా .."
అంటాం..
తల్లిని ప్రకృతి మనకు పరిచయం చసింది..
 

అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
యే ఒక్కటి పట్టుకున్నా..
పరమాత్మ వశుడవుతాడు.. .

 
కొంతసేపటి ..
అయ్య పారాయణ ముగిసింది..
ఎవరొచ్చారు..?
ఎవరో ..
మీ పేరు చెబుతూ ..
కడప నుంచీ పుట్టపర్తి నారాయణాచార్యులొచ్చారు..
ఎక్కడా ..
ఎక్కడా.. 
అని అందరినీ అడుగుతున్నాడు..స్వామీ
 
ఇక్కడ కొచ్చి..
దాహంగా వుంది ..
మంచినీళ్ళివ్వమన్నాడు..
నేను ఇవ్వలేదు..
 
ఇక్కడ నన్నెరిగిన వాళ్ళెవరున్నారు..?
ఏమో స్వామీ..
ఓరి దరిద్రుడా ..
ఎంత పని చేసావురా..
వచ్చిన వాడు శ్రీరామ చంద్రుడేరా..

అవునా..?
నా పేరు అడుగుతూ..
వెతుకుతున్న వాడు ..
ఆయన కాక ఇంకెవరు..?
మనం ఆయనను పారాయణతో పిలిస్తే..
ఆయన మన పేరు పిలుస్తూ వచ్చాడురా..
 
అని తిట్టుకుంటూ ..
ఆ ఎర్రటి ఎండలో ..
కణ కణలాడే ఇసుక లో వట్టి పాదాలతో పరిగెడుతూ
అరుస్తూ ..
పిలుస్తూ..
ముందు..
అయ్య ..


వెనక..రఘూత్తముడూ..
 


27 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు త్రిపుటి ఆవిష్కరణ సభ అందరూ ఆహ్వానితులే..



మా అక్కయ్య ..

అయ్య ..
వివిధ గ్రంధాలకు వ్రాసిన పీఠికలను ముద్రించింది..
 
ఎన్నో యేళ్ళనుంచీ ..
ప్రాణప్రదంగా ..
పట్టుచీరలకంటే ..
బంగారం కంటే ..
పదిలంగా ..
సం రక్షించిన..
విలువైన ..
అయ్య పీఠికలను ..
వెలుగులోకి తెస్తూంది..
 
అయ్య..
ఒక్కో పుస్తకముపై వ్రాసిన అభిప్రాయాలు 
ఎంత నిక్కచ్చిగా..
ని ర్ద్వంద్వంగా ..
నిష్కర్షగా వున్నాయోనే ..
అంటుంది అది...!!
 
కేవలం..
పీఠికలు చదివితేనే ..
మనం ఎంతో సంతృప్తిని పొందుతాం ..
 
ఆరుద్ర వంటి ..
ప్రతిభావంతుల పుస్తకాలలోనూ ..
అయ్య వ్రాసిన పీఠికలు..
వజ్రాల్లా మెరుస్తాయట..!!
 
ఆ పుస్తకం ఆవిష్కరణ ..
త్యాగరాయ గాన సభలో ..
మార్చి 26న జరిగింది.
చదవాలని పిస్తూందా..??
 
ఎప్పటివో అయిన కాగితాలను ..
పసిపాపల్లా పట్టుకుని..
ఫెయిర్ చేసి..
ముద్రణ కిచ్చి..
తప్పులు దిద్ది..
ముద్రణ జరిగి ..
ఫళ ఫళ లాడుతూ బయటికి వస్తే ..
కన్న బిడ్డల్ని చూసుకున్నంత ఆనందంగా..
ఉంటుంది కదూ..
 
ఊహూ..
మాకు..
మా అయ్యనే మళ్ళీ చూసుకున్నంత ఆనందం..
 
ఇరవై సంవత్సరాలనుంచీ..
మా అయ్య సేవను ..
ఓ తపస్సులా చేస్తూందది..!!
 
కాదు..
కన్న తండ్రి ఋణం తీర్చుకుంటూంది.. 

మార్చి 26 నాటి సాయంత్రం 
త్యాగరాయ గానసభలోని 
సుబ్బారావ్ కళావేదిక లో  

పుట్టపర్తి వారి 1930 ల నాటి ..
అపురూప వ్యాసాలు ..
వివిధ గ్రంధాలకు ..
వారు వ్రాసిన పీఠికలు ..
పుట్టపర్తి వారు నిర్వహించిన ..
"పద్యంబొక్కటి చెప్పి.."
 అన్న శీర్షికన వచ్చిన..
 పంచదార గుళికల వంటి పద్య వ్యాఖ్యానాలు..

కలగలిసిన కలబోత ..
నాలుగు నెలలలుగా శ్రమించి..
తీర్చి దిద్దిన  మా అక్కయ్య..
కలల కలహంస "త్రిపుటి"యై ..
వయ్యారంగా..
కె వి రమణ గారి చేతుల మీదుగా..
ఆవిష్కృతమైంది...

సభలో..
"రాధా మాధురి" గారలు..
 పుట్టపర్తి వారి కృతులను మధురంగా ఆలాపించారు. పుట్టపర్తి అనూరాధ వ్యాఖ్యానం..
 అందంగా వానికి  అమరింది..

సర్వశ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్
గారి అధ్యక్షతన .. 
కె వి రమణ గారు ..
రంగాచారి గారు ..
వాడ్రేవు చిన వీర భద్రుడు గారు ..
వక్తలుగా ప్రసంగించారు..
కె వి రమణ గారు మాట్లాడుతూ..
"విమర్శకులలో ..
ప్రమాణాలు ఉన్నాయో ..?లేదో..?
 ప్రశ్నార్థకమైందీనాడు..
అర్హత ఉన్నా ..
లేకపోయినా.. 
ఆకాశానికెత్తేయటం..
అంతవాడు ..
ఇంతవాడని ..
పొగిడేయటం..
విమర్శ ఎలా రాయాలి..?
మనం వ్రాసే విమర్శ ..
నిష్పక్ష పాతంగా నిష్కర్షగా ఉందా..?
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వ్రాసిన విమర్శలు..
అసలు విమర్శ ఎలా వ్రాయాలి ..?
ఎలా ఉండాలి..?
అన్న దానికి ప్రామాణికంగా నిలుస్తాయి.."
 
ఈ అభిప్రాయం కె.వి .రమణ గారిది..
ఈయన సీనియర్ ఐ ఏ యస్ ఆఫీసర్
 భక్తి చానల్   TTD కి EO గా వుండినారు 
రక రకాల ఉన్నత పదవులు నిర్వహించారు..
 
పుట్టపర్తి సాహితీ పీఠం పెట్టినప్పుడు.. 
నిధుల సేకరణలో ..
ఈయానా కొంత శ్రమించారట..
"నిధుల సేకరణ కోసం ..
బిక్షా పాత్ర పట్టుకొని..బయలుదేరాం ..
స్వీట్సపుల్లారెడ్డి ..
వద్దకెళ్ళాం 

ఆయన ..
అంత సంపాదించినా ..
ఒక ఇరుకైన చిన్న గదే ఆయన నివాసం. 
ఒక చెక్క బెంచీ పై ఆయన పడక ..
కుండలోని నీరే ఆయన తాగటం..
ఇంత నిరాడంబర సాధారణ జీవితాన్ని ..
అప్పటికీ ఆయన గడిపేవారట..
 
వీరు వెళుతూనే
ఆ గదిలోనికి తీసుకెళ్ళారు..
ఆ బెంచీ పై కూచో పెట్టారు.
ఆ కుండలోని నీరు వీరే ముచుకు తాగారు.
ఎంత సంపాదించానని కాదు..
నేను జీవితాన్ని ఎలా మొదలు పెట్టానో..
 అదే పరిస్థితుల్లో వుండటం నాకిష్టం..
అన్నారట..
ఇది చూచి 
నిరాడంబరతని అందరూ నేర్చుకో వాలని ఆయన చెప్పారు..
 
"శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ.."
దీంట్లో ఒక తప్పుంది..
పుట్టపర్తి వారు 
దీన్ని గురించి ఈ గ్రంధం లో వ్యాఖ్యానించారు..
కానీ ..
ఎన్నో వందల సంవత్సరాలుగా ..
దీన్ని ఇలానే  ..
మనం చెప్పుకుంటున్నాం..
అది యేమిటో.. నేను చెప్పను..
కావాలంటే పుస్తకం కొనండి..
కానీ..
యెలాగో సంపాదించవద్దండి..
అన్నారు వారు.
 
రాఘవన్ గారు మాట్లాడుతూ..
దీన్ని కొన్నా..
లేక.. గౌరవంగా పుచ్చుకున్నా..
బీరువాలకు అలంకార ప్రాయాలుగా..
 వీటిని పెట్టకండి.. 
వీలైతే రోజుకు కనీసం..
ఒక వ్యాసం చొప్పున చదవండి ..
ఎందరో గొప్ప వారి ఇళ్ళల్లో ..
అపురూపమైన పుస్తకాలు..
కనీసం..
 పేజీలు కూడా తిప్పకుండా ..
అలమారల్లో
అలంకార వస్తువులుగా ..
అలా పడున్నాయ్ ..
అని వారు విజ్ఞప్తి చేసారు.


దూరదర్శన్ డైరెక్టర్..
శ్రీమతి శైలజా సుమన్ గారు..
అచ్చం తెలిగింటి ఆడపడుచులా ఒద్దికగా ..
" మా అయ్య మా అయ్య 
అని ఎప్పుడు చెప్పినా 
ఆమె కళ్ళలో తిరిగే నీటిలో 
తండ్రిపై ఆమెకు కల మహత్తరమైన ప్రేమ 
నన్ను ఆమె తండ్రి గారి గురించి 
తెలుసుకొనేలా చేసింది..
 
అసలు "అయ్య" అనే పదమే
 ఎంతో గమ్మత్తుగా ..హాయిగా..
 ఉంటుంది ఆమె మాటల్లో..
ఈ పుస్తకాన్ని మా మామ గారికి ఇస్తాను..
అని ఆమె ముద్దు ముద్దుగ అందంగా చెప్పారు..
 
అక్కయ్య..
మైకు పట్టుకుంటూనే 

అయ్య ప్రపంచంలోకి వెళ్ళి పోయింది..
మా అయ్యండీ..

 ఒకటి కాదు ..రెండు కాదు..
 పధ్నాలుగు భాషలు..
బజార్లో కాళ్ళకు చెప్పులు ఉన్నాయా..? లేవా..?

 అని కూడా పట్టించుకోకుండా ..
భుజంపై ఒక టవలు వేసుకొని తిరిగే..
పధ్నాలుగు భాషలు ఔపోసన పట్టిన..
 ఆ శ్రీ వైష్ణవ బ్రాహ్మడు ..
పండిత ప్రకాండులకు చెమటలు పట్టించిన వాడు..
మా చెల్లెలు బ్లాగులో రాసింది..

 నిర్గంధ కుసుమం అని
 నిజానికి ..
మేమందరూ 
కాదు ..కాదు..
మనందరూ నిర్గంధ కుసుమాలమే..
 

అంతటి మనిషిని ..
సరిగా ఉపయోగించుకోలేదు..
అని ఒక్కసారిగా భావావేశానికి లోనై..
ఏడవటం మొదలు పెట్టింది..
అయ్య అముద్రిత పుస్తకాలను..
బయటికి తీసుకు రావటం..
 నా బాధ్యత ..
అని చిన్నప్పుడే నేను అనుకున్నాను..
 
ఇక్కడ ఒక్కరున్నారు..
ఆయన పేరు శ్రీ శైలం..
 అయ్యకు అపర భక్తుడు..
ఆయన ఏమి ఋణానుబంధమో ..?
మొదటినుంచీ ..
అంటే..గత నలభై.. యాభై ..
సంవత్సరాలనుంచీ.. 
అయ్య గురించి 
ఎక్కడ ఏ రచనలు ..వ్యాఖ్యలు.. సన్మానాలు..
పేపర్లలో వచ్చినా..
భగవంతుని ప్రసాదాల్లా 
వానిని అపురూపంగా దాచి వుంచాడు..
తమ స్వవిషయాలు కూడా
ఇంత పదిలంగా దాచుకోరు..
ఆయన నన్ను నమ్మి
తన ఆస్తిని నాకు ఇచ్చారు..
ఇంకా పోస్ట్ లోనూ..
 నాకు ఎంతో విలువైన సమాచారాన్ని పంపించారు..
శ్రీశైలం గారినుంచీ పోస్ట్ వచ్చిందంటే ..
నాకు నా బాధ్యత మరింత గుర్తు వచ్చేది..
అని చెప్పిందక్కయ్య..
 
శ్రీ శైలం గారు మాట్లాడుతూ..
"ఇంటికి సామాను తెస్తే ..
ఆ పొట్లాలో 
అయ్య సమాచారమేమైనా వుందా..?
 అని చూసేవాడిని..
ఒకసారి హోటలులో ..
కాఫీ తాగుతుంటే ..
ఎవరో చూచిన పేపరులో ..
పుట్టపర్తి వారి సమాచారం చూచాను.. 
వారిని అడిగి తీసుకున్నాను.. 

ఎన్నో లైబ్రరీలకు పోయి ..
ఆ గ్రంధ సంద్రంలో..
 పుట్టపర్తి వారిని గురించిన..
 పుస్తకాలకొరకు శోధించే వాడిని..
అంటూ చెప్పుకొచ్చారు..
 
"అవును లేవయ్యా ..
నీవు రెవెన్యూలో పని చేసావ్ గా ..
అన్నీ గుర్తున్నాయ్"
అని రమన గారు జోక్ చేసారు..


వీడు నా అపర భక్తుడు..
నేను తుమ్మినా రికార్డు చేస్తాడు..
అని పుట్టపర్తి వారు 

అనే వారట సరదాగా..
అక్కయ్య ..
తన కూతురు వంశీప్రియ పేరునా
 శ్రీశైలం గారి పేరునా 
పుస్తకాన్ని ముద్రించింది..

 
వాడ్రేవు చిన వీర భద్రుదు గారు ..
పుట్టపర్తి వారి గురించి..
ఎంతో ఉద్వేగ భరితంగా.. ప్రసంగించారు.
పుట్టపర్తి వారిని చూస్తే నాకు అభిమానం కాదు..
అసూయ..
ఆ అసూయ తోనే 
నేను వారి గ్రంధాలను ఒక్కొక్కటి పది సార్లకు పైగా చదివాను..
అన్నారు..
బుధ్ధ చరితమును చదివిన తరువాత..
అంతకు ముందు బుధ్ధుని గురించి ..
మన  అభిప్రాయాలు తుడుచుకు పోయి..
 ఒక కొత్త కోణంలో బుధ్ధుని మనం దర్శిస్తాం..
 
ఈ గ్రంధమునకు మూల లేఖకులు
 శ్రీ ధర్మానంద కోశాంబి గారు..
 పాళీ భాషలో వీరు గావించిన శ్రమ..
 అమోఘమైనది..
పాళీ గ్రంధములను..
త్రిపిటకములను..
నిష్కరుణగ నవలోకించి ..
ఋగ్వేదము..
మనుస్మృతి ..
విష్ణు శాస్త్రి చవళూణ్కర్ గారి బాణ భట్ట చరిత్ర ..
మొదలైన గ్రంధాలను అనుసరిస్తూ ..
మూలంలోని పరిమళాలను జారిపోనివ్వకుండా 
అంత తాజాదనంతోనే 
మనకందించారు పుట్టపర్తి వారు..
 
రుచీ పచీ లేని ఇంగ్లీషు అనువాదాలతో
 మనసు చెడిన .. .నన్ను
పుట్టపర్తి వారి అనువాద మధురిమ కట్టి పడేసింది..

