22 ఫిబ్ర, 2012

సరస్వతీపుత్ర మహాకవి డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారి ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ

సరస్వతీపుత్ర..
మహాకవి..
డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారిని..
అప్పట్లో ..
ఆకాశవాణి కడప కేంద్రం ఇంటర్వూ చేసింది..

అయ్యగారి ..
అపురూపమైన గొంతు లోంచీ ..
వారి జీవిత విశేషాలను వినడం..
 ఓ అపూర్వ అనుభవం..

ఆ రోజులలో ..
అయ్య గారి ఉపన్యాసాలను..
విలువైన గ్రంధాలనూ..
అభాగ్యులమై చేజార్చుకున్నా..
ఈ చివరి జ్ఞాపకాన్ని మిగుల్చుకో గలిగాం..
మీరూ వినండి..

2 కామెంట్‌లు :

  1. వినగ వినగ నెంత వేడుక గల్గించు
    గాథ, యిది వచించు కరణి యంత
    కన్న మిన్న, పైని యాకథ వినిపింప
    వయ్య! వల్లకీస్వరాऽబ్ధి హృదయ!

    - సీమ మాండలికం, అదీ పండితుని గొంతులో! :)

    అనేక విషయాలు మనకు బౌద్ధికంగా మాత్రమే అర్థమవుతాయి. పుట్టపర్తి వారు పండితుని గురించి చెప్పిన విషయాలు అర్థం కావడానికి ’మరేదో’ కావాలి. ఆయన రసదృష్టియే శారదాతత్త్వం అన్న విషయం కూడా అంత త్వరగా ఎవరికీ తెలియకపోవచ్చు. తెలిసిన వారూ చెప్పలేరు. విషయాలన్నీ తెలియజెప్పేవి కావు. తెలుసుకునేవి కూడా కొన్ని ఉంటవి. వాటిలో ఇది ఒకటి.

    రిప్లయితొలగించండి
  2. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరతు
    అంతే నండీ ..

    చక్కగా చెప్పారు..
    అయ్య రచనలపై ఇతరుల అభిప్రాయాలను వ్యాసాలను జీవిత విశేషాలను నా పరిధిలో పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామ భద్రుడట..అన్న రీతిలో అయ్యకు సజల నేత్రాలతో భక్తి పూర్వకంగా సమర్పించే ఆత్మ నివేదన ఇది..
    అయ్యకు సంబంధించినవన్నీ నెట్లో పెడితే భవిష్యత్తులో ఎవరైనా ఉపయోగించుకుంటారన్న ఆశకూడా..
    చక్కగా చెప్పారు..

    రిప్లయితొలగించండి