september 11,2011
వైఎస్‌ఆర్ జిల్లాపై
- రాజుకఁంటోన్న ఉద్యమం
- పేరు మారుస్తే ఊరుకోబోమంటున్న విపక్షాలు
- సిఎం వద్ద పంచాయతీ
- మళ్లీ అభిప్రాయ సేకరణ
ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా మార్చడంపై రేగిన వివాదం తీవ్రతరమవుతోంది. రోజు రోజుకఁ వివాదం రాజుకఁంటోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కార్మిక సంఘాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లా పేరును తొలగించి కడప జిల్లాగానే కొనసాగించాలఁ కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. కడప పేరు మార్పుపై వివరణ ఇవ్వాలఁ జిల్లా కలెక్టర్‌కఁ ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ మూడవ తేదీన వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కడపకఁ వైఎస్‌ఆర్ పేరును పెట్టాలఁ తీర్మాఁంచింది. ఆ తర్వాత అక్టోబర్ ఆరవ తేదీన కడప పేరు మార్పుపై అభ్యంతరాలు తెలియజేయాలఁ కలెక్టర్ బహిరంగ ప్రకటన చేశారు. అప్పట్లో టిడిపి, సిపిఎం, సిపిఐ, పీఆర్పీ, బిజెపి, మానవ హకఁ్కల వేదిక, విరసం, పౌరహకఁ్కల సంఘాలతో పాటు ప్రజా సంఘాలు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేశాయి. అయితే ప్రభుత్వం వాటిఁ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కడప పేరును మార్పు చేస్తున్నట్లు రహస్య బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంది. ఈ పఁ కూడా ప్రభుత్వం చేయలేదు. ఎవరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోకఁండానే ఈ నెల ఏడవ తేదీన జిఓ నెంబర్ 613ను ప్రభుత్వం జారీ చేసింది. అదే రోజు జిల్లా గెజిట్‌లో చేర్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా కడప పేరును తొలగించి వైఎస్‌ఆర్ జిల్లాగా కలెక్టరట్ కార్యాలయపు బోర్డుపై పేరు మార్చారు. ఈ విషయంపై ఈ నెల 12న మానవ హకఁ్కల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, 14న విరసం నాయకఁలు వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, వకఁళాభరణం రామకృష్ణ, మృణాళిఁ, ఓల్గా, వింధ్యా వంటి వారు సైతం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం చల్లబడింది. శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేక పంచ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిద్దవటం, కడప కళాక్షేత్రంలో ఁర్వహించిన సభల్లో కాంగ్రెస్ సీఁయర్ నాయకఁలు, మైదుకూరు శాసనసభ్యులు డాక్టర్ డి.ఎల్.రవీంద్రారెడ్డి కడప పేరు మార్పుపై తీవ్ర ఁరసన వ్యక్తం చేశారు. కడప పేరును తొలగించడం బాధాకరమఁ ఆయన వ్యాఖ్యాఁంచారు. డిఎల్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చయానీయాంశమైంది. కడప పేరు చేర్చే వరకఁ ఉద్యమిస్తామఁ డిఎల్ ప్రకటించారు. ఇందుకఁ వ్యతిరేకంగా మేయర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకఁలు పేరు మారిస్తే తామూ ఉద్యమం చేస్తామఁ ప్రకటించుకఁన్నారు. కడపపేరు మార్చడంపై ప్రతిపక్షాలైన తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ప్రజారాజ్యం, బిఎస్‌పి, బిజెపి సైతం తమ ఁరసన గళాఁ్న విఁపించాయి. కడప పేరును అలాగే కొనసాగించకఁంటే ఉద్యమిస్తామఁ హెచ్చరించాయి. బ్రహ్మంగారు, మొల్ల, అన్నమయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, కోటిరెడ్డి, ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, రచయితలు వేమన, బమ్మెరపోతన, ముకఁ్కతిమ్మన, భట్టుమూర్తి వంటి ప్రముఖులు ఎంతో మంది ఉండగా కేవలం 26 సంవత్సరాల రాజకీయచరిత్ర ఉన్న వైఎస్‌ఆర్ పేరుతో జిల్లాను ఎలా మారుస్తారనే అంశాఁ్న ఆ పార్టీలు తెరపైకి తెచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఒకడుగు ముందుకేసి కడప పేరు తొలగింపు వ్యవహారాఁ్న రాష్ట్ర రాజధాఁకి చేర్చింది. ఆ పార్టీకి చెందిన ప్రతిఁధి బృందం ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయి జిల్లా చరిత్రను వివరించారు. కడప పేరు మార్పు విషయం తనకఁ తెలియకఁండానే జరిగిందఁ ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. కడప పేరు తొలగింపునకఁ సంబంధించి విచారణ చేపట్టి తగు చర్యలకఁ సిఎం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ అందరితో అభిప్రాయాలు తీసుకఁఁ కడప పేరు కొనసాగింపుపై ప్రభుత్వం ఁర్ణయం తీసుకోనుంది. జిల్లాలోఁ అత్యధిక మంది కడప పేరును కొనసాగించాలఁ ఆందోళనకఁ సిద్దమవుతుంటే కాంగ్రెస్ పార్టీలోఁ కొందరు మాత్రం తమ స్వార్థరాజకీయాల కోసం వైఎస్‌ఆర్ జిల్లాగానే కొనసాగించాలఁ కోరడం విమర్శలకఁ తావిస్తోంది. చరిత్రతో పెనవేసుకఁన్న పేరును తొలగించడం అన్యాయమఁ ప్రతి ఒక్కరు తమ గళాఁ్న విఁపిస్తున్నారు. కడప పేరు మార్పుపై ప్రభుత్వం మళ్లీ పునఃసమీక్షిస్తుందా? లేక వైఎస్‌ఆర్ జిల్లాగానే కొనసాగిస్తుందా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి