29 మే, 2013

శ్రీ శివ లీలా స్తవము






అవి 

పుట్టపర్తి చివరి రోజులు..
''శ్రీ శివలీలా స్తవాన్ని'' 
ఆ రోజుల్లో శిష్యునిగా భక్తునిగా 
ఇంటికి తరుచూ వచ్చే
లక్ష్మీ కాంతం శ్రేష్టి చేతిలో పెట్టారు
ప్రచురించమని 

పుట్టపర్తి వ్రాత అర్థం కాక
తిరిగి అడిగితే ఆగ్రహిస్తారేమో నన్న భయంతో 
కొన్నాళ్ళు..
సంస్కృత శ్లోకాను ..
అవీ శివ పార్వతుల శృంగార ప్రధానమైన వానిని
ప్రజలు యే విధంగా అర్థం చేసుకుంటారో నని కొన్నాళ్ళూ 
కాలయాపన చేసారు..

ఈలోగా 
పుట్టపర్తి పరలోక గతులయ్యారు.
తరువాత 
తన గురువు చివరి కోరిక తీర్చలేకపోయానన్న
బాధ లక్ష్మికాంతం శ్రేష్టిని ఆవరించింది
ఆయన తన ప్రెస్సుకు వచ్చిన 
బ్రహ్మశ్రీ అయిలావఝ్ఝుల రామకృష్ణ శాస్త్రి గారిని 
వనిని కాస్త అర్థం అయ్యేలా వ్రాసి ఇమ్మని అర్థించాడు

వానిని పరిశీలించిన ఆయన

పార్వతీ దేవి అంగాంగ వర్ణన 
ఒక్క ఆది శంకరులకే చెల్లింది..
మరి పుట్టపర్తి వారి ఈ శ్లోకాలను
ఏ విధంగా అర్థం చేసు కోవాలని ఆలోచించి
క్షేత్రయ్య అన్నమాచార్యులు 
జయదేవుడు నారాయణ తీర్థులూ 
భగవంతునిపై శృంగార కీర్తనలు చేసారు..

అనుకొని..

పుట్టపర్తి ఆధ్యాత్మిక సాధనావిశేషములను
 పూర్తిగా తెలిసిన వాడవటంచేత..
అట్టి వ్యతిరేక అనుకూల భావాలు
వారి వారి ప్రాక్తన జన్మార్జిత 
సుకృత దుష్కృత పరిణామ ఫలానుసారంగా 
ఏర్పడతాయని భావించి

ఎత్తివ్రాయడమే కాదు 

శ్లోకాలు చాలా ఇంపుగా వున్నాయి
వీనికి తాత్పర్యం కూడా వ్రాస్తాను అని అడిగారు
శ్రేష్టి  సంతోషంతో ఒప్పుకొని 
పుస్తకాన్ని ముద్రించారు
అదే ఇది..

మా తండ్రి 

కలను నెరవేర్చడంలో నేనూ పాత్రధారి నైనాను
వారి దివ్యాశీస్సులు నాకూ అందుతాయి 


ఒకసారి

లక్ష్మికాంతం శ్రేష్టితో ఫోన్ లో మాట్లాడాను
ఎంత సంతోషపడ్డారో చెప్పలేను
ఆరోజుల్లో 
చాలామంది మంత్రోపదేశం చేయమని
అయ్య అమ్మలను ప్రాణాచారం పడేవారు
కానీ
అందరికీ మంత్రం ఇచ్చేవారు కాదు..
కొందరికి ఏవో స్తోత్రాలు..చెప్పి పంపేవారు..
నీకు ఇదే సరిపోతుంది 
దీనినే త్రికరణ శుధ్ధిగా చేయి అనేవారు

కానీ కొందరు విడిచేవారు కాదు

పలురకాలుగా ఇబ్బంది పెట్టేవారు
అయ్యను నీడలా నుసరించి
వారికి సేవలు చేసి
పురాణానికి వెళ్ళే టప్పుడు
వెనుక భాగవతం పట్టుకుని నడిచీ
ఏవేవో చేసే వారు
వారి దృష్టిలో పుట్టపర్తి భగవత్స్వరూపుడే..

ఎవ్వరెన్ని చెప్పినా

వారే ఎన్ని చూచినా పట్టించుకొనే వారు కాదు.

అయ్య తప్పించుకోవటానికి 

'మీ అమ్మ దగ్గరికి పో..'
అని పంపే వారు..

అమ్మ 

ఇక తప్పక..
వారికి యేదో చెప్పి పంపేది..

అలా యెన్నో సంవత్సరాలు అనుసరించిన వాడే

నా గురుదేవులు
వ్యాసం వ్రాసిన రఘూత్తమ రావు..


రఘూత్తమ రావ్ ద్వారా 

ఏవేవో అనుభవాలను విన్న వారు మాకూ అయ్యను మంత్రోపదేశం చేయమని చెప్పు అని బ్రతిమాలేవారు..

ఒక్కో సారి అయ్య 

ఒరే .. నా ఆశ్రయం పొందితే ఉన్నవి కూడా పోతాయి
సర్వ భ్రష్టుదవవుతావు..
లెక్కలేనన్ని కష్టాలు చుట్టుముడతాయి..
అవి నీవు భరించలేవు..
పరమాత్మ నీ మానసిక శక్తిని పరీక్షించి వదులుతాడు..
ఎందుకీ బాధ..
''మీ అమ్మ దగ్గరికి పో..
ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతావు..''
అని చెప్పేవారు

అన్యాపదేశంగా 

నేను 
నారాయణ స్వరూపుడిని
మీ అమ్మ
లక్ష్మీ స్వరూపం 
అని చెప్పక చెప్పినట్లే కదా 
అని ఆనాటి భక్తులూ శిష్యులూ పరవశంతో అనుకొని
ఇంకా
ఇంకా
వెంటపడేవాళ్ళు.. 

అన్నట్లుగానే..

రఘూత్తమ రావ్
అయ్యను ఆశ్రయించిన కొన్నేళ్ళకే
ఆయన భార్య.
ఎదిగిన కొడుకూ
వయసొచ్చిన కూతురూ..
హటాత్తుగా కన్నుమూసారు..


ఈ విషయాలు చిన్నపిల్లలమైన మాకు 

బాధపడుతూ కాక
అదేదో ఒక తమాషా సంఘటనలాగా చెప్పేవాడు
 రఘోత్తమరావ్ సారు 

అమ్మను ఆశ్రయించి

అన్ని కష్టసుఖాలలో అమ్మకు చేదోడుగా వున్న
మా అన్నయ్య మాలేపాటి సుబ్రమణ్యం
చదివింది అయిదో క్లాసు అయినా
చిన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరి.. 
Oriental General Insurance కు 
Divisional Manager  స్థాయికి ఎదిగాడు..


''అయ్యకు చేతబడి విద్య కూడా తెలుసమ్మా..''
అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు లక్ష్మీకాంతం శ్రేష్టి..
''కానీ 
అయ్య వానినెప్పుడూ దుర్వినియోగం చేయలేదు..''
అన్నాడు కూడా..








Enter your message here.

25 మే, 2013

20 మే, 2013

పెద్దన్నవరూధిని - రోషభీషణ






తెలుగు పంచ మహా కావ్యాలలో

 ప్రథమ ప్రబంధం మను చరిత్ర. 

మార్కండ డే య పురాణంలోని ఒక చిన్న కథను 

తీసికొని 


తన అద్భుత కవితా ప్రావీణ్యంతో 


ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు 


వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు 

పెద్దన. 



ఒక వరణా తరంగిణిని, 

ఒక అరుణాస్పద పురాన్ని, 

ఒక ప్రవరుని 

ఒక వరూధినిని, 

ఒక స్వరోచిని, 

ఒక మనోరమను సృష్టించి 

పాఠకుల హృదయాలలో 

ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

అయితే 

అందులోని ''తరుణి ననన్య కాంతను''

 అనే పద్యం గురించిన చరిత్రను చెబుతూ 

ఈ పద్యం పెద్దన్నది కాదని

 ''పద్యం బొక్కటి చెప్పి..'' లో పుట్టపర్తి వారు 

అంటున్నారు ..






''తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్ప శిలెముఖ వ్యధా
భరవివశాంగి నంగభవు బారికి, నగ్గము సేసి, క్రూరుడై
యరిగె, మహీసురాధము దహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె కషాయదీధితిన్..'' 

పెద్దన్న గారు ఏమనుకొని యీ పద్యం వ్రాసినారో
నాటినుంచీ చాలామందిని యీ రచన వేధిస్తూ వుంది.
నా చిన్నతనంలో 
యీ పద్యం పెద్దన్న గారిది ఔననీ-కాదనీ 
యెన్నో వదోపవాదాలు జరిగాయి

ఇంతకూ యిందులో యేమి చెప్పినాడాయన..
ప్రవరుడు వరూధిని మీద బడితే త్రోసివేసినాడు
ఆవిడ .. తరుణి.. 
మంచి వయస్సులో వున్నదన్నమాట..

'అనన్య కాంత..'
అంతకుముందే మగవాని స్నేహమూ లేనిది..
'కన్నెరికపు రతి'యని 
పెద్దన్నగారే..వేరొకచోట సర్టిఫికెట్టు ఇచ్చినారు..

అటువంటి స్త్రీ 
యేకాంతంలో తనకు తానై వలచివస్తే
ఆమెను మన్మధుని బాణాలకు అగ్గము చేసిపోయినాడని 
ప్రవరునిపైన సూర్యునికి విపరీతమైన కోపము వచ్చిందట..

ఆ కోపంతో 
ఆయన ముఖమండలం యెర్రబారింది..
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి  వర్ణిస్తూ వున్నదీ పద్యం
పైగా .. 
ఇందులో ప్రవరునికి వాడిన విశేషణాలు దారుణంగా వున్నాయి

క్రూరుడు.. 
మహీసురాధముడు.. 
అహంకారి..  అని
ఆయనకు యిచ్చిన యోగ్యతా పత్రాలు

యీ పద్యం నిజంగా పెద్దన్న గారిదే అయితే
ఆయనకు వరూధినిపైన విపరీతమైన సానుభూతి యని 
అర్థమవుతూ వుంది.

అంటే 
ప్రవరుడు వరూధినిని పొంది వుండవలసిందన్నమాట..
నా చిన్నతనంలో
కొందరు 'ఆంగ్ల విద్యా వాసనావాసితులు'
 దీనికిట్లే అర్థం చెప్పి నైష్టికులను గేలిచేసేవారు..

నిజంగా 
పెద్దన్న గారి అభిప్రాయం కూడా అదే అయితే
ఆ లాలసతను చెప్పడానికి 
ఇంత పెద్ద కావ్యం వ్రాయవలసిన పనే లేదు..

పైగా .. 
కావ్యం కూడా కొత్త మలుపు తిరిగి వుండేది..
ఆయన అభిప్రాయం కావ్యరచన్లో 
'కర్మ నిష్టనూ.. '
'వైదిక శ్రధ్ధనూ ..'
సమర్థించడమే..

పైగా యీ పద్యంలో
 ''నభోమణీ' శబ్దం యేమీ బాగ లేదు..
యౌగికార్థం సరిపోదు
రూఢ్యార్థాన్ని  తీసికొని సూర్యుడనే అర్థం చెప్పుకోవలె..

పెద్దన్నగారికి
 ఇలా కక్కుర్తిగా శబ్దాన్ని వాడే దారిద్ర్యం లేదు..
ఇంతకూ యీ రచన ఆయన చేసి వుండడనేది నా అభిప్రాయం
మరి దీనికి బదులు వేరే పద్యం వుండేదో 


లేక ఆ వర్ణనే లేకుండా వుండేదో కూడా చెప్పలేము..
అలా వుండడానికిన్నీ వీలు లేదు కదా
కావ్య ధర్మాన్ని బట్టి 
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి యేదో ఒక రీతిగా వర్ణించవలసిందే..

ఇంతకూ 
పెద్దన్న యే ముహూర్తంలో దీనిని వ్రాసారో 
అప్పటినుంచీ యీ రచన చాలా గందరగోళంగానే వుంది.. 


15 మే, 2013

ఖైదీ ..


శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..







శ్రీరామ దర్శనము..DR.M.కులశేఖరరావు..

 పుట్టపర్తి వారి జనప్రియ  రామాయణము 
యధార్థానికి అమృత ప్రవాహము లాంటిది..
ఈ ప్రవాహములో దిగి ..
రసమును చవి చూచే శక్తి మనకుండవలెనే గానీ ..
దానివలన ..
మధురాతి మధురమైన అనుభూతి కలుగుతుందనటంలో 
సందేహం లేదు..

ఒకచోట పరతత్త్వ స్వరూపం దర్శనమిస్తే..
మరోచోట లక్ష్మణస్వామి విశేష శేష స్వభావం ప్రకటమవుతుంది..
ఇలా..
అరణ్య కాండలో 
శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు దర్శించిన ఘట్టాన్ని 
వివరిస్తున్నారు కులశేఖరరావు గారు

చివరగా..
శ్రీరామునికి సుగ్రీవుని వంటి మంచి చెలికాడు లభించుట 
పరమార్థమే అయినప్పటికీ
 ఆ భగవత్స్వరూపునికి 
ఉత్తమ భక్తుడు లభించిన విశేషమునే 
కవి ఉదాత్తంగా చెప్పి 
సందర్భానికి రమణీయార్థాన్ని కలిగించారు

ఒక మహాకావ్యానికి 
ఇంతకంటే మంచి ప్రయోజనం కానీ ఔత్కృష్ట్యం  కానీ 
ఉంటుందని నేననుకోను అంటూ ముగించారు..
మరి చదవటం మొదలెడదామా.. 




13 మే, 2013

A.S. రామన్


అవధాని సీతా రామన్ 
A.S. రామన్ పూర్తి నామం


పుట్టపర్తి వారు
 ప్రొద్దుటూరు హైస్కూల్ పండితునిగా ఉన్నప్పుడు 
ఫిప్త్ ఫారం కాబోలు చదువు కున్నాడు A.S. రామన్.. 
ఇంగ్లీషు సాహిత్యం లో 
జర్నలిజం లో బాగా కృషి చేసాడు.
వందసంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కి 
తొలి భారతీయ ఎడిటర్ గా పనిచేసాడు..
సత్య సాయి బాబా గారి గురించి కానీ
దక్షిణాది సంగీత విద్వాంసుల గురించి కానీ
తొలిసారి ఉత్తరాది వారికి పరిచయం చేసిన వ్యక్తి 
ఆయన హయాంలో 

రెండు మూడేళ్ళపాటు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సర్క్యులేషన్ బాగా పెరిగింది.
A.S. రామన్ 

పుట్టపర్తి వారి గురించి యేం చెబుతారో తెలుసుకుందాం..




నేనూ ..
పుట్టపర్తి నారాయణాచార్యులూ 
ముఫ్ఫయ్యవ దశకం మధ్యలో 
మా ఉమ్మడి సాహిత్య కృషిలో 
సన్నిహిత సహచరులమయ్యాము. 

కానీ 
మేమేదీ ఉమ్మడిగా ప్రకటించలేదు. 
మేము సాహిత్య విషయాల మీద గంటల కొద్దీ చర్చించుకొనేవాళ్ళం ఒక్కొక్కప్పుడు 
మేము తీవ్ర వాదోపవాదాల్లో చిక్కుకునే వాళ్ళం కూడా. 
కానె చివరికి ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్ళం లేదా, 
ఎవరి అభిప్రాయం వారిది అన్న అంగీకారానికి వచ్చేవాళ్ళం 

మా అన్యోన్య ప్రతిస్పందన 
ఆత్మీయంగానూ 
పరస్పర ప్రేరకంగానూ ఉండేది. 

మా విడదీయరాని అన్యోన్యత 
నేను 1942 లో ఢిల్లీ వెళ్ళేవరకూ కొనసాగింది.
అప్పటినుంచీ నేను వెనుదిరగలేదు. 
భారతికి మాత్రం రాస్తూ ఉండేవాడిని 

ఇంగ్లీషు సాహిత్యం లోని 
సరికొత్త ధోరణులను ఎరుకపరచడంద్వారా 
నేను పుట్టపర్తి సాహిత్య దృష్టిని మరింత విశాలం చేయగలిగానని 
గర్వంగా చెప్పుకోగలను. 

నా తెలుగు రచనా వ్యాసంగంపై 
ఆయన ప్రభావం కృషి ఏకాంక నాటికలలో ఉండేది. 
నాకన్న పెద్దవాడు కానీ.. 
విజయం సాధించిన వాడు కానీ 
అయిన కవిని అనుసరించి నన్ను నేను తీర్చి దిద్దుకోవటానికి
 నా స్వంత ప్రపత్తి ఆత్మ గౌరవం అడ్డువచ్చేవి.. 

(శ్రీ A.S.రామన్ పుట్టపర్తి వారి వద్ద 
ప్రొద్దుటూరు హైస్కూల్ లో చదువుకున్నారు. 
తరువాత వారిద్దరూ సన్నిహితులైనట్లు 
పై వ్యాసం తెలియజేస్తూ ఉంది..
-ఆంధ్రప్రభ,సచిత్ర వార పత్రిక)



9 మే, 2013

ఫిరదౌసి...





క్రీస్తు పూర్వం పదకొండో శతాబ్ది..
పర్షియా రాజు గజినీ..
భారదేశంలోని అపార ధనరాశులను కొల్లగొట్టి ..
తన దేశానికి తరలిస్తాడు..

తన వంశ చరిత్ర చిరస్థాయిగా నిలిచేటట్లు 
కావ్యం వ్రాయమనీ 
అందుకు బదులుగా 
తాను ఒక్కో పద్యానికీ ఒక్కో బంగారు నాణెం ఇస్తానంటాడు.
దానికి అల్లా ప్రమాణమని నమ్మబలుకుతాడు..

ముఫైయ్యేళ్ళపాటు శ్రమించి
న  
అరవై వేల పద్యాల ఆ కావ్యానికి 
బంగారు నాణాలకు బదులు వెండి నాణాలను ఇవ్వబోతాడుగజినీ.. 

కానీ ..
కవి వానిని తిరస్కరించి..
నిరసన పూర్వకంగా రాజుకు లేఖ వ్రాసి పంపిస్తాడు

అందుకు కోపించిన గజినీ 
ఫిరదౌసిని చంపమని సైనికులకు ఆఙ్ఞ ఇస్తాడు.. 

''అల్లా తోడని పల్కి..
నా పసిడి కావ్య ద్రవ్యంబు..
వెండితో చెల్లింపగ దొరకన్న టక్కరివి ..
నీచే పూజితుండైనచో అల్లకున్ సుఖమే..??"


అని కొన్ని పద్యాలు మసీదు గోడలపై వ్రాసి 
తన కుటుంబంతో సహా వేరొక దేశానికి పారిపోతాడు ఫిరదౌసి..
అక్కడ
 దుర్భర దారిద్ర్యం తో మరణిస్తాడు..
గుర్రం జాషువా ఫిరదౌసిని అద్భుతంగా చిత్రించి 
ప్రజల మనసుల్లో శాశ్వతమైపోయాడు
మరి..
పుట్టపర్తి వారు 
తన మేఘదూత కావ్యంలో 
మేఘం తో చెప్పిన పంక్తులలోని  ఫిరదౌసి ఇదిగో.. 




''యశోధర''





ఆ బుద్ధుని సతి  యశోధర  చవి  చూసిన దుఃఖాన్ని 
ఎదుర్కొంది మా అమ్మ 
ముగ్గురు పిల్లల తో వంటరిగా నిలబడింది దుఃఖాశ్రువులతో 
బుద్ధుడు నడిరాత్రి ఇల్లు విడిచాడు 
అందుకే ''నీ మనసు చల్వయే బుద్దునింతవరకు నిల్పినది కాలమందు.. '' అంటుంది 





8 మే, 2013

''రాతి రధము''




ఒకానొకప్పుడు 
జీవకళ యుట్టిపడుచు 
అప్పటి శిల్పుల కళాజీవనమునకు వ్యాఖ్యానమై 
కృష్ణరాయల కీర్తి తనువు దాల్చినట్లున్న రధము 
యీనాడు శిధిలమై 
చూచిన ప్రతి యువక హృదయమును 
ఆవేశముచే నూగిసలాడించు రూపముతొ 
విఠ్ఠలాలయము ముందు నిలచి యున్నది..

''కావ్యద్వయి'' నుంచీ రచన పుట్టపర్తి కనకమ్మ 




7 మే, 2013

'మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము''



ఈ ''మహరాష్ట్ర వాఙ్మయ ప్రభావము''లో 
ఎన్నెన్ని విషయాలో..
ప్రాకృత భాషాభేదములలో మహరాష్ట్రి ఒకటి..
నేటి మరాఠీ కి 
ఆ మహరాష్ట్రి ప్రాకృతమే మూలభాష..

హాల చక్రవర్తి ప్రాకృత గాధలను సేకరించి 

వానికొక రూపమిచ్చాడు..
అంతే గాదు ..
తాను కూడా స్వయంగా కొన్ని గాధలను వ్రాసాడు

ఆంధ్రుడైన హాలుడు 

నేటి మరాఠీకి మూలభాషయైన 
మహరాష్ట్రి యనబడే 
ప్రాకృత భాషా భేద రూప భాషలో రచనలు చేసాడు


ఈ విధముగా

మరాఠీ భాషకు పురుడు తీర్చిన ఘనత
మన తెలుగు వారిదేనట..
కొంతలో కొంత..

పాండురంగడక్కడ చాలా ప్రభ గలిగిన దేవుడు..

విద్యానగర ప్రభువైన కృష్ణదేవరాయని
 ఆ పాండురంగడు ఆకట్టుకొనెనట.

విఠలాలయమునకు పునాది వేయుటే

ఇందుకు సాక్ష్యమట..
కృష్ణదేవరాయనికి పాండురంగనిపై కన్నుపడుటకు
ఆనాటి ద్వైత భక్తులు కారణమట..

విద్యానగరమునకున్న ఈ అభిమానము ''పాండురంగమహాత్యమై''నదట..

పుట్టపర్తి గద్య రచనా శైలి..
చమత్కారాలు..
విరుపులూ..
వ్యంగ్యాలు..
చారిత్రకునిగా పుట్టపర్తికి ఎందుకు పెద్దపీటవేస్తారో అర్థమైంది..

ఒక తపస్సంపన్నుని దృష్టితో కూడ చరిత్రను చూచి

సమర్థ రామదాస స్వామి వంటి వారిని గురించి చెబుతూ..
'తనకు తగిన రాజు ఎవ్వడని ..?'
కాశి నుంచీ కన్యాకుమారి వరకూ చుట్టినాడట
''అప్పటికి విజయనగర వంశస్తుడైన
అళియరామరాయలు బ్రతికి వుండినా
వారికి ఈ రామరాయలపై ఎందుకు చూపు పడలేదో
బహుశః
ఆతపస్వి దృష్టికి విద్యానగరము కాలసర్ప దష్టమైపోవునని ముందే తోచెనేమో చెప్పలేము ''
అంటారు పుట్టపర్తి
మీరూ చదవండి..


ఇందులో ఏకవీరా దేవి ప్రస్తావన వుంది..


ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని 

ధులియా పట్టణం సమీపంలోని 
పంజహర్ నదీ తీరంలో వెలసివుంది. 

ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది. 

ఏకవీరా దేవి 

ఏకవీరా దేవి 

ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం.
 ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి.
 ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి.
 పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను, 
జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి. 
రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి. 





 
 










3 మే, 2013

షాజీ కావ్యాన్ని పుట్టపర్తి తన పందొమ్మిదవ యేట వ్రాసారు 
అప్పటికాయన తిరుపతిలోచదువుతున్న విద్యార్థి.
 రచనను పుట్టపర్తి నోటివెంట విని సమ్మోహితులైన తోటి విద్యార్థులు 
దీని ముద్రణకు కారకులయ్యారు. 

ఇందులో ఇంకో విశేషముంది
 అదేవిటంటే.. 
ముద్రణ అయిన మరుక్షణం ఇది నాటి ఇంటర్ మీడియట్ పాఠ్య గ్రంధమైంది 
రాసినవాడప్పటికి ఇంకా విద్యార్థియే.. 
 అంతటి అమూల్యమైన కావ్యాన్ని
 మీ ముందుకు భక్తి పూర్వకంగా తెస్తున్నది 
వారి ప్రియ పుత్రిక శ్రీమతి పుట్టపర్తి అనూరాధ


2 మే, 2013

నేననెడు భావమున ..


పూప వయస్సులో ..


పరసతులన్ ..


పోలాప్రగడ సత్యనారాయణమూర్తిగారి ప్రముఖుల పరిచయాల ''ఆరోజుల్లో"


 పోలాప్రగడ సత్యనారాయణ గారు
బాపట్ల నెల్లూరు ప్రాంతాలకి అయ్యతో కలిసి   సన్మానాలకు వెళ్ళినప్పుడు
వాళ్ళింట్లో దిగటం గుర్తు 
వారి భార్య రాజ్జలక్ష్మి గారూ గుర్తే
కానీ నా దురదృష్టం నా వయసు  పదేళ్ళలోపే 
లీలగా తప్ప ఏవీ గుర్తులేవు
ఈ పుస్తకాన్ని నాగక్కయ్య ఇచ్చింది.
పోలాప్రగడగారు మంచి కథకులు నవలలూ వ్రాసేవారు
వారి శ్రీమతీ పేరుపొందిన రచయిత్రి

ఇదిగో..  ఇదే ఆ రోజుల్లో .. 



ఇది పోలాప్రగడ పరిచయం 


పోలాప్రగడ సత్యనారాయణగారు
 "ఆ రోజుల్లో"
అంటూ ప్రముఖులతో తన పరిచయం తో పాటూ 
రక రకాల తమాషా సంగతులను వివరిస్తూ 
మనని యాభైయ్యేళ్ళ వెనక్కు తీసికెళ్ళారు 
ఇందులో పుట్టపర్తి వారి ప్రస్తావనా వుంది 

"ఆ రోజుల్లో ..
ఎందుకు వ్రాసారో ఆయనే చెబుతారు వినండి..




ఆ రోజుల్లో ఎలా వుండేది..?
టీవీలు లేవు రేడియోలే..
ఫ్రిజ్జులు లేవు కుండలోనీళ్ళే..
సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోనే
గ్యాసు పొయ్యిలు లేవు కుంపట్లే..
ఇలా ఎన్నో ..

మరి ఈనాడో ..?
ఎన్ని సౌకర్యాలో ..
వాటితో పాటూ
మంటగలిసిన మానవతా విలువలను సభ్యతా సంస్కారాలనూ మనకు గుర్తు చేస్తారు పోలాప్రగడ 





ఇక పుట్టపర్తి గురించి ఆయనేం వ్రాసారంటే..