పందొమ్మిది వం దల ఎనబయ్ దశకం మాట - కడపలోని
శ్రీరామకృష్ణ సమా జంలో వావికొలను సుబ్బారావుగారి
జయంతి సభను జిల్లా రచయితల సంఘం ఏర్పాటు
చేసింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
అధ్యాపకులు గౌరిపెద్ది రామసుబ్బశర్మ వక్తగా
వచ్చారు. ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా
చార్యులు సభాధ్యక్షులు. వావికొలను వారి మీద
రామసుబ్బశర్మ గారి ఉపన్యా సం ధారాపూర్ణంగా
సాగింది. ముగించబోతూ ఆయన వావికొలను
వారు వార్ధక్యంలో ఉబ్బసంతో బాధప డిన
సంగతిని ప్రస్తావించారు. అంతేకాదు, ఈ రోగం
కర్మఫలంగా వచ్చిందనీ, గతజన్మలో
పందికొక్కును చంపిన పాపానికి ఫలమనీ అంటూ, ఈ విషయాన్ని ప్రతిపాదించే
ఒక శ్లోకాన్ని కూడా ఉటంకించారు. సభ ‘ఔరా!’ అని విస్తుపోతుండగా పుట్టపర్తి
వారు లేచి నిల బడ్డారు.
‘రామసుబ్బయ్యా! నీ మాట వింటూ ఉంటే నాకు చాలా గుబులౌతా
ఉందయ్యా! చాలా సంవత్స రాల నుంచి మా ఇంట్లో పందికొక్కుల
బాధ ఉంది. ఇంకే వస్తువు నష్టమైనా భరిస్తాను గానీ, పుస్తకాలు
పాడైతే తట్టుకోలేను. ఏం చేసేది! వారానికి ఒకటి రెండు పందికొక్కు
ల్నయినా చంపక తప్పడం లేదు. ఆ కర్మఫలంగా నేనెన్ని జన్మలెత్తి
ఉబ్బసం బాధను భరించాల్నో!’ అన్నారు. సభ ఘొల్లుమంది.
నిజానికి పుట్టపర్తి వారు సద్యఃస్ఫూర్తితో చేసిన ఈ ఎదురు దాడిలో
హేతువాదం ఉంది. ఆయన శ్రీవైష్ణవుడైన అభ్యుదయ వాది.
ఆ సరస్వతీ పుత్రుని ఇరవై ఒకటో వర్ధంతి (సెప్టెంబర్ ఒకటి)
సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం!
- కట్టా నరసింహులు
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి