27 ఏప్రి, 2013

అన్న రారా ...


ఇది పుట్టపర్తి బాల్యంలో  
వారి అమ్మ మురిపెం 
కానీ విషాదం..  
అయిదు సంవ త్స రాలకే 
పుట్టపర్తిఆ ప్రేమను కోల్పోయారు
కానీ .. 
ఆ విషాదాగ్నిలోంచి 
మహా పండితుడు పుట్టపర్తి ఆవిర్భవించాడు 

గంగ


26 ఏప్రి, 2013

ప్రణయానుభూతి







శ్రీనివాస ప్రబంధం




పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధం పై 
ఇటీవల రిసెర్చి చేస్తూన్న పద్మావతి గారు శివతాండవంపై ఒక వ్యాసం వ్రాసారు 
సిలికానాంధ్ర నుంచీ ఏదో సావనీర్ కోసం 
కూచిపూడి రామలింగేశ్వర శాస్త్రి గారు 
అడిగారట పంపానని చెప్పారు.

అక్కయ్యకు.., నాకు..
 ఒక కాపీ పంపారు
నేను 'నా బ్లాగు లో వేసుకోవచ్చా ..?'
అంటే తప్పకుండా అంటూ

నేను ఎం ఏ తెలుగు, సంస్కృతం 
జగ్గయ్య పేట  అమ్మణ్ణి కాలేజి లో 
లెక్చరర్ గా పనిచేస్తున్నాను .
రేడియో నాటక సాహిత్యం మీద ఎం ఫిల్ చేసాను

డిగ్రీ లో మేఘదూతం పాఠం చెప్పాను 
అప్పటినుంచీ పుట్టపర్తి వారిపై అభిమానం
వారిపై  రిసెర్చి చేద్దామనుకున్నాను.

శివతాండవం మీద చాలామంది చేసారు 
మీరు సంస్కృతం ఎం ఏ కాబట్టి 
 శ్రీనివాస ప్రబంధం పై చేయండి 
అని నాగపద్మిని గారు సలహా ఇచ్చారు

డా మన్నవ సత్యనారాయణ
నాగార్జున  యూనివర్సిటీ గారి 
అధ్వర్యంలో చేస్తున్నాను.

'అది చాలా గహన మైన పద్య కావ్యం కదా..?'
కానీ 
మీరు దానికి తగిన వ్యక్తి 


'ఇది నా శక్తికి ఒక రకంగా మించిందే 
అంతటి మహాకావ్యమిది..

ఇది చేస్తే  నాకు కూడా ఒక విలువ వస్తుంది 
అని అనుకుంటున్నాను' అని చెప్పారు.



'మీరు చేస్తే మాత్రం..  
ఇది మంచి ప్రయత్నం.. '

'పోతన గారన్నారు చూసారా 
నన్నయాదులు భారతం తెనిగించారు 
ఎందుకో .. 
ఈ భాగవతాన్ని నా అదృష్టం కొద్దీ  వదిలారు అని .. 
అలా నాకీ శ్రీనివాస ప్రబంధంపై 
రిసెర్చి చేసే అవకాశం వచ్చింది.

పుట్టపర్తి వారన్నారు ..

"ఎరిగితి నెంతయో , 
దిశణ కెవ్వరు నుబ్బర వోవ , 
దెసముల్ దిరిగితి , 
మల్లికాసుమ సదృక్షయశంబున , 
నింతయైన నన్నె రుంగనె లేదు ..! 
నేనెవడ .. ? 
నీ భువికేటికి రాక ; 
యంచు న న్నెరుగుటకై 
రచించెద  నహీన వచోగతి 
నాధ కావ్యమున్ ''

అని 
అలా నేను కూడా 
ఆ 'నేను' వెంట పడ్డానండీ 

ముందు నేను ఆధ్యాత్మిక పథం  లో 
పయనించి నా ఆత్మను శ్రీనివాస ప్రబంధ పరిశీలనకు అనువుగా చేసుకుంటున్నాను' 

'మంచిది .. 
ఆ వేదాంత పరమైన  భావనలో  పూర్తిగా 
మునిగి ఆ రాసిన వాడి మానసిక స్తాయికి 
మన మనసూ ఎదగాలి 
అప్పుడే 
ఆ కావ్యాన్ని ముట్టుకునే యోగ్యత మన కొస్తుంది '

 అవునండీ  మంచి  మాట  చె ప్పా రు 



 


23 ఏప్రి, 2013

షాజీ కిది పుట్టపర్తి ముందుమాట




పుట్టపర్తి లఘు కావ్యాలలో 
రెండవది షాజీ..
మొదటి కావ్యం 
పద్నాలుగు ఏళ్ల వయసున వ్రాయగా..
ఈ షాజీ పందొమ్మిదవ ఏట వ్రాసినది..

"పాత్ర చిత్రణ ...
కథా సంవిధాన పటిమ ...
స్పష్టత ..
మొదలైన కావ్య గుణాలు వెలయించడంలో ..
ఆనాటికి పుట్టపర్తికి పరిణతి సిద్ధించి ఉండలేదు 

కాని..
 గురుకుల వాసంలోని క్లిష్టత..
వాళ్ళ కలిగిన అనుభవం..
 బహుగ్రంధ పరిచయం ..
మొదలైన వాని వలన కలిగిన 
బలీయమైన సంస్కారం 
అహమహమికగా ముందుకు దూకుతున్న 
భావావేశ యుత  పదజాలం 
ఆయనను ఊరకుండనీయలేదు.. 

తత్ఫలితమే ..
షాజీ ఖండ కావ్యం ..
 ఇందులో ముగ్గురే ముగ్గురు.. 
షాజీ ..
జహంగీరు ..
నూర్జహాన్ ..

"నడచు చున్నాడు నల్ల జండాల నీడ .. 
సృష్టి సౌందర్య జీవి షాజీ తపస్వి.. "

అన్న మకుటంతో నడచిన 
పది పద్యాలు హృద్యమైనవి 

ఈ కావ్యం ద్వారా 
సహాజ పండితుడు 
తత్త్వవేత్త అయిన పుట్టపర్తి 
లోకానికి ఇచ్చే సందేశం ఒకటే ..

"అది ప్రకృతి సౌందర్యారాధన.. 
దానిని ఆస్వాదించమని.. "
అంటారు గోల్లాపిన్ని శేషాచలం గారు 

"పొదల చాటు పూవుల జూచి మురిసిపొమ్ము 
కోసి తలలోన జేరివెడు  కుమతి గాకు 
కొమలతమ సౌందర్యార్చకుడవు గమ్ము 
సిగ్గుచెడి నాకటంచు  నాసింప బోకు "


పుట్టపర్తి 
తన పద్నాలుగవ ఏట పెనుగొండ లక్ష్మి వ్రాస్తే 
అది తనకే పాఠ్య భాగమైంది 

పందొమ్మిదవ ఏట వ్రాసిన "షాజీ "
తోటి విద్యార్థులు మెచ్చి అచ్చు వేయగా 
వెంటనే ఇంటర్ మీడియట్ కు పాఠ్య గ్రంధమైంది 
వ్రాసిన వాడింకా విద్యార్థియే 

పుట్టపర్తి తనకు తానే ఆశ్చర్య పోతున్నారు చూడండి .. 



20 ఏప్రి, 2013

పుట్టపర్తి జనప్రియం - శ్రీ గొల్లాపిన్ని శేషాచలం




"రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యుత్సకీ భవతి యత్సుఖొతోపి జంతుః
తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం
భావ స్థిరాణి జననాంతర సౌహృదాని"

( శాకుంతలం.. కాళిదాసు)

రమ్యమైన దృశ్యాన్ని చూచినా 

మధురమైన శబ్దాన్ని విన్నా 
సౌఖ్యాన్ని పొందే మనిషి త్నకు
 తెలియని ఉద్వేగాన్ని చెందుతాడు 

ఎందుకు అంటే 

అతడు బహుశా 
జననాంతర అనుబంధాలను 
స్మరిస్తూ ఉండడం వలన కాబోలు 
అని మహాకవి కాళిదాసు అంటారు

శ్రీమాన్ పుట్టపర్తి జనప్రియ రామాయణం 

చదువుతూ వుంటే 
ఒక ఆనందం ఒక అనుభూతి ఏదో నాకు కలిగేది.
 బహుశా అది పాడుకోవడానికి అనుకూలం కావొచ్చు శ్రీమద్రామయణంపై గల అభిమానం కావొచ్చు 

ఈ జనప్రియపై నాకు కలిగే మనో భావాలను 

పరిశీలనా దృష్టితో ప్రతిబింబించాలనే 
తలంపు కూడా కావచ్చు 
అంటారు పుట్టపర్తి జనప్రియ రామాయణాన్ని 
పి హెచ్ డి లో అద్భుతమైన పరిశోధనా గ్రంధాన్ని  
"పుట్టపర్తి జనప్రియం"
 అన్న  పేరుతో వెలువరించిన 
శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు

గొల్లాపిన్ని పుట్టపర్తిని 

తన పదమూడు పధ్నాలుగు ఏళ్ళ వయసు
నుంచీ చూశాడట. 

పుట్టపర్తి వారు ఆయనకి హయగ్రీవాన్ని కూడా ఉపదేశించారట అప్పట్లో..

ఆ పిల్లవాడు పెరిగి పెద్దై 

గురువుగారి గ్రంధాన్నే పి హెచ్ డి చేసాడు

పుట్టపర్తి తన రామాయణానికి జనప్రియమని యాదృఛ్చికంగా పెరిడలేదు 

అది ముద్రణకు నోచుకోక పూర్వమే
 పలు సభలలో గానం చేయబడింది
 జన సముద్రాలు ఆనందోత్సాహ తరంగాలు 
కద లి ఆడినాయి 
అంటారు 


ఇప్పుడు నేను ఈ గ్రంధంలోని  

శ్రీ శలాక రఘునాధ శర్మ గారి అభినందన లేఖను మీకు పరిచయం చేస్తాను.

ఆయనేమంటారంటే

"ఒక విశ్వనాధనో .. 

ఒక పుట్టపర్తినో ..
అనుశీలించడం ఆషామాషీ వ్యవహారం కాదు.. 
ఒకరు బ్రాహ్మీమయ మూర్తి ..
మరొకరు సరస్వతీ పుత్రుడు.. 
ఈ పదబంధాలు కేవలం 
అలంకారప్రాయమైన బిరుదాలు కావు. 
అక్షర సత్యాలు..."

అని


తులసీదాసుకు అంకిత శిష్యుడు పుట్టపర్తి 

రంగనా ధ రామాయణం కూడా 
ద్విపద లో ఉండటం వల్లనే 
పల్లె పట్టణాలలో ఇప్పటికీ రామాయణాన్ని 
అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు. 
అందుకే షట్పదిగా శివతాండవాన్ని చూపి 
గేయరచనలో తన పట్టును నిరూపించుకున్నవాడుపుట్టపర్తి

"వారిది ఒక విలక్షణమైన ప్రకృతి .. 

ఆయన తత్త్వమిట్టిదని నికరంగా తేల్చి 
నిర్ణయంగా చెప్పడానికి వీల్లేని 
జటిలమైన వ్యక్తిగా పుట్టపర్తి మనకు దర్శనమిస్తాడు. 

హరికథలు పాడుతాడు

పురాణాలు చెప్పుతాడు
కర్మజ్ఞాన భక్తి సిధ్ధాంతాలను విపులంగా ఉపన్యసిస్తాడు
స్వర్గ నరక పూర్వజన్మ లను ప్రతిపాదిస్తాడు
మరాలా వాటినే విమర్శిస్తాడు.
మార్క్స్ సిధ్ధాంతాన్ని అధ్యయనం చేస్తూనే 
పుష్కల భక్తి భావ కుసుమాలను 
గేయాల్లో కీర్తనల్లో రచనల్లో పురాణ ప్రవచనాల్లో వెదజల్లుతాడు..."

అన్నారు డా.హెచ్.ఎస్ బ్రహ్మానంద గారు

త్వరలొ నా బ్లాగులొ చూద్దురుగాని 
ముందిది చదవండి .. 



















19 ఏప్రి, 2013

రావయ్య.. !!నా స్వామి..!! రావణుడు నెపముగా .. దయచేసినావు ..మా దరికీ ..




మొన్న ఇరవై ఎనిమిదిన 
పుట్టపర్తి శత జయంత్యుత్సవాల సందర్భంగా 
కడప ఆకాశవాణి వాళ్ళు అడిగినప్పుడు
 ఓ పది నిమిషాలు మాట్లాడాను
"పుట్టపర్తికి నేను తల్లినైనాను.."
అంటూ
ఇప్పుడు కౌసల్య మాటలు నాకూ వర్తిస్తాయేమో ..??
(జన ప్రియ రామాయణం నుంచీ .. )





13 ఏప్రి, 2013

' చరిత్రలో రామ రాజ భూషణుడు '



రమాపతి రాజు గారు ఇచ్చిన  రెండవ ఆర్టికల్
' చరిత్రలో రామ రాజ భూషణుడు '
రమాపతి రాజుగారికి ఒక థాంక్స్ చెప్పుకొని 
చదవడం మొదలెడదాం మరి.. 


11 ఏప్రి, 2013

ఉలిలో.., దేనెల సోనలన్జిలికి ,


పాద్యము


నిలిచి వర్షించరా ..!! జలదమా..



10 ఏప్రి, 2013

9 ఏప్రి, 2013

పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే


పుట్టపరి ప్రధమ వర్ధంతి సభ లో M. S . రెడ్డి ఏమన్నారంటే 



అది పుట్ట పర్తి ప్రధమ వర్ధంతి సభ.
బీహార్ కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్
 పెండేకంటి వెంకటసుబ్బయ్య ముఖ్య అతిధి ,
సాహితీ పీఠం అధ్యక్షులు అంబటి గంగయ్యఅధ్యక్షులు నాటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి 
డి.యల్.రవీంద్రా రెడ్డి,
రాష్త్ర చలన చిత్ర అభివృధ్ధి సంస్థ అధ్యక్షులు 
ఎం.ఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరూ పుట్టపర్తి ని స్తుతించారు.
 గ్రంధాలను విశ్లేషించారు
 రాజన్న సాక్షాత్కారం లోని పద్యాలను
 గానం చేసి అలరించారు. 
అనంతరం ఎం.ఎస్.రెడ్డి గారు మాట్లాడారు.

నిర్మొహమాటంగా సూటిగా మాట్లాడటానికి 
పెట్టింది పేరు శ్రె ఎం.ఎస్.రెడ్డి గారు. 
ఆయన ప్రఖ్యాత నటుడు యన్.టీ.ఆర్ కే 
చెమటలు పట్టించిన వాడు. 
జమున సత్యభామాహంకారానికీ 
కారం తినిపించిన వాడు. 

ఆయన లేచి
ఇందరు సాహితీ సమరాంగణులిక్కడుండగా ఏమెరుగుదునని నన్ను పిలిచినారు..?
అన్నాడట..
ప్రొద్దుటూరుకు వచ్చి పుట్టపర్తి వంటి మహాకవిని గూర్చి మాట్లాడటం అంటే తిరుమలకు వెళ్ళి వేంకటేశ్వర మహాత్యం గురించి చెప్పినట్లుందని చమత్కరించారట..
జనం వారి మాటలను నవ్వుతూ ఆస్వాదించారట...










రామ రాజభూషణుని రసగుళికలు"



"రామ రాజభూషణుని రసగుళికలు"
భట్టభారతిలో 1984 ఆగస్ట్ ముద్రింపబడింది
శ్రీ వీణా రమాపతి రాజు గారు మాకు సుపరిచితుడు
పుట్టపర్తికి సన్నిహితుడు
ఒక్కఋఏమిటి 
అందరూ పుట్టపర్తిని పితృ సమానులుగా భావించే వారే
దానికి తగ్గట్టు
పుట్టపర్తి వారు చూపించే ప్రేమ 
వారిని మరింత దగ్గరికి చేరుస్తుంది

కడపలో జరిగే ప్రతి సభలో 
పుట్టపర్తి అధ్యక్షులు గానో ఉపన్యాసకులుగా ఉండవలసిందే
పుట్టపర్తి లేని సభ దాదాపు అరుదే
ఏ సభ జరిగినా పుట్టపర్తికి ఆహ్వానం వెళ్ళేది

ఎక్కువ శాతం కడప జిల్లా గ్రంధాలయ సంస్థ 
 అధ్వర్యలో జరిగేవి
వేణుగోపాలరెడ్డి మల్లెమాల,రా రా,వైసివి,జానుమద్ది,
శశిశ్రీ పాల్గొనేవారు 

రమాపతి శశిశ్రీ ఎవరో ఒకరి భుజం చుట్టూ చేయి వేసి ఒకచేయి పంచె అంచులను పట్టుకోగా 
వెనుకకు మడిచి సభలో  
అడుగు పెట్టే వారు పుట్టపర్తి

వీణా రమాపతి రాజు గారు
కడప జిల్లా గ్రంధాలయ సంస్థ లో పనిచేసేవారు
ఎక్కువగా పుస్తకాలతోనే వారి పని
తరుచుగా లైబ్రరీకి వెళ్ళే పుట్టపర్తి 
ఒరే 
ఫలానా పుస్తకం వెతికివ్వరా
అంటే
అదే పనిగా తక్కిన పనులు పక్కన పెట్టి
పుట్టపర్తి వారు అడిగిన పుస్తకాన్ని 
పది ఇరవై అలమరలలోనుంచీ వెతికి పట్టుకుని
 వారికి అందిచ్చే వాడు

కాసేపు లైబ్రరీలో గడిపిన తరువాత
ఒరే రారా పోదాం 
అంటే
వస్తున్నా స్వామీ
అంటూ 
మళ్ళీ పుట్టపర్తికి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి
నడుచుకుంటూ వచ్చి ఇంటి వరకూ దిగబెట్టి
 కాసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడి 
మా అమ్మ ఇచ్చిన కాఫీ తాగి 
మళ్ళీ తన పనికి వెళ్ళే వాడు రమాపతి 

ఒకసారి రమాపతికి వేరే ఊరు ట్రాస్ఫర్ అయ్యింది
వెళ్ళిపోయాడు
ఇక పుట్టపర్తికి కనుపించడం మానేసాడు
లైబ్రరీకి వెళ్ళిన పుట్టపర్తికి
పుస్తకాలు వెతికి ఇచ్చేది ఎవరు..
ఇబ్బంది పడ్డారు పుట్టపర్తి

వెంటనే గ్రంధాలయ సంస్థ అధికారికి లెటరు వ్రాసారు
వాడు వెళ్ళినప్పటి నుంచీ 
నాకు చాలా ఇబ్బందిగా ఉంది
పుస్తకాలు వెతికి ఇచ్చే వారు లేరు
వాడిని వెంటనే కడపకు తిరిగి బదిలీ చేయండి అని

గ్రంధాలయ సంస్థ అధికారి ఆ ఉత్తరం చూచి నవ్వి
రమాపతిని తిరిగి కడపకు పంపేసారట
నాతో తన స్మృతులను పంచుకుంటూ చెప్పారు రమాపతి

వారినీ వీరినీ అడిగి 
రమాపతి ఫోన్ నంబరు పట్టుకున్నాను
పలకరించాను
ఎంతో సంతోషపడ్డారు
ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు
తన వద్ద ఉన్న కొన్ని అరుదైన వ్యాసాలు జాగ్రత్తగా పంపారు
వీరందరూ వానిలో పుట్టపర్తిని చూచుకుంటున్నారు
లేకపోతే వారు గతించి ఇరవై సంవత్సరాలవుతోంది
అయినా అవి ఇంకా సజీవంగా ఉన్నాయి
ఎందుకు
వానిలో 
పుట్టపర్తి ప్రేమ ఇంకా పరిమళాలు వెదజల్లుతూ వారి గుండెను తడుముతోంది ..
అంతే కదూ 

ఈ రామరాజ భూషణుని రసగుళికలు చదవండి మరి.. 









7 ఏప్రి, 2013

ఇది పీ వీ నరసింహరావ్ వ్రాసినది






ఇది పి వి నరసింహ రావ్ వెలువరించిన అభిప్రాయము 
ఈయనే పుట్టపర్తికి జ్ఞానపీఠమ్ రాకుండా అడ్డం పదినాడ ని అంటారు 
అందరిలో సింహంలా బ్రతికిన పుట్టపర్తికి తక్కువైన దేమి 
పుట్టపర్తి స్థాయికి జ్ఞాన పీఠమ్ ఎదగ లేక పోయిందంతే .. 





5 ఏప్రి, 2013

బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి

చిన జీయర్ స్వామి





1956  దీపావళి అమావాస్య నాడు 
త్రిదండి శ్రీమన్నారాయణ  రామానుజ చినజీయరు స్వామి వారు జన్మించారు .. 
వేదాంత విద్య 
పెద్ద జీయరు స్వామి వారి వద్ద నేర్చారు 
1981 లో జీయరు పీఠాన్ని అధిష్టించారు 
1984 న వేద విశ్వ విద్యాలయాన్ని
 విజయవాడ లో స్థాపించారు 
వేద ధర్మ వ్యాప్తి వారి లక్ష్యం 
వేదాన్ని అనుసరించే కాలం  నడుస్తుందని 
వారి బోధ 
అమెరికా సింగపూర్ తదితర దేశాలలో పర్యటించి 
అక్కడ యజ్ఞాలు చేసి 
ఆలయాలు నిర్మింపచేసి 
జీర్ణ ఆలయాలు ఉద్ధరించి 
భారతీయ సంప్రదాయాన్ని 
అర్ష ధర్మాన్ని 
వేద విజ్జ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేసారు 
గత జన్మ సంస్కారమే ఈ జన్మలో ప్రతిఫలిస్తుందని కొందరిని చుస్తే అనిపిస్తుంది కదూ .. 
పుట్టపర్తి వారి సంస్మరణ సంచికకు 
స్వామి వారు స్పందించిన విధమిది...  





3 ఏప్రి, 2013















1 ఏప్రి, 2013



ఏప్రిల్ మాసం పుట్టపర్తినీ వదల లేదు 
ఎలా...? 
ఇదిగో ... 
ఇలా....