వారి ఎన్నో కోట్లు జపం చేసారన్నారు..
 వారికి..
 పరమాత్మ సాక్షాత్కారం జరగక పోతే..
 సంతోషించే వారిలో నేనొకణ్ణి..
 
వారికి సాక్షాత్కారం కాలేదు కాబట్టే
 ఆ ఆవేదనా మధనం నుంచీ 
ఇలాంటి అమృత రాశులు పుట్టాయి..
అదే వారికి సాక్షాత్కారం జరిగుంటే
ఈ అమూల్య సంపద మనకందేది కాదు..
అన్నారు..
 
పుట్టపర్తి వారిని ..
ఎన్నో సంవత్సరాలుగా..
ప్రతి అడుగులోనూ...
పరిశీలించి.. పరిశోధించి..
ఆయన పై అభిమానాన్ని ..
పుట్టపర్తి నారాయణాచార్యులు..
 ప్రాంతీయకవి కాదు.. 
జాతీయ కవి కాదు 
విశ్వకవి..
కంప్యూటరు మెమొరీని తలదన్నే విధంగా
వారి మేధశ్శక్తి విరాజిల్లింది..
 దాన్ని అందుకోలేక పోవటం మన దురదృష్టం.. 
వారికి ఆ అవార్డు రాలేదు.. 
ఈ అవార్డు రాలేదు.. 
అని చింతిల్లనవసరం లేదు.. 
అవార్డులకు సైతం అందని ప్రతిభ ఆయనది.. 
అవ్వార్డు లన్నవి ..
ఆయన దృష్టిలో చాలా చిన్న విషయాలు  

అంటూ..
పుట్టపర్తి వారి గ్రంధాలను..
ఈ కాలంలో ఎవ్వరు చదువుతారు అనుకోకండి..
వాటిని మహా ప్రసాదాలుగా స్వీకరించి..
శిరస్సుపై పెట్టుకొనే ..
అభిమానులు ఎందరో ఉన్నారు..
అని ..
అక్కయ్యకు ..
ఎంతో మనోబలాన్ని వారు అందించారు..
పుట్టపర్తి వారికి ..
ఇటువంటి పుత్రిక ఉండటం ..
ఆయన అదృష్టం..
అంతటి తండ్రిని కలిగివుండటం..
ఈమె అదృష్టం ..
అని కె వి రమణ గారు చమత్కరించారు..
అయ్యకు జ్ఞానపీఠము రాలేదని ..
బాధపడిన అక్కయ్యను ఓదారుస్తూ..
రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారు
జాతిపితకూ నోబెల్ రాలేదమ్మా..
అనగానే ..
సభలో నవ్వుల పువ్వులు విరిసాయి..
అక్కయ్య తడికళ్ళతో హాయిగా నవ్వింది..
 
సభలో..
మొదట్లో..
అక్కడక్కడా ..
కనిపించిన జనం..
 నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ..
 చివరి వరకూ ఉండి..
 పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి ..
మహనీయుని గురించి మైమరిచి విన్నారు..
 
వయసు మళ్ళిన వారు..
 ఆనాటి మధుర జ్ఞాపకాలను ..
గుర్తుకు తెచ్చుకున్నారు..
 
అక్కడక్కడా ..
తమకు నచ్చిన ..
విషయ ప్రస్థావన జరిగినప్పుడల్లా..
కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని తెలిపారు.
 
చివరగా ..
కొసమెరుపు..
పక్కనే త్యాగరాయ గాన సభలో ..
డా సి నారాయణ రెడ్డి గారి సినీ గానం..
అక్కడికి డా సి నా రె వచ్చారట..
పక్కనే ధూం ధాం గా 
జరుగుతున్న సభను పరికించారు..
అయ్య పేరున కట్టిన బ్యానరును చూచారు..
ఏమిటీ సభ అన్నారు..
త్రిపుటి ఆవిష్కరణ..
లోనికి రాలేదు.. 

"త్రిపుటి"
ఒక పుస్తకం తెప్పించుకున్నారట..
ఎవరితోనో..