22 ఫిబ్ర, 2012

సరస్వతీపుత్ర మహాకవి డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారి ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ

సరస్వతీపుత్ర..
మహాకవి..
డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారిని..
అప్పట్లో ..
ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ చేసింది..

అయ్యగారి ..
అపురూపమైన గొంతు లోంచీ ..
వారి జీవిత విశేషాలను వినడం..
 ఓ అపూర్వ అనుభవం..

ఆ రోజులలో ..
అయ్య గారి ఉపన్యాసాలను..
విలువైన గ్రంధాలనూ..
అభాగ్యులమై చేజార్చుకున్నా..
ఈ చివరి జ్ఞాపకాన్ని మిగుల్చుకో గలిగాం..
మీరూ వినండి..

21 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులూ.. శిష్యులూ



ప్రతి ఇంట్లో ..
ఏవో..
కుటుంబ పరమైన గొడవలు..
ఆర్థిక పరమైన.. వాదనలు..
 


కానీ మా ఇంట్లో ..
అమ్మ ..అయ్యలకు..
పురాణ పరమైన గొడవలు..
అధ్యాత్మిక వాదనలు..
నమ్ముతారా..?
 
మధ్య లో భక్తులు 
అటో తాళం.. ఇటో తాళం..

హిమాలయాలకు పరిగెత్తి పోతే..
దేవుడు దొరుకుతాడా..?
ఇం
ట్లోదేవుడు లేడా..?
సంసారం వదిలేస్తే మోక్షమొస్తుందా..?
ఇవన్నీ సత్యాలే..
కానీ అయ్యప్రేమంతా..
వ్యాసునిపైనా ..
వాల్మీకి పైనా ..
కబీరుపైనా..
కాళిదాసుపైనా..
ఇహలోకంలో ఉన్నా ..
వారి మనసూ ..ఊహలూ ..
వాళ్ళకాలంలోనే విహరిస్తూంటాయి..మరి..
అదేమిటంటే ..
అరికాలి మంట నెత్తి కెక్కుతుంది..
 ఒకసారి..
రఘూత్తముడు అమ్మతో అన్నాడట..
 
"అమ్మా ..
మీది ఈ జన్మ బంధం ..
మాది జన్మ జన్మల బంధం.."
అమ్మ .."అట్లే కానీ లేవయ్యా "
అనేదిట నవ్వుతూ.
అమ్మకు ..
అయ్యకు ..
మధ్య శిష్యులు
పాపం మా అమ్మ..
ఎవరికీ రాని కష్టాలు అనుభవించింది..
అదీ ఈ కాలంలో..
ప్రవచనాలు చేసే వాళ్ళైతే..
ఎన్ని ఆధ్యాత్మిక బోధనలు చేసినా..
ఇంటికీ..
శిష్యులకూ..
తగినంత దూరాన్ని మైన్ టైన్ చేస్తారనుకుంటా..
అయ్యకది తెలియదు..
ఆయనతో పాటూ ..
ఆయన ఏది తింటే వాళ్ళూ ..
అదే తినాలి.. తాగాలి...
ఎన్ని రోజులైనా..
ఆయనకు తెలిసింది..
పుస్తకాలలో చెప్పింది..
ప్రాక్టికల్ గా తీసుకు రావాలనే..!!
అమాయక బాలుడు మా అయ్య.
కర్తవ్యం సినిమాలో అనుకుంటా..
ఒక చిన్న బాబు టీచరును అడుగుతాదు..
మీరు అపధ్ధం చెప్పవద్దని చెబుతారు..
సత్యమే చెప్పాలంటారు..
అదే సత్యం చెబితే..
మా అమ్మా నాన్నా ..
ఏదో తప్పు చేసి నట్లు కొడుతున్నారు ..
సత్యం పలకటం తప్పా టీచర్ ..?
మరి మహాత్మా గాంధీ సత్యమే పలికాడుగా..
అలాంటి స్వచ్చమైన మనసున్న వాడు అయ్య.
 
లేక పోతే శిష్యులను నెత్తిన పెట్టుకుని
ఈడొచ్చిన ఆడపిల్లలున్న ఇంట్లో ..
మా అమ్మ ఎలా చేసిందో..?
 
ఎవరైనా తప్పు చేస్తే ..
అవును నేను తప్పు చేసాను..
అని ఒప్పుకుంటారా..?
బు
కాయిస్తారు..!!
 
కానీ ..
అవును ..నేను తప్పు చేసాను..
మహా మహులే..
తప్పు నుంచీ తప్పుకో లేనప్పుడు..
నేనెలా తప్పుకో గలనూ..?
అని నిర్భీతిగా ..
తప్పుకు కూడా తల యెత్తి నిలిచే..
తత్వమున్నవాడు

ఒకసారి..
రఘూత్తమ రావ్ అమ్మతో అన్నాడు..
"మీది ఈ జన్మ బంధం..
మాది జన్మ జన్మ ల బంధం..
"సరే.. అలాగే కానీ లేవయ్యా.."
అంది అమ్మ నవ్వుతూ..

నియమ బధ్ధ జీవితమామెది..
నాది బైరాగి జీవితం ..
ఆమెకూ.. నాకూ ..పొత్తే కుదిరేది కాదు..
కానీ ..
తన సత్ప్రవర్తన అనే కుర్చీ  నుంచీ దిగకుండానే 
నా యొక్క దౌర్బల్యాలను..
క్షమించే తల్లి గుణం ..ఆమెలో గమనించాను.
 
ఒక సారి ..
విశ్వనాధా ..నేనూ ..
ఒకే సభలో మాట్లాడాలి..
ఆయన చెప్పినదంతా ..
నేను వెంట వెంటనే పూర్వ పక్షం చేస్తున్నాను..
ఆమే మా వాగ్వివాదానికి ముగింపు పలికింది.
అంతటి పాండిత్య ఖని నా భార్య.

1983 లో ఆమె స్వర్గస్థురాలైన తరువాత..
 నా కలం మూగవోయింది. 
జీవచ్చవాన్నయ్యాను..
రుధ్ధ కంఠంతో తన గౌరవాన్ని ప్రకటించేవారు .. 

 

19 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల గాంధీజీ మహా ప్రస్థానం..


ఉన్నప్పుడు ప్రపంచం పలుకరించదు..
పోయినాక ..
ఆ పాద ముద్రలకు గుళ్ళు కడుతుంది..
ఇదే ప్రపంచ రీతి ....
అని నిర్వేదంలో మునిగి పోతారు అయ్య..

నా బాల్యంలో..
గాంధీజీ పెనుగొండ్ వచ్చారు...
షాకత్ అలీ ..
మహమ్మద్ అలీ వచ్చారు..
కొందరు పిల్లలతో నేనా సభకు వెళ్ళాను.పోలీసులు కొందరిపై లాఠీ ఛార్జ్ చేసారు.
భయపడ్డాను.

నా బంధువులొకరు సత్యాగ్రహం చేసి 
ఆస్పత్రిలో చేరారు. 
తర్వాత పొలమిచ్చారు.
గాంధీజీ ప్రసంగాలు హిందూ పత్రికలో చదివి..
ఆవేశ పడే వాళ్ళం.


ఒక సామాన్యునిగా ..
గాంధీజీ మరణాన్ని  జీర్ణం చేసుకోలేని..
మహమ్మద్ అలీ
వివశత ..వేదన ..
 
ఆ వార్త రేడియో లో విని..
అయ్య నేలపై పడి ..పొర్లిపోయి..
 విలపించారట అయ్య..
 
ఆయన జీవించి వున్నప్పుడు ..
పలుకరించక పోయిన లోకంపై..
 ఘౄణాత్మక మైన భావంతో..
"గాంధీజీ మహాప్రస్థానం" వ్రాసాను అన్నారు 
అయ్య

శిలలకు పూజలు చేసిన దేశమిది ..
చెట్లకు చుట్లు చుట్టిన మనుషులము మేము..
వేద పురాణేతిహాసములు..
మా సొత్తని పొంగిపోయాము..
చివరికి చేసినదేమిటి ..??
నీ వంటి మహాత్ముని పొట్టన బెట్టుకొన్నాము.. 

ఇవే కాక వీరేశలింగం పంతులు..
బాల గంగాధర తిలక్
విజయాంధ్రులు
వంటి వచన రచనలు తనదైన  జాతీయ స్ఫూర్తిని సరళ వ్యాఖ్యలతో చేసారు.
 
అయ్య ఏమంటారంటే..
ఈ అనేక భాషా ప్రభావాల వలన ..
రచనలో నేను పడ్డ బాధలు కొన్నున్నాయ్..

వళ్ళత్తోళ్
నేను ఏది వ్రాసినా ..
అంతకంటే బాగుండేది ఏదో..
 మనసులో మెదులుతుంది.
మళయాళంలో..
వళ్ళత్తోళ్ మహాకవి..
గాంధీజీని "ఏండ్రెగురునాధన్ "  అనే ఓ ఖండిక వ్రాసారు. 

అలాంటి ఒకదాన్ని ..
నా జీవితంలో వ్రాయలేక పోయానే..
అనుకుంటూ వుంటాను అని

పొద్దుటూరు చేరిన తరువాత ..
నేను జానపద శైలిలో..
 కాంగ్రెస్ చరిత్ర ఇరవై నోటు బుక్కుల నిండా రాసాను. 
కొన్ని చోట్ల రీడింగ్ ఇచ్చాను. 
షాకత్ అలీ ..
ముఖ్యంగా డయ్యర్ సేనాని దురాగతాలు. 
ఆ బుక్కులు అనంతపురం కాంగ్రెస్ ఆఫీస్ లో వుండేవి. వ్యక్తిగత ద్వేషాలు ఎక్కువగా వుండినందున..
అది బయటికి రాలేదు. 
నేను పట్టాభి గారిని అనుకరించి రాసాను. 

కల్లూరు సుబ్బారావ్ గారు..
 ప్రింట్ చేయిస్తామన్నారు...
1942 తర్వాత కాంగ్రెస్ కలుషితమైంది. 

తరువాత ఆ వ్రాత ప్రతులను చించేసాను. 
నా చేతులారా చించేసినవి..
 కాంగ్రెస్ చరిత్ర..
 అస్త సామ్రాజ్యం..
 హిందు ముస్లిం గలాటా ఇష్టం లేక..
 నేనే చించేసాను.
 
ప్రాజ్యములైన సంపదలు.. 
పర్వులు వెట్టిన చోటు లోక సం
పూజ్యములైన ధర్మ రణముల్ 
చెలరేగిన గడ్డ సాహితీ
రాజ్యములేలుకొన్న కవి రాజులు మెట్టిన భూమి; అస్త సా
మ్రాజ్యము దానికై కనుల రాల్తు నఖంపచ భాష్ప పూరముల్...
కాయము కాయమానమున 
కమ్మని కీర్తి కరాల మాలికా
క్షాయిక రక్తముల్ గడిగి 
చీకటి చిట్లిన తళ్ళి కోటలో
దాయల గెల్చి, భాగ్యముల్ గ్రావగ బూని
 అభాగ్యదష్టుడై పోయిన ,
 రామరాజు మన పూర్యుడు 
కోష్ణములా కథాంశమున్..

ఇలాంటి వ్యక్తీ కరణలున్న కావ్యం ..
అస్త సామ్రాజ్యం..
 జాతీయ ప్రేరణతో చాలా రచనలే చేసాను.
 
సాహిత్య ప్రభ ఆంధ్ర ప్రభ దినపత్రిక 16.12.1977


 

17 ఫిబ్ర, 2012

తన శివ తాండవం గురించి పుట్టపర్తి వారు.

అయ్య శివ తాండవం పై..
వఝ్ఝల రంగాచార్య గారు..
అధ్భుతమైన విశ్లేషణ చేసారు..
ఆయన ..
"పుట్టపర్తి వారి ఖండ కావ్యములు -పరిశీలన"

"శివ తాండవ ప్రత్యేకాధ్యయనము"
అనే సిధ్ధంత గ్రంధములు వ్రాసారు.
ఆయన కరీం నగర్ వాసి ప్రొఫెసర్..
 

"తాత్వికమైన దృష్టితో ఆలోచిస్తే.. 
శివ తాండవం ..
హరి హరా భేదాన్ని ..
అపూర్వమైన రీతిలో ఆవిష్కరించింది.
 

మంత్ర శాస్త్ర పరంగా ఆలోచిస్తే..
శివతాండవం..
నిత్య పారాయణ గ్రంధార్హతను కలిగి..

అధ్భుతమైన ..
ఆధ్యాత్మికానుభూతులు ప్రసాదిస్తుంది.
అందుకు ఈ రచయితే సాక్ష్యం.."
 

అని  తననే సాక్ష్యం గా చెప్పుకున్నారు..




ఇది 
సంగీత.. 
సాహిత్య ..
నాట్య ..
సమ్మేళనం గా..
కొనియాడ బడడమే కాక ..
న్యూరో పొయెట్రీ గా ..
విజ్ఞులు పేర్కొంటారు..

మహా కాల స్వరూపంగా..
మహా శ్వేత స్వరూపంగా ..
వర్ణించడం..
భౌతిక శాస్త్రంలో ప్రతిపాదించబడే..
బ్లాక్ హోల్ ను సంకేతిస్తూ వుంది..



దీనిలోనే మహా స్ఫోటం సంభవించి..
పునః సృష్టి ఏర్పడుతుందని..
భౌతిక తత్వ వేత్తలు అంటున్నారు.
ప్రమత్తునిలా శివుడు నర్తనం చేయటం ..
పరమాణు స్ఫోటముగా ..
ఇలా కావ్యం లో ..
నటరాజు వర్ణనం ..
లయ కాలాన్నీ ..
సృష్టి ఆవిర్భావాన్నీ..
సైతం సూచిస్తొందని డా. వఝ్ఝల రంగాచార్య గారు ప్రతిపాదించారు.


రంగా చార్యులు గారే కాదు ..
ప్రపంచ వ్యాప్తంగా ..
ఎందరో శివ తాండవం పై ..
పరిశోధన చేస్తున్నారు ..
చేస్తారు భవిష్యత్తులో కూడా..

ఎందుకంటే..
ఎందుకంటే..
ఎందుకంటే..
 

ఆయన తన ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు కూడా
నారాయణ మంత్రాన్ని జపించడం..
ఆయన  ఉచ్చ్వాస నిశ్శ్వాసాలలో  కూడా ..

నారాయణ మంత్రమే నిండి వుంది...
ఆయన జీవితం నిండా వున్నవి రెండే ..
ఒకటి సాధన..

 రెండు శోధన .. 


ఆజన్మాంతము ..
కటిక దారిద్ర్యమైనా ..
అనుభవించగలను..
కానీ ..
క్షణమైనను..
నాస్తికత్వమును భరించలేనన్నారు.




తనను క్షణమైనా విడువ లేని..
తన వాణి కోసం ..
ఆ పరమ శివుడు..
సృష్టి రహస్యాలు తేట తెల్ల మయ్యేటట్లు..
ఖచ్చితంగా నర్తిస్తాడు..
శివతాండవంలో..
కానీ ..

నారాయణమూర్తి ఆత్మ లో ఆత్మ గా ..
జీవించిన అయ్య పట్ల..
 ఆ లక్ష్మీ మాత ఎందుకు శీత కన్ను వేసిందో..??
ఎన్నడూ వీడని ప్రశ్న..
బహుశా లక్ష్మీ విష్ణువుల కలహంలో..
పంతానికి పోయిన ఆ లోక జనని ..
అయ్యను పట్టించు కోలేదని అనుకోవాలేమో..!!


అందుకు తగ్గట్టుగానే అయ్య..
లౌకిక విషయాలకు..
అంత ప్రాధాన్యతనిచ్చేవారు కాదు.!!
అది ధనము కానీయండీ..

 మరేదైనా కానీయండి..!!
ఆయనకు చివరి దశలో డబ్బు విలువ తెలిసింది..
నాకొక రెండు వేలొస్తే బాగుండును ..
ఏదైనా ఆశ్రమంలో పోయి వుంటాను అని బాధపడ్డారు..




ప్రొద్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ..
ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడిని. 

నాకు సాహిత్యం పిచ్చితో పాటూ ..
ఈ భక్తి పిచ్చి కూడా ఎక్కువగా వుంది ..
నన్ను ఎరిగిన నా స్నేహితులందరికీ కూడా తెలిసి విషయమే ఇది. 

ప్రొడ్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ప్రదక్షిణలు
చేస్తూ ..చేస్తూ ..
ఎందుకు పుట్టిందో ..
ఒకానొక రోజు ..
ఆ ప్రేరణ..
ఆ ప్రేరణతో ..
నలభై అయిదు రోజుల్లోనే ఈ శివతాండవం ముగించడం జరిగింది. 

తరువాత ఈ కావ్యం ఇంత చిన్నగా ఉందే..
దీన్ని స్వరూపం కాస్త పెద్దగా చేద్దాం..
దీనికి కాయ పుష్టి నిద్దాం ..
అని మళ్ళీ ఎంతగానో ప్రయత్నించాను..

కానీ మళ్ళీ ఆ ప్రేరణ నాకు రాలేదు.
అందువల్ల ఉన్నంతే చాల్లే అనుకున్నాను..!!
ఒక్కొక్క దానికి ..
బ్రహ్మాండమైన అదృష్టంపడుతుందేమో ..
నని నా ఊహ ..!!

భారత దేశమంతా ..
నేను సంపాదించుకున్నటువంటి కీర్తికి ..
ప్రధాన మూల స్థంభం..
శివతాండవమేమోననిపిస్తుంది..!

కాళిదాసు జీవితమే తీసుకుందాం..
నాటకాలు రాశాడు ..
కావ్యాలు రాసాడు..
పాపం ..
అయినా ఆ మేఘదూతకు వచ్చినటువంటి ప్రశస్తి..
ఇంకే కావ్యానికీ రాలేదు. 

రఘు వంశం ..
కుమార సంభవం ..
మంచివే అంటాము..
కానీ మేఘదూత మాత్రం ..
అతని అసాధారణమైనటువంటి రచన ..
అని అనుకుంటూ ఉంటాం.
అందుకే మల్లి నాధుడే చెప్పినాడు..
మాఘే మేఘే గతం భూయః 
మాఘ కావ్యం తోనూ.. మేఘ సందేశం తోనూ..
నా జీవితం గడిచిపోయిందీ ..అని ..
ఆ మేఘ సందేశం అంతా ..
ఇన్నూటా యాభై శ్లోకాలే.. ఉండేది. 
ఆ ఇన్నూటా యాభై శ్లోకాలతోనే..
కాళిదాసు మహాకవి అయిపోయాడు..

శివకవులు రగడ చందస్సులో ఎక్కువగా వ్రాసారు.. శివతాండవం లో ..
ఆ చందస్సునే ఎక్కువగా వాడటం జరిగింది.
చాలా మంది..
ఏదో ఊరికే ఏదో మాట్లాడుతూ వుంటారు..
మాత్రా చందస్సులు.. రగడలూ.. వ్రాయడం..
ఉత్పల మాల.. చంపక మాల..
వ్రాసే దానికి చేసే పరిశ్రమ కంటే ..
తక్కువేమీ కాదు.
 
పైగా ..
ఆ పద్యాలు వ్రాసేవానికి..
ఒక అనుకూలం కూడా వుంది.
మాత్రాచందస్సును వ్రాసే టప్పుడు..
వాడి మార్గాన్ని వాడే మలుచుకోవలసి వుంటుంది.
ఇదొక కష్ట మైనటువంటి పని కూడా..
 
ఆ చందస్సులు రాసే టటువంటి వాడు..
ఎంత సమర్థుడుగా వుండవలెనో ..
అంతకంటే సమర్థుడుగా వున్నవాడే..
మాత్రా చందస్సును సమర్థంగా..
పుష్టికరంగా వ్రాయగలడు ..
అని చెప్పేందుకే ఈ మాత్రాచందస్సులో..
నేను రచనలు చేసినానేమో అనిపిస్తుంది.

తెలుగు అస్సలు తెలియని ఇతర రాష్ట్రాలలో పర్యటించినప్పుడు..
అక్కడి సాహితీ మిత్రులు ..
శివతాండవం చదవమనేవారు.
భాష మీకు అర్థం కాదు కదా ..
అంటే భాష అవసరం లేదు ..
మీ గళం..
ఆ లయానుబధ్ధమైన శైలీ..
మా కేదో దివ్యానుభూతిని కలిగిస్తుంది అనేవారు

14 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు అయ్యగా

అయ్య సాహిత్య జీవితాన్ని..
ఆధ్యాత్మిక జీవితాన్ని ..
ఇప్పటికి ఎన్నో పోస్ట్ లల్లో చెబుతున్నాను.
ఇప్పుడు ఒక కూతురుగా..

 అయ్యతో నా అనుబంధాన్నీ ప్రేమనూ చెప్తాను.
అవి నా జీవితంలోనే మధురానుభూతులు..
అంత గొప్ప అయ్యకు..
చిట్ట చివరి కూతురుగా పుట్టడం..
ఒక విధంగా అదృష్టమూ..
మరో విధంగా దురదృష్టమూ..
నేను చూసిన అయ్య ..
పూర్తిగా ఒక మహా పండితుడుగా..
సాహిత్య వేత్త గా..
సంగీత నిధి గా..
పరిపూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి..
 
కానీ ..
ఒక విధంగా ..
అక్కయ్యలు అదృష్ట వంతులు..
వారు అయ్య క్రమ క్రమాభివృధ్ధినీ 

అయ్య సంఘర్షణనూ చూసిన వాళ్ళు..
అయ్య వేసిన ప్రతి అడుగు వెనక..
కష్ట సుఖాలను అనుభవించిన వాళ్ళు..
అయ్య హిమాలయాలకు పోయిన రోజులలో ..
అమ్మ ముగ్గురు పిల్లలను పెట్టుకుని ..
ఈ కఠిన జగత్తులో ఎలా ఈదిందీ..
తిరుచానూరులో ఉన్నప్పుడు..

అయ్య రాక కోసం డబ్బు కోసం ..
ఎలా ఎదురు చూసిందీ..
నా కంటే ఎక్కువ ..
వారి కన్నీరు చారికలు చెబుతాయి ..
ఆ ఎడబాటు లోని వేదనను..
ఒక అదృష్టమేమంటే..
అయ్య నారాయణ మంత్రాన్ని..
ఇప్పుడు అమ్మ
 ఎంత గట్టిగా పట్టుకున్నారో ..
ఇంట్లో అమ్మ రామాయణాన్నీ..
 రామయ్యనూ ..
అంత గట్టి గానూ తన పట్టులో బిగించింది..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు జవాబు లేదు..

తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత ..
ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
అప్పట్లో అమ్మ
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
 
పంపితే డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
అమ్మ ఆ రోజులలో..
 సంవత్సరాలు ..
సంవత్సరాలు ..
బొరుగులు తిని..
మంచినీళ్ళు తాగి బ్రతికిందట..
అన్నం గిన్నం పిల్లలకు పెట్టి..
ఒక రోజు..

ఈన యెప్పుడు వస్తారో ..
లేక డబ్బులు ఎప్పుడు పంపుతారో..
అని దిగులుగా ఆలోచిస్తూ వుందట..

అయ్యకు ఢిల్లీ లో పసిరికలు ..
జాబు లేదు ..
జవాబు లేదు..
తన సంగీతమూ..
 తన సాహిత్యమూ..
 తన సాధనా ..
అయిన తరువాత..
 ఎప్పుడైనా గుర్తుకు వస్తే..
భార్యా పిల్లలు అయ్యకు గుర్తుకు వస్తారు..
పంపితే ..డబ్బు పంపుతారు..
లేక పోతే లేదు..
 
ఒక రోజు తెల్ల వారు ఝాము ..
నాలుగూ నాలుగున్నర..
అమ్మ ముంగిటిలో కళ్ళాపి చల్లుతూ..
 దిగులుగా ఆలోచిస్తూ ఉంది.
ఈనకు పసిరికలు ..ఎలా ఉన్నారో ..?
అని.
ఇంతలో..
తెల్లని జుబ్బా ..
తెల్లని పొడవాటి గడ్డం..
ఒకాయన చీకట్లోంచీ నడచి వచ్చాడు..
అమ్మ దగ్గర ఆగాడు.
 
ఎందుకమ్మ దిగులు పడతావ్ ..?
ఆయన అక్కడ..
బాగానే ఉన్నాడు..
వస్తాడులే.. బాధ పడకు ..
అని చెప్పి
మళ్ళీ చీకటిలో కలిసి పోయాడు..
 
కాసేపటికి అమ్మ ఉలిక్కి పడింది.
ఎవరతను..
ఇంత తెల్ల వారి వేళ
నేను చెప్ప కుండానే
నా మనసు లోని విషయాన్ని గ్రహించి
స్వాంతన చెప్పి వెళ్ళి పోయాడు..
అసలు ఎవరబ్బా ..ఆయన..?
అని ..
అక్కడే ఉన్న ..
మా మూడవ అక్కయ్యను చూసి రమ్మని తరిమింది..
 
అప్పటికి అక్కయ్య ఏడేళ్ళ పిల్ల..
వెంటనే పరిగెత్తిన అక్కయ్యకు ..
ఆంత దూరం వెళ్ళినా..
ఆ తెల్ల బట్టలు..
తెల్లని గడ్డమూ 
ఆ అపురూపవ్యక్తి కనిపించలేదు..
ఇలాంటివి ఎన్నో..
మనం భగవన్నామం చేయాలంతే..
ఆయన మన వెంటే ఉంటాడు..
అంటుంది అమ్మ.

రాధమ్మ
నేను మా నాగక్కయ్యా ల టయానికి ..
ఇల్లు కొంత స్థిర పడింది..
అయ్య మానసికంగా జీవితంలోనూ కాస్త స్థిర పడ్డారు..
మా అమ్మ ముఖం లో నవ్వులొచ్చాయ్..
 
కానీ..
మనకా కష్టాల్లేవ్..
నేను అయ్య ముద్దుల కూతుర్ని..
నా ప్రతి మాటా ముద్దే..

ప్రతి చేష్టా ముద్దే..

కృష్ణుని రాధమ్మ పేరు నా కొచ్చింది.
అయ్య నా కోసం ఒక కీర్తన కూడా వ్రాసారు..
 ఏమమ్మ రాధా..
ఎన్నడు కరుణింతువమ్మ..
ఈ మాయా బంధమ్ముల
నెన్నడు వదిలింతువమ్మ..
నా ముందు తాళం వేస్తూ అయ్య ప్రేమగా పాడేవారది..

 

పెనుగొండలో ..
పక్కా హనుమంతా చర్యులు అని ..
ఒకాయన గొప్ప సంగీత విద్యాంసుడు. 

పాపం..
సంగీత పాఠాలు చెప్పుకొనేవాడు. 
పేరు మీకు తెలిసే వుంటుంది.. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్ అని ..
వాడూ.. నేనూ ..
ఈ పక్కా హనుమంతాచార్యుల వద్ద..
సంగీతం ఆరంభించిన వాళ్ళం..

తరువాత..
ఆయనకు జీవనం జరుగక ..
కొక్కొండ సుబ్రమణ్యం
అనంతపురం పాయ..
అందువల్ల..
ఆయన వద్ద ..
సరళీ వరుసలూ ..
జంట వరుసలూ ..
అలంకారాలూ ..
యభై అరవై వర్ణాల వరకూ నాకు పాఠం చెప్పినారు.. 

వర్ణ సాధన ఎంత బాగా చేస్తే ..
స్వర విన్యాసం అంత బాగా వుంటుందని..
వారి ఊహ ..
 
అరియక్కుడి రామనుజయ్యంగార్
మా అమ్మ ఫిడేలు ఎక్కువగా వాయిస్తూ వుండేది. దానివల్ల ..
ఆయన వెళ్ళి పోయిన తరువాత..
ఆమె దగ్గర సంగీత సాధన మొదలు పెట్టినాను. 
ఆమె సుమారు ..
యాభై ..అరవై కృతులదాకా..
నాకు పాఠం చెప్పింది.

ప్రొద్దుటూరుకు వచ్చిన తరువాత..
పెద్ద జమాలు..
గొప్ప విద్వాంసుడు.. 
గొప్పగా ఫిడేలు వాయించేటటువంటి వాడు.

ఈ విద్యా విషయంలో ..
నా ఆశకు అంతు లేదని ..
ఇంతకు ముందే మీకు మనవి చేసి నాను. 
అందువల్ల ..
ప్రొద్దుటూరికి వచ్చిన తరువాత..
ఆయన దగ్గర సంగీత సాధన చేస్తూ..
సుమారు నూరు ..నూట యాభై కృతులు..
పాఠం చేసుకున్నాను. 


ఈ రేడియో వాళ్ళు వచ్చిన తరువాత ..
కొక్కొండ సుబ్రమణ్యం అని ..
రేడియోలో పని చేస్తూ వుండినాడు
మంచి విద్వాంసుడు.
అరియక్కుడి రామనుజయ్యంగార్

అతని దగ్గర కొన్ని కృతులు పాఠం చేసి నాను. 

ఈ రీతిగా ..
సుమారు అయిదు నూర్లు ..
ఆరు నూర్లు కృతులు ..
సంగీతంలో చక్కగా పాఠం చేసుకున్నాను. 

యాభై అరవై వర్ణాల వరకూ పాఠం చేసుకున్నాను
ఇంతకు మించి ..
అనేక మంది గొప్ప గొప్ప గాయకులను..
వినేటటువంటి అదృష్టం నాకు జీవితంలో పట్టింది. 

అరియక్కుడి రామానుజయ్యంగారేమి..
శెమ్మంగూడి శ్రీనివాసయ్యంగారేమి..
బాలమురళీ కృష్ణ ..
ఇప్పుడందరూ వింటున్నారు ..
నేనూ వింటున్నాను.

చాలా గొప్ప గొప్ప ..
విద్వాంసుల యొక్క కచేరీలువిన్నాను. 
సంధ్యావందనం శ్రీనివాసరావ్
సంగీతానికెప్పుడూ శ్రవణం ప్రధానం..

బాగా పాడ్తావు పోప్పా..
అని ఏదో అంటాను కానీ ..
మనస్ఫూర్తిగా అనేటటువంటి మాటకాదది. 
పైగా ..
అనంత కృష్ణ శర్మ గారి దగ్గర ..
సంధ్యావందనం శ్రీనివాసరావ్
అనేకములైన సంగీత విద్యా రహస్యములను నేర్చుకునేటటువంటి
అవకాశం నాకు ఏర్పడింది.  

ఆయన సంగీతంలో చాలా గొప్ప విద్వాంసుడు.
 సంగీత శాస్త్రంలో గొప్ప లాక్షణికుడాయన..
 ఈ రాగం యొక్క స్వరూపం ఇట్లే వుండవలె..
 ఇంతకంటే భిన్నంగా ..
ఈ రాగం యొక్క స్వరూపం వుండేదానికి వీలు లేదు
 అని అనంత కృష్ణ శర్మ చెబితే ..
గొప్ప గొప్ప విద్వాంసులంతా కూడా..
 ఆయన మాటకు గౌరవమిచ్చి ..
అట్లనే పాడేటటువంటి వాళ్ళు ..
చాలా గొప్ప విద్వాంసులు ..

నాకు చాలా సార్లు తోస్తుంది..
 సంగీతాన్న్ని నమ్మి ..
సాహిత్యంలో ఎక్కువగా కృషి చేయనివాడు..
 అనంత కృష్ణ శర్మ అయితే ..
సాహిత్యాన్ని నమ్మి ..
సంగీత ..నాట్యాలను ..
రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేసిన వాణ్ణి నేనేమో అని.

పుట్టపర్తి నారాయణాచార్యులవారి వ్యవహార జ్ఞానం


అసలు అయ్యకు..
ఈ లౌకిక వ్యవహారాల పట్ల..
అస్సలు అవగాహన లేదు.
 
ఏదైనా గవర్నమెంట్ తరఫున లెటరో ..
వ్రాయవలసి వస్తే..
ఏ శ్యామసుందర్ సారునో అడిగే వారు ..
ఒరే ఈ లెటర్ కొంచం రాసి పెట్టరా ..
అని..
..
షేక్స్పియర్ ..మిల్టన్.. షెల్లీ ..ఠాగూర్ ..
లను చీల్చి చెండాడిన అయ్యకు ..
ఒక్క లీవ్ లెటర్ రాయటం రాక పోవటమేమిటి..?
 
వారు ఆశ్చర్యంగా చూసేవారు..
నవ్వుకునే వారు ..
అయినా అర్థం చేసుకొనే వారు
అన్నట్లు ..
శ్యామ సుందర్ సారు..
రామకృష్ణా హై స్కూల్ లో టీచరు..
 
అయ్య ఏ సన్మానాలకు వెళ్ళాలన్నా ..
వాళ్ళను తనతో పిలుచుకు పోయేవారు..
ఒరే ..గుంటూరులో సన్మానముంది 
రారా.. పోయొస్తాం అనేవారు..
వాళ్ళు లీవో ..గీవో ..పెట్టుకుని ..
ఆ రోజుకు సిధ్ధంగా వచ్చే వారు..
 
అయ్య ముందుగానే..
నాతో పాటూ ఒకనికి టికెట్లు మీరే భరించాలి..
అని సన్మాన సంఘం  వాళ్ళకు చెప్పేవారు
అలా మంచి మంచి సభలను 
వారు సైతం ఆస్వాదించారు..

9 ఫిబ్ర, 2012


కేరళలో ఉన్నప్పుడు ..
శ్రీ బూర్గుల రామకృష్ణరావ్ గారి కోరికపై..
ఏకవీరను మళయాళం లోనికి అనువదించగా..
దానిని అక్కడి ఇంటర్మీడియట్ కోర్సులో పాఠ్యాంశం గా పెట్టారట..
తిరువాంకూర్ లోమళయాళ నిఘంటు నిర్మాణం..
1954-56 లలో ..
మళయాళ భాషా సౌందర్యానికి ఆకర్షింపబడి..
అలానే మళయాళ నాటకాలనూ తెనిగించారు.

స్వతంత్ర ప్రతిపత్తి ..
ఇతరులకు అణిగి వుండే నైజం కాకపోవటం వలన ..
సూరనాధ్ కుంజన్ పిళ్ళై
 అక్కడి రాజకీయాలు ..
అధికారుల వైఖరి నచ్చక ..
వెళ్ళి పోదామని అనుకుంటున్నవేళ..

యూనివర్సిటీ అధికారి సూరనాధ్ కుంజన్ పిళ్ళై ..
కేంద్ర సాహిత్య అకాడమీకి ..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా పంపారు.
1958 లో ఈ సంఘటన జరిగింది..
అక్కడ K P కృపలానీ..

మదన మోహన్ మాలవ్యా..
దినకర్..                                                  
మదన మోహన్ మాలవ్యా
పంత్..
మహాదేవీ వర్మ..
వంటి దిగ్గజాలతో పరిచయం..
వ్రజ అవధీ భాషలకు దగ్గర చేసింది..

ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా..        
"ఆంధ్ర ప్రజ మిమ్మల్ని గుర్తించలేదు..
తిరువాన్ కూరు విశ్వ విద్యాలయ ప్రతినిధిగా ..
మేము మిమ్మల్ని ..
కేంద్ర సాహిత్య అకాడమీ కి పంపుతున్నాము" అన్నారు.
పుట్టపర్తి వారి శివ తాండవాన్నీ..
దానిలోని శబ్ద సౌందర్యాన్ని ..
పదే పదే పొగడుతూ ..
అందులోని సంస్కృత శ్లోకాలను అడిగి మరీ వినేవారంతా..
ప్రాకృత భాషలతో మరింత స్నేహం పెరిగింది..
అకాడమీ లైబ్రేరియన్ గా ..
కబీరు వచనావళిని తెనుగించారు.
అక్కడే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో సాన్ని హిత్యం పెరిగింది..
మరింత కృషి సాగేదే..
కానీ విధి విలాసం..
పచ్చ కామెర్ల వ్యాధిసోకింది..
నిరంతర అధ్యయనం ..
అన్న పానాలను పట్టించుకోకపోవటం వలన..
అది మరింతగా విజృంభించింది.

తిరిగి కడప పయనం ..
 అయ్య ఏమంటారూ..
ఏం చేయాలయ్యా..
దేవుడు ఈ ఊరిలో..
నాకు పడక ..భోజనం ..
ఏర్పాటు చేసినాడు అని చమత్కారంగా..


నన్ను జీవితంలో ఎక్కువగా ఆకర్షించినవారు..
ఇద్దరు ..
ఒకరు రాధా కృష్ణ పండితుడు..
రెండవ వ్యక్తి అరవిందఘోష్..
ఆయన రాష్ట్ర పతిగా ఉన్నప్పుడు తరచూ వెళ్ళే వాణ్ణి..
వెళ్ళినప్పుడంతా ..
ఒక గంటసేపైనా మాట్లాడే వాణ్ణి..
ఆయనలో ఒక గొప్ప సుగుణం ఉంది.
మన ప్రాంతాల్లోనే ఎక్కువ పని చేసిన వాడు కదా..
తాను చూసిన..
ప్రతి చిన్న వాని క్షేమమూ అడిగేవాడు..

భారత దేశానికి అధ్యక్షుడైనా..
ఆయనది అధ్యాపక మనస్తత్వమే..
నేనాయన దర్శనానినికి పోక పోయినప్పుడు..
కోపపడిన రోజులు కూడా ఉన్నాయి..
ఒకసారి ప్రపంచ శాంతి మహా సభలకు ఢిల్లీ వెళ్ళాను.  

అప్పుడాయన వైస్ ప్రెసిడెంట్ ..
కారులో ఆఫీసుకు పోతూ..
అదాటుగా చూచాడు.
పిలిపించి కోప పడినాడు..
క్షమాపణలు చెప్పుకున్నాను.
ఆయన పాండిత్యం పై నాకెంతో మోజు..