ఎన్ని కావ్యాలు రాసినా
వివిధ భాషలలో ఎంత్ అపరిచయమున్నా
నారాయణాచార్యులు సంతృప్తి చెందలేదు
"నేనింత శ్రమించి సాహిత్యాన్ని రచించాను..
ఇందుకు నాకు దక్కిన ప్రతిఫలమేముందిరా..?"
అనేవారు.
విశ్వనాధ తరువాత
జ్ఞాన పీఠ తనను వరిస్తుందని
ఆయన నమ్ముకున్నట్టుంది.
అందుకు కారణం..
నేడు సాహిత్య రంగంలో వికట తాండవమాడుతున్న
క్షుద్ర రాజకీయాల గురించిన ఆయన అజ్ఞానమే నని
చెప్పవలసి వుంటుంది.
అందువల్లనే
ఆచార్యుల మనశ్శాంతికోసం ఇలా విన్నవించుకుంటున్నాను.
"జ్ఞానపీఠ రాలేదని
గ్లాని చెంది ఫలితమేమి
పట్టువిద్య లోతెరుగని
బాధవల్ల లాభమేమి
పైరవీలు లేనిది చిరు పదవి రాదు మహాకవీ
సామర్థ్యానికి నూకలు చెల్లినాయి కళారవీ.."
గజ్జెల మల్లారెడ్డి,ఉదయం,9.9.90
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి